Labels

Wednesday 12 July 2017

CHILD CARE LEAVE (CCL)

CHILD CARE LEAVE (CCL)


 మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 90 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం *జివో.209 తేది:21-11-2016* ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.

90 రోజుల సీసీయల్ ను విడతకు 15 రోజులు మించకుండా కనీసం ఆరు విడతల్లో మంజూరుచేయాలి.
180 రోజుల ప్రసూతి సెలవుకు ఈ సీసీఎల్ అదనం.
ఇద్దరి పెద్దపిల్లల వయస్సు 18 ఏళ్ళు నిండేవరకు సీసీఎల్ అనుమతించాలి.
40 శాతం ఆపై అంగవైకల్యం కలిగియున్న పిల్లలు ఉన్న పక్షంలో 22 ఏళ్ళ వరకు మంజూరుచేయాలి.
ఇద్దరికంటే ఎక్కువ సంతానం కలిగిఉన్నట్లయితే మొదటి ఇద్దరి పిల్లల వయస్సును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి.
మహిళా ఉద్యోగుల,టీచర్ల  పిల్లలు పూర్తిగా వారిపై ఆధారపడి వారితో కలిసి ఉంటేనే సీసీఎల్ మంజూరుచేస్తారు.
పిల్లల పరీక్షలు,అనారోగ్యంతో పాటు పిల్లల ఇతర అవసరాలకు సిసిఎల్ మంజూరుచేయాలి.కేవలం పిల్లల పరీక్షలు అనారోగ్యం సందర్భాలలో మాత్రమే సీసీఎల్ అనుమతించడం నిబంధనలకు విరుద్దం.
శిశుసంరక్షణ సెలవు పొందడం హక్కు కాదు.కేవలం సెలవు పత్రం సమర్పించి  సీసీయల్ పై వెళ్ళకూడదు.అధికారి నుండి ముందస్తు అనుమతి పొంది వెళ్లాలి.
మొదటి విడత సీసీయల్ మంజూరు సమయంలో పుట్టినతేది సర్టిఫికెట్లు దరఖాస్తుకు జతపరచాలి.ఇతర ఏ రకమైన సర్టిఫికెట్లు అవసరంలేదు.
ఆకస్మిక, ప్రత్యేక ఆకస్మికేతర సెలవు మినహా ప్రసూతి సెలవుతో సహా ఏ రకమైన సెలవుతోనైనా కలిపి వాడుకోవచ్చును.
ఆకస్మికేతర సెలవు(OCL) కు వర్తించే ప్రిఫిక్స్,సఫిక్స్ నిబంధనలు ఈ సెలవుకు కూడా వర్తిస్తాయి.
శిశుసంరక్షణ సెలవు ముందు రోజు పొందిన వేతనాన్ని సెలవు కాలానికి చెల్లిస్తారు.
ఇట్టి సెలవు ఖాతాను ప్రత్యేకంగా నిర్వహిస్తూ సర్వీసు పుస్తకానికి జతపర్చాలి.రెగ్యులర్ సెలవు ఖాతాకు ఈ సెలవు ఖాతాను కలుపకూడదు.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment