Labels

Tuesday 30 May 2017

GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్:

GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్:


 చందాదారుడు 20 సం॥ సర్వీసు పూర్తిచేసినా,లేక పదవీ విరమణ చేయడానికి 10 సం॥ మిగిలివున్న ఉద్యోగి తన GPF ఖాతా నుండి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ చేసుకోవడానికి అనుమతి మంజూరుచేస్తారు రూల్ -15A

 గృహసంబంధ అంశాల విషయంలో ఉద్యోగి 15 సం॥ సర్వీసు పూర్తిచేసినా పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ తీసుకోవడానికి అర్హత కలదు.

 పదవీ విరమణ పొందడానికి చివరి 4 నెలల సర్వీసులో ఎటువంటి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ అనుమతించబడదు కాని కొన్ని ప్రత్యేక సందర్భాలలో అనుమతించవచ్చును.
(G.O.Ms.No.98 తేది:19-06-1992)

 సాధారణంగా 6 నెలల తరువాతనే రెండవ పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ అనుమతించాలి లేక ఒక ఆర్ధిక సం॥లో రెండు కంటే ఎక్కువ పార్ట్ ఫైనల్ డ్రాయల్ మంజూరు చేయరాదు రూల్-15B

 GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ తీసుకుంటే ఎటువంటి రికవరీ ఉండదు .

 GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ దరఖాస్తును అపెండిక్స్-O లో సమర్పించాలి.

 ఉద్యోగి పదవీ విరమణ చేసినా,లేక ఉద్యోగానికి రాజీనామా చేసినా లేక మరణించినా అతని ఖాతాలో నిల్వ ఉన్న మొత్తం అతనికి,అలాగే ఉద్యోగి చనిపోతే అతడు సమర్పించిన నామినేషన్ ప్రకారం కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. నామినేషన్ లేని సందర్భాలలో అర్హత కలిగిన కుటుంబ సభ్యులందరికీ సమాన వాటాల ద్వారా చెల్లిస్తారు రూల్-28,29,30

 GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్,ఫైనల్ విత్ డ్రాయల్ బిల్లులను ఫామ్-40 లో దాఖలు చేయాలి.అలాగే ఫామ్-40A కూడా జతపరచాలి.

 జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో పనిచేయు ఉద్యోగులకు ప్రధానోపాధ్యాయులు,
మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ మంజూరుచేసి ఫాం-40 తో పాటు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి పంపి సదరు సొమ్మును ఉపాధ్యాయులకు చెక్కు ద్వారా చెల్లిస్తారు.
(G.O.Ms.No.447 Dt:28-03-2011)

.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Sunday 28 May 2017

Leave GO s

 Leave GO s

Go Ms No.186, Dt.23-7-1975 - Half Pay Leaves
2.Go Ms No.295, Dt.13-8-1985 - Mis Carriage Leaves - 42 Days
3.Go Ms No.374, Dt.16-3-1996 - Extra 5 days Leave for women
4.Go Ms No.214, Dt.3-9-1996 - Extra Ordinary Leave
5.Proc.No.132/E1-1/2008 Dt.7-5-2002 Preservation of EL's
6.Go Ms No.231, Dt.16-9-2005 - Paternity Leave - 15 Days
7.Go Ms No.180, Dt.29-6-2006 - Increment
8.Go Ms No.68, Dt.28-3-2011 - Medical reimbursement - Extended up to June - 2017, under Control of DEO Rs.50,000/- and above to DSE Hyd.
9.Go Ms No.52, Dt.1-4-2011 - Histerectomy Leave
10.Go Ms No.447, Dt.28-11-2013 - GPF Part final withdrawal - Non refundable fund
11.Go Ms No.23, Dt.13-8-2014 - TG Increment
12.Go Ms No.39, Dt.15-4-2015 - 50% Amount - GPF Loan&Advance
13.Go Ms No.49, Dt.27-4-2015 - TSGLI - Slab rates
14.Go Ms No.103, Dt.24-7-2015 - PHC Aloowance Rs.2000/-
15.Go Ms No.27, Dt.24-9-2015 - Education Concession fee reimbursement - For 2 Children,each one Rs.2500/-
16.Go Ms No.83, Dt.5-12-2015 - Flag fund - Non Gazetted Rs.100/- Gazetted Rs.200/-
17.Go Ms No.4, Dt.19-3-2016 - Reader Allowance - SGT - Rs.1200/pm SA - Rs.1500/-pm - Jr.Lecturers & above Rs.2000/pm
18.Go Ms No.122, Dt.11-4-2016 - Obsequies Charges - for deceased employees Rs.20,000/-
19.Go Ms No.152, Dt.4-5-2016 - Maternity Leave - 180 Days
20.Go Ms No.107, Dt.23-7-2016 - Eggs for a week(3 Eggs)
21.Go Ms No.134, Dt.1-10-2016 - MDM - Ps Level Rs.6.13 Up/Hs Level Rs.8.18 including 3 eggs
22.Go Ms No.209, Dt.21-11-2016 - Child Care Leave - 90 Days
23.Go Ms No.2529, Dt.22-11-2016 - General & Otional Holidays


అసాధారణ సెలవు:
(EXTRA ORDINARY LEAVE)

AP Leave Rules 1933 Rule 16,19,23,25 ,26(b) ప్రకారం సర్వ సాధారణంగా ఉద్యోగులకు ఏ విధమయిన సంపాదిత సెలవు గాని,అర్ధవేతన సెలవు గాని లేనిపక్షంలో అసాధారణ సెలవు కోసం అభ్యర్ధిస్తారు.అసాధారణ సెలవునే మరియొక పేరుతో జీతం లేని సెలవుగా పరిగణిస్తారు.

 ఏ ఇతర సెలవు ఉద్యోగికి అర్హతలేనపుడు అసాధారణ సెలవు మంజూరు చేయవచ్చును.

 ఉద్యోగి లిఖిత పూర్వక అభ్యర్ధనమేరకు సంపాదిత సెలవు,అర్ధవేతన సెలవు,సదరు ఉద్యోగి ఖాతాలో నిల్వయున్నప్పటికి అసాధారణ సెలవు మంజూరు చేయవచ్చు.

 అసాధారణ సెలవు కాలానికి ఎలాంటి జీతభత్యములు రావు.

 ఒక ప్రభుత్వ ఉద్యోగి తన శక్తికి మించి అసహాయ పరిస్థితులలో రోగపీడితులుగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఈ విషయంలో సంతృప్తి చెందిన పక్షంలోగాని లేక,పై చదువులకు గాని,సాంకేతికపరమైన చదువులకు గాని అసాధారణ సెలవు మంజూరు చేసినయెడల,అట్టి అసాధారణ సెలవు ఇంక్రిమెంటు మంజూరు చేయుటకు పరిగణలోకి తీసుకోబడుతుంది.
( FR 26(b) introduced in G.O.Ms.No.357 F&P తేది:01-09-1962)

 సస్పెన్షన్ కు గురైన ఉద్యోగి సస్పెన్షన్ కాలాన్ని అసాధారణ సెలవుగా పరిగణించినపుడు అట్టి కాలాన్ని వార్షిక ఇంక్రిమెంటుకు పరిగణించుటకు వీలులేదు.
(Govt.Memo.No.11302/FR II/64-1Fin తేది:16-06-1994)

 ఉద్యోగి మెడికల్ దృవీకరణ పత్రం ఆధారంగా అసాధారణ సెలవుపై వెళ్ళిన సందర్భంలో సంబంధిత శాఖాధిపతి అట్టి సెలవు కాలాన్ని 6 నెలలకు మించకుండా వార్షిక ఇంక్రిమెంటుకు కలుపుకొనుటకు అనుమతించవచ్చు.అంతకు మించిన కాలానికి ప్రభుత్వ అనుమతి పొందాలి.
[FR 26(b) with FR 66] & G.O.Ms.No.43 F&P తేది:05-02-1976

 అసాధారణ సెలవు మెడికల్ ధృవీకరణ పత్ర ఆధారంగా పొందుటకు,గజిటెడ్ అధికారులైతే సివిల్ అసిస్టెంట్ సర్జన్ నుంచి,NGO లు మరియు నాల్గవ తరగతి ఉద్యోగులైతే రిజిష్టర్డు మెడికల్ ప్రాక్టీష్నర్ నుండి మెడికల్ సర్టిఫికెట్ పొందవచ్చు.
(Sub Rule 10 of FR 74)

 ఏ ఉద్యోగి కూడా మొత్తం సర్వీసులో ఎలాంటి సెలవుపై 5 సం॥ మించి వెళ్ళకూడదు.కాని ప్రత్యేక పరిస్థితులలో ప్రభుత్వ అనుమతిపై 5 సం॥ మించి వెళ్ళవచ్చును.

Monday 15 May 2017

అర్ధవేతన సెలవులు (HALF PAY LEAVES)

అర్ధవేతన సెలవులు (HALF PAY LEAVES)


ఈ సెలవుల ప్రస్తావన AP Leave Rules నందు 13,18,23 నందు పొందుపరచారు.

 సర్వీసు రెగ్యులరైజ్ అయిన తరువాత నియామక తేది నుండి ప్రతి సం॥ కి 20 రోజుల అర్ధవేతన సెలవు జమచేయబడుతుంది.
సం॥ నకు కొన్ని రోజులు తక్కువైనను ఈ సెలవు రాదు.
(G.O.Ms.No.165 Dt:17-08-1967)

 ఈ సెలవు జమచేయుటకు డ్యూటీ కాలముతో పాటు అన్ని రకాల సెలవుల పై వెళ్ళిన కాలాలను కూడా పూర్తి సం॥ సర్వీసు క్రింద పరిగణిస్తారు.

 అర్జిత (Earned Leave) మాదిరి జనవరి నెల మొదట,జూలై నెల మొదట తేదిన అర్ధవేతన సెలవు జమచేయరు.సం॥ సర్వీసు పూర్తి చేసిన తర్వాతనే సగం జీతపు సెలవు ఖాతాకు జమచేస్తారు.

 అర్ధవేతన సెలవు రెండు రకాలుగా మంజూరు చేస్తారు.
 వైద్య ధృవపత్రం ఆధారంగా(Medical Certificate)
 స్వంత వ్యవహారాలపై (Private Affairs)

 సంపాదిత సెలవు నిల్వయున్నను అర్ధవేతన సెలవు వాడుకోవచ్చును.

 ఇంక్రిమెంట్లు,సర్వీసుకు ఎటువంటి ఆటంకం కలగదు.

 వైద్య కారణముల పై అర్ధవేతన సెలవు పెట్టి పూర్తి జీతం పొందుటను కమ్యూటెడ్ సెలవు అందురు.సెలవు పెట్టిన రోజులకు రెట్టింపు రోజులు అర్ధజీతపు సెలవు ఖాతా నుండి తగ్గిస్తారు.
{APLR 15(B) & 18(B}

 కమ్యూటెడ్ సెలవును 180 రోజుల నుండి 240 రోజులకు పెంచనైనది.
(G.O.Ms.No.186 Dt:23-07-1975)

 సర్వీసు మొత్తంలో 480 రోజుల అర్ధజీతపు సెలవుల స్థానంలో 240 రోజుల పూర్తి జీతం పొందవచ్చు {Rule 15(B}

 ఇలా వాడుకోగా మిగిలిన సెలవులను అర్ధజీతంతో మాత్రమే వాడుకోవాలి.

 వైద్యకారణాల పై సెలవు పొందాలంటే Form-A,B లను సమర్పించాలి.

 వ్యక్తిగత అవసరాలకు అర్ధవేతన సెలవును వినియోగించుకున్నచో
వేతనం,డి.ఏ సగము మరియు అలవెన్సులు పూర్తిగా చెల్లిస్తారు.
(Memo No.3220/77/A1/PC-01/05 Dt:19-02-2005)
(Memo No.14568/63/PC-1/A2/2010 Dt:31-01-2011)

 అర్దవేతన సెలవు 180 రోజులు దాటినచో HRA,CCA లు చెల్లించబడ వు.

 క్యాన్సర్,మానసిక జబ్బులు,కుష్టు,క్షయ, గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం వంటి ధీర్ఘకాల వ్యాధులకు చికిత్స పొందుతున్న వారు సంబంధిత వైద్య నిపుణుడి ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవులను వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చును.
(G.O.Ms.No.386 Dt:06-09-1996)
(G.O.Ms.No.449 Dt:19-10-1976)

 వ్యాధిగ్రస్తులకు 8 నెలల వరకు HRA,CCA లు పూర్తిగా చెల్లిస్తారు.
(G.O.Ms.No.29 Dt:09-03-2011)

 ఎట్టి పరిస్థితులలోనూ కమ్యూటెడ్ సెలవును HPL గా మార్చుకొనుటకు వీలులేదు.
(G.O.Ms.No.143 Dt:01-06-1968)

 ఇట్టి సెలవు వినియోగించుకున్న తర్వాత ఉద్యోగి తిరిగి డ్యూటీలో చేరాలి.కాని ఏ కారణం చేతనైనా రాజీనామా చేయుటకు గాని,లేక పదవీ విరమణ చేయుటకు గాని సిద్దపడినట్లయితే అట్టి సందర్భాలలో అంతకుముందే మంజూరైన కమ్యూటెడ్ సెలవును సగం జీతం సెలవుగా మార్చి అధికంగా పొందిన సెలవు జీతం అట్టి ఉద్యోగి నుండి తిరిగి రాబట్టాలి.

 సెలవు పెట్టి తిరిగి డ్యూటీలో చేరకముందే ఉద్యోగి మరణించినా కమ్యూటెడ్ సెలవు మరియు సగం జీతం సెలవు జీతాలలో తేడాను అట్టి ఉద్యోగి నుండి తిరిగి వసూలు చేయనవసరం లేదు.
*(G.O.Ms.No.33 F&P Dt:29-01-197⁠

Tuesday 9 May 2017

ప్రత్యేక ఆకస్మిక సెలవుల(Spl.Casual Leave)

ప్రత్యేక ఆకస్మిక సెలవుల(Spl.Casual Leave)


ఫండమెంటల్ రూలు-85 రూలింగ్ 4 లోని అనుబంధం-VII ఐటమ్ 11 లో విశదీకరించారు.

ఉద్యోగి వ్యక్తిగత ప్రయోజనాలతో సంబంధo లేకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేయవచ్చు.

ఈ ప్రత్యేక ఆకస్మిక సెలవు సాధారణ,యాదృచ్చిక సెలవు 15 రోజులకు అదనంగా మంజూరుచేయవచ్చు.

క్యాలెండర్ సం॥లో 7 రోజులకు మించకుండా ప్రత్యేక సాధారణ సెలవు వాడుకోవచ్చు.
(G.O.Ms.No.47,Fin తేది:19-02-1965)

సాధారణ సెలవు నిల్వయున్నపటికి Spl.CL వాడుకోవచ్చు.Spl.CL ఇతర సాధారణ సెలవుదినాలతో కలిపి 10 రోజులకు మించకుండా వాడుకోవాలి.

రక్తదానం చేసిన ఉద్యోగికి ఒకరోజు Spl.CL ఇవ్వబడుతుంది.
(G.O.Ms.No.137 M&H తేది:23-2-1984)

పురుష ఉద్యోగులు వేసక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి ఆరు రోజులకు (6) మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల ఆరు(6) రోజులు మంజూరుచేయవచ్చు.
(G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)
(G.O.Ms.No.257 F&P తేది:05-01-1981)

మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి  ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పధ్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరుచేయవచ్చు.
(G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)
(G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)

కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స భార్య చేయించుకున్నచో ఆమెకు సహాయం చేయుటకు ఉద్యోగి అయిన భర్తకు ఏడు(7) రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.802 M&H తేది:21-04-1972)

మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.128 F&P తేది:13-04-1982)

 ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ,ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.102 M&H తేది:19-02-1981)

మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.52 F&P తేది:01-04-2011)

మహిళా ఉద్యోగులు గర్భవిచ్చితి(Medical Termination of Pragnancy) తర్వాత Salpingectomy(గర్భాశయనాళo తొలగింపు) ఆపరేషన్ చేయించుకున్నచో సందర్భంలో పద్నాలుగు(14) రోజులకు మించకుండా ప్రత్యేక ఆకస్మిక సెలవు పొందవచ్చు.
(G.O.Ms.No.275 F&P తేది:15-05-1981)

చట్టబద్దంగా గాని,అప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరుచేయబడును.
(G.O.Ms.No.762 M&H తేది:11-08-1976)

పురుష ఉద్యోగులకు భార్య ప్రసవించినపుడు 15 రోజుల పితృత్వ సెలవు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.231 తేది:16-09-2005)

ప్రభుత్వ గుర్తింపు కలిగి సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం గల ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలకు చెందిన జిల్లా ప్రధాన బాధ్యులకు సంఘ కార్యకలాపములకు  హాజరగు నిమిత్తం అదనంగా 21 రోజుల స్పెషల్ క్యాజువల్ సెలవు మంజూరు సదుపాయం కలదు.
(G.O.Ms.No.470 GAD తేది:16-09-1994)
(G.O.Ms.No.1036 GAD తేది:29-11-1995).



Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

వేసవిలో సంపాదిత సెలవులు పొందడం ఎలా ?

వేసవిలో సంపాదిత సెలవులు పొందడం ఎలా ?

 వేసవిలో సంపాదిత సెలవులు పొందడం ఎలా ?
పాఠశాలలకు వేసవి సెలవుల తరువాత ఉపాధ్యాయుల యొక్క సేవలను వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకునే సందర్భంలో మంజూరుచేసే సెలవులను "సంపాదిత సెలవులు" అందురు.

 15 రొజులకు మించిన విరామం గల ఉద్యోగులకు ఫండమెంటల్ రూల్ 82(b) ప్రకారం ఇటువంటి సెలవులు మంజూరు చేస్తారు.

వెకేషన్ కాలంలో ఉపాధ్యాయులకు ఎన్నికలు,జనాభా గణన, జనాభా ఓట్ల జాబిత తయారీ,పరీక్షలు మొదలగు విధులు నిర్వర్తించినపుడు నియామక అధికారి ధృవపత్రం ఆధారంగా సెలవులు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.35 Dt:16-1-1981)
(G.O.Ms.No.151 Dt:14-11-2000)
(G.O.Ms.No.174 Dt:19-12-2000)

 వెకేషన్ కాలంలో ఎన్ని రోజులు పనిచేస్తే ఆ రోజులకు దామాషా పద్దతిలో మాత్రమే సెలవులు మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.114 Dt:28-4-2005)

 సంబంధిత శాఖాధికారి ఉత్తర్వుల ఆధారంగా ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మండల విద్యాధికారులు,ఉన్నత పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు ఇట్టి సెలవులు మంజూరు చేసి సర్వీసు పుస్తకములో నమోదుచేస్తారు.
(Rc.No.362 Dt:16-11-2013)

 వేసవి సెలవులు 49
రోజులు ప్రకటించిన సందర్భంలో సంపాదిత సెలవులు మంజూరుచేయు విధానం:

 సూత్రం:
డ్యూటీ కాలము x 1/11-(365x1)/11-(27xవాడుకున్న వేసవి సెలవులు /మొత్తం వేసవి సెలవులు)-6

పనిచేసిన రోజులు-సంపాదిత సెలవులు
>1-1
>2-1
>3-2
>4-2
>5-3
>6-3
>7-4
>8-5
>9-5
>10-6
>11-6
>12-7
>13-7
>14-8
>15-8
>16-9
>17-10
>18-10
>19-11
>20-11
>21-12
>22-12
>23-13
>24-13
>25-14
>26-15
>27-15
>28-16
>29-16
>30-17
>31-17
>32-18
>33-18
>34-19
>35-19
>36-20
>37-21
>38-21
>39-22
>40-22
>41-23
>42-23
>43,44,45,46,47,48,49-24 రోజులు
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు:

ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు:

ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు:
సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగ,ఉపాధ్యాయులకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం Rs.20,000 చెల్లిస్తారు.
(G.O.Ms.No122 తేది:11-04-2016)

మరణించిన ఫామిలీ మరియు సర్వీసు పెన్షనర్లందరికీ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఒకనెల పెన్షన్ లేదా Rs.20,000 చెల్లిస్తారు. పెన్షనర్ కన్నా ముందే మరణించే భార్యకు కూడా మొత్తాన్ని చెల్లిస్తారు.
(G.O.Ms101 తేది:21-04-2015)

ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అంత్యక్రియల ఖర్చు నిమిత్తం Rs.10,000 చెల్లిస్తారు.
(G.O.Ms.No.38 తేది:28-05-2013)

ఫామిలీ పెన్షనర్ చనిపోతే కుటుంబంలో ఎవరూ లేనిచోే వారసులకు చెల్లిస్తారు.
(G.O.Ms.No.136 తేది:29-06-2011)

నాన్ గజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పిల్లలకు LKG నుండి ఇంటర్ వరకు Rs.2500 ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తారు.
(G.O.Ms.No.27 తేది:24-09-2015)

ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక అలవెన్స్ చెల్లిస్తారు.
(G.O.Ms.No.56 తేది :02-05-2015)

ఉద్యోగులుగా పనిచేయు భార్య, భర్తల
ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే Rs.7500 వడ్డీలేని ఫెస్టివల్ అడ్వాన్స్ మంజూరు చేస్తారు.
(G.O.Ms.No.39 తేది:15-04-2015)

 PHC Allowance బేసిక్ పే పై 10% లేదా max Rs.2000 మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.103 తేది:24-07-2015)

 అంధ (Blind )ఉపాధ్యాయులకు రీడర్ అలవెన్స్ మంజూరుచేస్తారు.
(G.O.Ms.No.04 తేది:19-03-2016)

FUNDAMENTAL RULES

F.R. 12(a)1 శాశ్వత పోస్ట్ లోకి ఇద్దరూ, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను ఒకే సారి నియమించరాదు.

F. R. 12(బి) ఒక govt employee ని ఒకే సారి 2 లేక అంతకంటే ఎక్కువ పోస్ట్ లలో నియమించరాదు.

 F. R. 12(c) ఉద్యోగి లీవ్ లో ఉంటే ఆ పోస్ట్ లో మరొకరిని appoint చేయకూడదు.

F. R. 15(b) ఉద్యోగి 1 డే కూడా మెడికల్ లీవ్ పెట్టుకోవచ్చు.

F. R. 18 govt appoint చేస్తే తప్ప, ఏ employee కి ఒకే సారి 5y కంటే ఎక్కువ సెలవు మంజూరు చేయకూడదు.

F. R.18(a) 1year కంటే ఎక్కువ కాలం పర్మిషన్ లేని సెలవు లో ఉంటే, అతను రాజీనామా చేసినట్లు లెక్క.

F.R.18(బి) పర్మిషన్ ఉన్నా /పర్మిషన్ లేకుండా 5years కంటే ఎక్కువ కాలం లీవ్ లో ఉంటే అతను జాబ్ కి రాజీనామా చేసినట్లు లెక్క.

F. R.18(c) 5years కంటే ఎక్కువ కాలం ఫారిన్ సర్వీస్ లో ఉన్నపుడు అతను జాబ్ కి రాజీనామా చేసినట్లు లెక్క.

F. R.22(a) ప్రస్తుత పోస్ట్ విధుల కన్నా ఎక్కువ ప్రాధాన్యత విధులు గల పోస్ట్ లోకి నియమించబడినప్పుడు ప్రస్తుత వేతనం కంటే నూతన స్కేలు లో ఫై స్టేజి వద్ద స్థిరీకరించబడుతుంది.

F. R.22 (a) (iv) ఒక ఉద్యోగి APPSC ద్వారా మరొక పోస్ట్ కి సెలెక్ట్ అయినపుడు పాత పోస్ట్ లోని వేతనాన్కి తక్కువ కాకుండా కొత్తగా ఎంపిక ఐన పోస్ట్ లో వేతనం స్తిరీకరించబడును. కొత్త ఉద్యోగం లో చేరిన తేదీ నుంచి 1year తరువాత మాత్రమే ఇంక్రిమెంట్ ఇవ్వబడును. ఇక పాత పోస్ట్ లోని ఇంక్రిమెంట్ డేట్ పోతుంది.

F. R.22(B) ఒక పోస్ట్ నుండి మరొక పోస్ట్ కి పదోన్నతి పొందినప్పుడు, కింది పోస్ట్ లో పొందుతున్న వేతనానికి ఒక notional increment కలిపి వచ్చిన వేతనాన్ని ప్రమోషన్ పోస్ట్ స్కేల్ లో ఫై స్టేజి వద్ద నిర్ణయి0చాలి. పదోన్నతి వచ్చిన ఉద్యోగి 2 రకాల వేతన స్తిరీకరణ కై ఆప్షన్ కలిగి ఉంటాడు.అవి (a) పదోన్నతి వచ్చిన తేదీ (b) కింది పోస్ట్ లో ఇంక్రిమెంట్ తేదీ కి ఆప్షన్ ఇచ్చుకోవటం.

F. R.24 వార్షిక ఇంక్రిమెంట్ యధాలాపంగా వస్తుంది. ఉద్యోగి ప్రవర్తన సంతృప్తి కరంగా లేకపొతే ఆతని ఇంక్రిమెంట్ అపి వేయవచ్చు. ఇలా అపి వేస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పుడు, అలా ఎంతకాలం అపి వేస్తున్నారో అలాగే with cumulative లేదా with out cumulative effect అన్న విషయం ఉత్తర్వుల లో తెలుపవలెను.

Ex ఒక ఉద్యోగి 1.6.10 న ఇంక్రిమెంట్ తీసుకున్న తరువాత పనిష్మెంట్ గా 2 ఇంక్రిమెంట్ లు ఆపారు అనుకుందాం.
(a) with cumulative effect ఈ విధంగా చేస్తే 1.6.13 నకు ఒకే ఒక ఇంక్రిమెంట్ వస్తుంది.
(b) with out cumulative effectఈ విధంగా చేస్తే 1.6.13 నకు 3 వార్షిక increment లు వస్తాయి.అంటే 2 వార్షిక increments arrears కోల్పోయినట్లు.

 F. R.26 ఇంక్రిమెంట్ కి పరిగణింపబడే సర్వీస్ కి సంబందించిన షరతులు ఉన్నాయి.
ఒక టైం స్కేల్ లో పని చేసిన కాలం ఇంక్రిమెంట్ కి  లెక్కించబడుతుంది.
ఐతే జీత నష్టపు సెలవు పెట్టి ఉంటే అంతకాలం వార్షిక ఇంక్రిమెంట్ వాయిదా పడుతుంది.
180 రోజుల వరకు వైద్య కారణాల తో జీత నష్టపు సెలవు వాడు కొన్నపుడు ఇంక్రిమెంట్ తేదీ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికారము Head of department లకు ఇవ్వబడినది.

F.R.26(a) ఏదయినా పరీక్ష పాస్ అయిన0దు వల్ల ఉద్యోగికి ఏదయినా హక్కు లేదా మినహాయింపు వచ్చినట్లయితే ఆ సౌలభ్యం చివరి పరీక్ష మరుసటి తేదీ నుండి మంజూరు అయినట్లు గా భావించాలి.

కొత్తగా ఉద్యోగం లో చేరిన లేదా ప్రమోషన్ పోస్ట్ లో చేరిన ఉద్యోగికి ఆతని వార్షిక ఇంక్రిమెంట్ 12 నెలల కాలం పూర్తి కాకుండానే మంజూరు అవుతుంది.
Ex: 19.12.73 నాడు ఉద్యోగం లో చేరిన ఉద్యోగి మొదటి వార్షిక ఇంక్రిమెంట్ 1.12.74 నకే మంజూరు అవుతుంది.
ఒక ఉద్యోగి రిటైర్ ఐన తేదీ మరుసటి రోజు వార్షిక ఇంక్రిమెంట్ తేదీ ఉన్నపుడు pentionery benifits కోసం notional మంజూరు అయినట్లు భావించి లెక్కించాలి.
ఐతే లీవ్ encashment వంటి వాటికి ఇది వర్తించదు.

F. R.44 ఉద్యోగి లీవ్ లో ఉన్నపుడు 4 నెలల వరకు HRA పూర్తి గా మంజూరు చేయవచ్చును.అర్ద లేదా పూర్తి వేతన సెలవు మీద వున్న ఉద్యోగి HRA, అతడు సెలవు మీద వెళ్ళేటప్పటి వేతనం మీద లెక్కించబడుతుంది.

F.R.49 govt ఒక ఉద్యోగి ని temporary గా 2 పోస్ట్ లకి నియమించవచ్చును.

F.R.49(a) ఈ విధంగా 2 పోస్టులు చూస్తున్నప్పుడు ఏది ఎక్కువ వేతనం కలిగి ఉంటుందో, ఆ వేతనం మంజూరు చేయవచ్చు.
 ఉద్యోగిని అదనపు పోస్ట్ ను కూడా నిర్వహించమన్నపుడు మొదటి 3 నెలల వేతనం లో 1/5 భాగం ,next 3 నెలలు 1/10 భాగం అలవెన్సు చెల్లించబడుతుంది.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

ఉద్యోగ,ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సర్వీసు అంశాలు

ఉద్యోగ,ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సర్వీసు అంశాలు


 సరెండర్ లీవు (Surrender Leave) కాలానికి పూర్తివేతనం,ఇతర అలవెన్సులు మంజూరు చేయబడతాయి.IR చెల్లించబడదు.తెలంగాణ ఇంక్రిమెంట్ చెల్లించబడుతుంది.
(Memo No.31948 F&P తేది:12-08-1998)
(Memo No.3572/107/A1/Admn.I/2014 Dt:15-12-2014)

మృత శిశువు జన్మించినా,జన్మించిన తరువాత శిశువు మరణించినా ప్రసూతి  సెలవు (Maternity Leave) కు అర్హులు.
(L.Dis.No.1941 Dt:11-06-1990)

 ప్రసూతి సెలవులో  (Maternity Leave) ఉండి బదిలీ,పదోన్నతి పొందిన సందర్భంలో లీవ్ పూర్తయిన అనంతరం నూతన పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది.
(Rc.No.29 Dt:25-01-2003)
(Rc.No.3750 Dt:13-08-2009)

LTC లో ప్రతి 4 సం॥ కాలం బ్లాకు పీరియడ్ గా నిర్ణయించబడుతుంది.మొదటి 2 సం॥ స్వస్థలం (Home Town) పోవుటకు ,తదుపరి 2 సం॥ కాలం రాష్ట్రంలో ఏ ప్రదేశమునకు గాని లేదా స్వస్థలం (Home Town) నకు గాని,సర్వీసు మొత్తంలో ఒకసారి దేశంలో ఏ ప్రదేశానికైనా LTC సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చును. 3,500 కి.మీ లు మించకుండా ప్రయాణం చేయాలి.రూ.18,750 చెల్లిస్తారు.బ్లాకు పీరియడ్ ను ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా విడుదల చేయాలి.
(G.O.Ms.No.76 Dt:13-05-2015)

 కారుణ్య నియామకాలలో భాగంగా 18 సం॥ కన్నా తక్కువ వయస్సున్న వారిని ఉద్యోగంలో నియమించుటకు అలాగే 34 సం॥ మించియున్న వయస్సు వారిని ఉద్యోగంలో నియమించుటకు అవకాశం లేదు.అయితే భార్య/భర్త లకు ఉద్యోగం ఇచ్చు సందర్భంలో వారి గరిష్ట వయస్సు 45 సం॥ గా నిర్ణయించడం జరిగింది.
(G.O.Ms.No.759 GAD Dt:06-10-2007)
(G.O.Ms.No.144 GAD Dt:15-06-2004)

 సస్పెండ్ అయిన ఉద్యోగికి  జీవనాధార భత్యము (Subsistence Allowance) తిరస్కరించరాదు.అట్టి చెల్లింపులు తిరస్కరించడం శిక్షించదగ్గ నేరం.
*(Govt.Memo.No.29370/A/458/FR-II/96 F&P Dt:14-10-1996)
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends