Labels

Saturday 21 October 2017

టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల

టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల


-మొత్తం 8792 పోస్టులు
-కేటగిరీల వారిగా 5 వేర్వేరు నోటిఫికేషన్లు

-ఈ దఫా ఎస్జీటీల్లో ఇంగ్లీష్ మీడియం పోస్టుల భర్తీ
-పీఈటీ అభ్యర్థులకు టెట్ తో పనిలేదు

*తెలుగు మీడియంలో*

-స్కూల్ అసిస్టెంట్లు: 1754
-ఎస్జీటీ: 4779

-లాంగ్వేజ్ పండిట్స్: 985

*ఉర్దూ మీడియంలో*

-స్కూల్ అసిస్టెంట్లు: 196
-లాంగ్వేజ్: 26

-ఫిజికల్ డైరెక్టర్లు (పీడీ): 42

-ఎస్జీటీ: 636

*ఎస్ఈఆర్టీ సిలబస్*

-టీఆర్టీ సిలబస్లో మార్పులేదు
-తెలంగాణ అంశాలకు ప్రాధాన్యత
-రోస్టర్ పాయింట్లు, స్థానికత, ఇతర అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం
-న్యాయపరమైన చిక్కులు లేకుండా జాగ్రత్తలు

-4 నుంచి 10 వ తరగతి వరకు చదివిన జిల్లాను స్థానిక జిల్లాగా పరిగణ

-పుట్టిన, చదివిన జిల్లాల్లో ఒకదాన్ని పరీక్షకు ముందే ఎంచుకునే వెసులుబాటు

*దరఖాస్తు - గడువు*

-ఈ నెల 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ

-అప్లైకి నెల రోజుల గడువు

-2 నెలలు ప్రిపరేషన్ గడువు

-3 నుంచి 31|2 నెలల్లో భర్తీ ప్రక్రియ పూర్తి.
Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

Sunday 15 October 2017

ROSTER POINTS IN PROMOTIONS & APPOINTMENTS:

ROSTER POINTS IN PROMOTIONS & APPOINTMENTS:

1 Open Competition WomeN
2 Scheduled Castes Women
3 Open Competition
4 Backward Class (Group-A) Women
5 Open Competition
6 Visually Handicapped Women
7 Scheduled Castes
8 Scheduled Tribes Women
9 Open Competition
10 Backward Class (Group-B) Women
11 Open Competition
12 Open Competition Women
13 Open Competition
14 Backward Class (Group-C) Women In every 3rd cycle of 100 point roster
15 Open Competition
16 Scheduled Caste
17 Open Competition Women
18 Backward Class (Group-D) Womn
19 Backward Class (Group-E) Women
20 Backward Class (Group-A)
21 Open Competition
22 Scheduled Castes Women
23 Open Competition Women
24 Backward Class (Group-B)
25 Scheduled Tribe
26 Open Competition
27 Scheduled Castes
28 Open Competition
29 Backward Class (Group-A)
30 Open Competition Women
31 Hearing Handicapped (Open)
32 Open Competition
33 Scheduled Tribes
34 Open Competition Women
35 Backward Class (Group-B)
36 Open Competition
37 Open Competition
38 Open Competition Women
39 Backward Class (Group-D)
40 Open Competition
41 Scheduled Castes
42 Open Competition
43 Backward Class (Group-D
44 Backward Class (Group-E)
45 Backward Class (Group-A) Women
46 Open Competition
47 Scheduled Castes Women
48 Open Competition
49 Backward Class (Group-B) Women
50 Open Competition Women
51 Open Competition
52 Scheduled Castes
53 Open Competition
54 Backward Class (Group-A)
55 Open Competition Women
56 Orthopaedically Handicapped(Open)
57 Open Competition
58 Scheduled Tribes Women
59 Open Competition Women
60 Backward Class (Group-B)
61 OC
62 SC
63 OCW
64 BCD
65 OCW
66 SCW
67 OC
68 BCD
69 BCE
70 BCA
71 OCW
72 SC
73 OC
74 BCB
75 ST
76 OC
77 SC
78 OCW
79 BCA
80 OC
81 BCBW
82 OC
83 ST
84 OC
85 OC
86 OC
87 SCW
88 OC
89 BCD
90 OCW
91 SC
92 Open Competition
93 Backward Class (Group-D)
94 Backward Class (Group-E)
95 Backward Class (Group-B)
96 Open Competition Women
97 Scheduled Castes
98 Open Competition
99 Backward Class (Group-B) Women
100 Open competition



Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

స్వచ్ఛ విద్యాలయ పురస్కారం 2017

అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు స్వచ్ఛ విద్యాలయ పురస్కారం 2017 app ను గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ముందర ప్రాధమిక సమాచారాన్ని నింపి రిజిస్టర్ అవ్వాలి.

స్వచ్ఛ విద్యాలయ పురస్కారం 2017
తర్వాత మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది. దానితో లాగిన్ అవ్వండి. అప్పుడు మీకు స్క్రీన్ మీద 5 అంశాలు కనిపిస్తాయి.

1. Water
2. Toilets
3. Hand washing with soap
4.Operations and maintainance
5.Behaviour Change And Capacity Building
తర్వాత UPLOADING PHOTOES అనేవి కనిపిస్తాయి.

ముందర 1వ అంశం క్లిక్ చేసి దానీలో సర్వే లో ఇచ్చిన 8 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి ఆ అంశం సేవ్ చేయాలి.

 తర్వాత 2వ అంశంలో ఇచ్చిన 10 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి ఆ అంశం సేవ్ చేయాలి.

తర్వాత అదేవిధంగా3,4,5 అంశాలలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి సేవ్ చేయాలి.

చివరగా 5 ఫోటోలు 100kb size కి మించకుండా అప్లోడ్ చేసి ఫైనల్ గా సబ్మిట్ చేయాలి.

1. School Front View photo*
2. School Side View photo*
3. Toilets*
4. Drinking water ఉన్న ప్రాంతం*
5. Hand wash చేస్తున్న ఫోటో.*
వీటిని అప్లోడ్ చేసిన తర్వాత మీ పాఠశాల స్కోర్ వస్తుంది.

1. 90-100% 5* *Rating EXCELLENT,*
2. 75-89% 4* *rating VERY GOOD*
3. 51-74% 3* *Rating Good Scope for improvement.*
4. 35-50% 2* *Rating, Fair,Needs Improvement.*
5. Below 35% 1* *Rating. Poor.*
మీ పాఠశాలను అక్టోబర్ 31 లోపు నమోదు అయ్యి స్వచ్ విద్యాలయ పురస్కారం గెలుచుకోండి.*

క్రింది Link ద్వారా App Install చేసుకోగలరు*👇👇
https://play.google.com/store/apps/details?id=com.glt.sv


Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

TS DSC Notification 8,792 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ Flash..

TS DSC Notification 8,792 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్  Flash..

G.O.Ms.No.25 Dt:10-10-2017
Telangana Direct Recruitment for the posts of Teacher's Rules 2017-Orders-Issued.


టీచర్ అభ్యర్థులకు దీపావళి కానుక

టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ మార్గదర్శకాలు జారీ

31 జిల్లాల ప్రకారం ఉపాధ్యాయ నియామకాలు

స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50శాతం తప్పనిసరి

ఎస్జీటీలకు ఇంటర్‌లో 50శాతం మార్కుల అర్హతఅర్హత విషయంలో ఈక్వలెన్స్ విధానం రద్దు

యూజీసీ, ఎన్సీటీఈ ప్రకారమే నిబంధనల రూపకల్పన

రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ప్రభుత్వ, జిల్లాపరిషత్తు, మండలపరిషత్తు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి తుది ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ) మార్గదర్శకాలను మంగళవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేశారు. ఈ మార్గదర్శకాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపించారు. పదిరోజుల్లోగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నది. కొత్తగా ఏర్పాటుచేసిన 31జిల్లాల ప్రకారమే టీచర్ పోస్టులను భర్తీచేయడానికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంగళవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి 31జిల్లాల ప్రకారం టీచర్ నియామకాలను చేపట్టడానికి సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు. ఆ వెంటనే నియామక నిబంధనలతో జీవో 25ను విడుదల చేశారు. 31 జిల్లాలవారీగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీలు, రోస్టర్ పాయింట్ల వివరాల సేకరణలో ఇప్పటికే సర్వీస్ కమిషన్ అధికారులు నిమగ్నమయ్యారని విద్యాశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సిలబస్ రూపకల్పన, పరీక్ష నిర్వహణ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, గురుకులాల్లో టీచర్ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల మాదిరిగానే ఈ టీచర్ల భర్తీ పరీక్షలు కూడా ఉంటాయని వారు చెప్పారు. గతంలో మాదిరిగా భాషాపండితుల పోస్టుల కోసం రకరకాల సంస్థలు, బోర్డులు, వర్సిటీల నుంచి తెచ్చుకొన్న సర్టిఫికెట్లకు ఈక్వలెన్స్ ఇచ్చే విధానాన్ని రద్దుచేసినట్టు తెలిపారు.

డిగ్రీలో 50 శాతం మార్కులు అనివార్యం
టీచర్ రిక్రూట్‌మెంట్ నిబంధనల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. యూజీసీ నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ టీచర్ క్యాడర్ పోస్టుకు బ్యాచిలర్ డిగ్రీ, లేదా పీజీ.. 50 శాతం మార్కులతో పాస్ కావాలి. సంబంధిత మెథడాలజీతో ఎన్సీటీఈ గుర్తింపుపొందిన విద్యాసంస్థ నుంచి బీఎడ్ పూర్తిచేసి ఉండాలి. లేదా నాలుగేండ్ల డిగ్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో (ఉదాహరణ బీఏ, బీఎడ్/ఎంఎస్సీ బీఎడ్)లో 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. వీటితోపాటు టీఎస్‌టెట్ లేదా సీటెట్‌లో అర్హత సాధించాలి. జూన్ 2, 2014 కంటే ముందుగా నిర్వహించిన ఏపీ టెట్‌లో అర్హత సాధించిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు డిగ్రీలో 45శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీలో గణితం, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, తమి ళం, మరాఠీ, సంస్కృతం సబ్జెక్టులుగా ఉంటాయి.

సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) క్యాడర్ పోస్టుల అర్హతలోనూ మార్పులుచేశారు. ఇంటర్‌లో కనీసం 50శాతం మార్కులతోపాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సు పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఇంటర్మీడియట్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 2010 కంటే ముందుగా డీఎడ్ పూర్తిచేసిన వారు ఇం టర్‌లో 45శాతం మార్కులు పొందిఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 40 శాతం మార్కులుంటే చాలు. టీఎస్ టెట్ పేపర్ -1లో అర్హత సాధించాలి. జూన్ 2, 2014 కంటే ముందుగా నిర్వహించిన ఏపీ టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు కూడా ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

🏋ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ క్యాడర్ పోస్టులకు ఇం టర్‌లో 50శాతం పాస్ పర్సంటేజీ తప్పనిసరి. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో యూజీ డిప్లొమా/ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తిచేసిఉండాలి.
-భాషాపండితుల క్యాడర్ పోస్టులకు డిగ్రీలో ఒక సబ్జెక్టుగా తెలుగు కచ్చితంగా ఉండాలి లేదా తెలుగు సాహిత్యంలో డిగ్రీ /తెలుగులో బ్యాచిలర్ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజీ/ పీజీలో తెలుగు చేసి ఉండాలి. వీటిలో 50శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 45 శాతం మార్కులుండాలి. బీఎడ్‌లో తెలుగు మెథడాలజీ పూర్తిచేసి ఉండాలి. టెట్‌లో కూడా కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలి.

💢20 మార్కుల వెయిటేజీ..
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు టెట్‌లో అర్హత సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. టీఎస్‌టెట్/ఏపీటెట్/ సీటెట్‌లో అర్హత సాధించాలి. 150 మార్కుల టెట్‌లో ఓసీలకు 90 మార్కులు, బీసీలకు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ వారికి 60 మార్కులు ఉండాలి.


రేపు టీఎస్‌పీఎస్సీ భేటీ*

టీఆర్టీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) ద్వారా ఉద్యోగాల భర్తీకి వారం పదిరోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. గురువారం జరుగనున్న టీఎస్‌పీఎస్సీ సర్వసభ్య సమావేశంలో ఎంపిక విధానంపై చర్చించి తుది నిర్ణయం తీసుకొంటారని సమాచారం. టీచర్ల నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా టీఎస్‌పీఎస్సీకి అందిన తర్వాత వారంపాటు అంతర్గత ప్రక్రియ పూర్తిచేసి టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం 80ః20 కోటాను అనుసరించి 31 జిల్లాలవారీగా టీఆర్టీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అపాయింట్‌మెంట్ అథారిటీగా డీఈఓలు ఉంటారు. ఎస్‌ఏ, ఎస్జీటీ, పండిట్ల పోస్టులకు మూడు వేర్వేరు పరీక్షలు నిర్వహిస్తారు.



Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

TS DSC 2017 - తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ నియామక నిబంధనలు- 2017

TS DSC 2017 - తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ నియామక నిబంధనలు- 2017
TS DSC 2017 - తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ నియామక నిబంధనలు- 2017

జీవో నెం: 25 తేదీ: 10.10.2017 ద్వారా విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ పోస్టుల ప్రత్యక్ష నియామక నిబంధనలు-2017
ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలల్లోని అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులకు వర్తిస్తాయి.
జిల్లా విద్యాశాఖాధికారే నియామకపు అధికారి
టిఎస్‌పిఎస్‌సి ద్వారా ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ, వ్రాత పరీక్ష నిర్వహణ
టిఎస్‌టెట్‌, సెంట్రల్‌ టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. (2.06.2014కంటే ముందు ఎపిటెట్‌ ఉత్తీర్ణులైన వారూ అర్హులే)
టెట్‌లో ఓసీ-90 మార్కులు, బిసీ- 75 మార్కులు, ఎస్‌సి/ఎస్‌టి/ విభిన్న సామర్థ్యాల వారికి 60 మార్కులు కనీసంగా నిర్ణయించారు.
ఉపాధ్యాయ నియామకాలను వ్రాత పరీక్షకు 80శాతం మార్కులు, టెట్‌ వెయిటేజీ 20శాతం మార్కులు.
వ్యాయామ ఉపాధ్యాయులకు టెట్‌ నుండి మినహాయింపు. వ్రాత పరీక్షకే 100 శాతం మార్కులు.
సంబంధిత సబ్జెక్టులో 50శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ మరియు సంబంధిత మెథడాలజీతో బి.ఇడి. ఉత్తీర్ణులైన వారే స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు అర్హులు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, విభిన్న సామర్థ్యాల అభ్యర్థులకు డిగ్రీ/ పిజీలో 45 శాతం మార్కులు చాలు.
ఎన్‌సిటిఇ నిబంధనల ప్రకారమే విద్యార్హతలు.
భాష, భాషేతర సబ్జెక్టులన్నింటికీ డిగ్రీ లేదా పోస్టుగ్రాడ్యుయేషన్‌తోపాటు సంబంధిత మెథడాలజీతో బి.ఇడి ఉత్తీర్ణులై ఉండాలి.
సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు ఇంటర్‌లో 50 శాతం మార్కులతో, బిసి, ఎస్‌సి, ఎస్‌టి, విభిన్న సామర్థ్యాల అభ్యర్థులకు 45 శాతం పాటు 2 సంవత్సరాల డిఎడ్‌ లేదా 4 సంవత్సరాల ఎలిమెంటరీ విద్యలో బ్యాచులర్‌ డిగ్రీ ఉన్నవారు అర్హులు.
 2007 సంవత్సరం కంటే ముందే 2 సంవత్సరాల డి.ఎడ్‌లో ప్రవేశం పొందిన వారికి ఇంటర్‌లో 45 శాతం మార్కులు సరిపోతాయి. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, విభిన్న సామర్థ్యాల అభ్యర్థులకు 5శాతం సడలింపు వర్తిస్తుంది)
డిగ్రీ, బిపి.ఇడి. అర్హత కల్గిన వారికి డిగ్రీలో కనీస మార్కులు పేర్కొనలేదు.
భాషేతర సబ్జెక్టుల ఉపాధ్యాయ అభ్యర్థులు ఎస్‌ఎస్‌సి లేదా ఇంటర్‌ లేదా డిగ్రీలో సంబంధిత భాషా మాధ్యమంలో చదివిన వారు లేదా ఎస్‌ఎస్‌సిలో మొదటి భాషగాను, ఇంటర్‌/ డిగ్రీలో ద్వితీయ బాషగానూ చదివినవారే సంబంధిత మీడియంలో ఉపాధ్యాయులుగా ఎంపికకు అర్హులు.
ఏ మీడియంలో పోస్టుకు పోటీ పడదల్చుకున్నారో వ్రాత పరీక్ష (టిఆర్‌టి) ప్రశ్నాపత్రం కూడా సంబంధిత మీడియంలోనే ఉంటుంది.
ఎస్‌జిటిలు టెట్‌ పేపర్‌-1 ఉత్తీర్ణులు కావాలి.
స్కూల్‌ అసిస్టెంట్లు, భాషా పండితులు, టెట్‌ పేపర్‌-2 ఉత్తీర్ణత కావాలి.
భాషా పండితులు సంబంధిత భాషలో 50శాతం మార్కులతో, బిసి/ఎస్‌సి/ఎస్‌టి/ విభిన్న సామర్థ్యాల అభ్యర్థులకు 45 శాతం మార్కులు డిగ్రీ లేదా పీజీ అర్హతతోపాటు సంబంధిత మెథాడాలజీతో బి.ఇడి. లేదా పండిట్‌ ట్రైనింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వ్యాయామ ఉపాధ్యాయులకు 50శాతం మార్కులతో ఇంటర్‌ మరియు వ్యాయామ విద్యలో డిప్లొమా లేదా డిగ్రీ, బి.పి.ఇడి
కలిగి ఉండాలి.
(ఎస్‌సి/ఎస్‌టి/బిసి అభ్యర్థులకు 5శాతం మినహాయింపులేదు)
2016 అక్టోబర్‌ 10న ఏర్పడిన కొత్త రెవెన్యూ జిల్లాల ప్రాతిపదిపక ఉపాధ్యాయ ఖాళీలను నిర్ణయించి పాఠశాల విద్యా డైరెక్టర్‌ సూచించిన మేరకు టిఎస్‌పిఎస్‌సి నియామక నోటిఫికేషన్‌ (ప్రకటన ) విడుదల చేస్తుంది.
షెడ్యూల్డ్‌ ఏజెన్సీ ప్రాంతంలో జీ.వో. నెం: 3, తేదీ: 10.01.2000 ప్రకారం ఉపాధ్యాయ పోస్టులన్నింటికీ స్థానిక గిరిజన అభ్యర్థులు మాత్రమే అర్హులు. మైదాన ప్రాంత పాఠశాలల్లో నియామకాలకు కూడా ఏజెన్సీ స్థానిక గిరిజనులు అర్హులు.
రాష్ట్ర ప్రభుత్వ సాధారణ సర్వీసు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సు నిర్ణయించబడుతుంది.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక అభ్యర్థుల రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఎస్‌సి, ఎస్‌టి, బిసి, విభిన్న సామర్థ్యాలు, మాజీ సైనికులు, మహిళల రిజర్వేషన్లు అన్ని రాష్ట్ర ప్రభుత్వ సాధారణ నిబంధనల ప్రకారం వర్తిసాయి.
వ్యాయామ విద్య స్కూల్‌ అసిస్టెంట్లు, పి.ఇటి.ల పోస్టులకు వికలాంగుల కోటా వర్తించదు.
ఖాళీ పోస్టులకు సమాన సంఖ్యలోనే ఉపాధ్యాయ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది
నిరీక్షణ జాబితా (వెయిటింగ్‌ లిస్ట్‌) ఉండదు.
ఎంపికైన అభ్యర్థుల జాబితాను టిఎస్‌పిఎస్‌సి సంబంధిత నియామకపు అధికారికి పంపుతుంది. నియామకపు అధికారి, నియామక ఉత్తర్వులు ఇచ్చి కౌన్సెలింగ్‌ ద్వారా పాఠశాలలు కేటాయిస్తారు.
పాఠశాలల కేటాయింపుపై సవివరమైన మార్గదర్శకాలు ప్రభుత్వం విడిగా ఇస్తుంది.
ఉపాధ్యాయ నియమాకాలకు సంబంధించి 2009 జనవరి 23న విడుదల చేసిన జీవోలు 11, 12లలోని విద్యార్హతలను ఈ జీవో ద్వారా సవరించారు.

గత (2012) ఉపాధ్యాయ నియామక నిబంధనలతో పోలిస్తే సాధారణ విద్యార్హతలు, ఇంటర్‌, డిగ్రీలలో కనీసం మార్కులు (50 శాతం లేదా 45 శాతంస్త్ర నిర్ణయించడం, గిరిజన సంక్షేమ పాఠశాలలను నియామక ప్రక్రియ నుండి మినహాయించడం, కొత్త జిల్లాల వారీగా నియామకాలు చేయడం, పిజి అర్హతలున్నవారిని కూడా స్కూల్‌ అసిస్టెంట్‌, భాషాపండితుల నియమకానికి అర్హులుగా పేర్కొనడం కొత్త అంశాలు.

పీఈటీ అర్హతల్లో ఎన్‌సీసీకి విలువేదీ?*


రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులకు ప్రకటించిన అర్హతల్లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ) అర్హతల్లో ఎన్‌సీసీ ప్రస్తావించలేదు. దీంతో ఎన్‌సీసీ ధ్రువపత్రాలు ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎన్‌సీసీ ధ్రువపత్రం పీఈటీ పోస్టులకు అర్హత కాదా?అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బీపీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఎన్‌సీసీ సీ ధ్రువపత్రం ఉన్నోళ్లు అర్హులేనని ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. ఇంకోవైపు గురుకుల విద్యాసంస్థల్లో ప్రకటించిన పీఈటీ పోస్టులకు ఎన్‌సీసీ ధ్రువపత్రం ఉన్నా అర్హులేనని ప్రకటించింది. కానీ విద్యాశాఖ మాత్రం ఎన్‌సీసీ ధ్రువపత్రాన్ని విస్మరించడం చర్చనీయాంశమైంది. పీఈటీ అర్హతల్లో ఎన్‌సీసీ చేసిన విలువేదని అభ్యర్థులు అడుగుతున్నారు. విద్యాశాఖ ఉద్దేశపూర్వకంగా ఎన్‌సీసీ ధ్రువపత్రం ఉన్న వారిని మినహాయించిందా? లేక ఏదైన సాంకేతిక కారణం ఉందా?అన్నది తెలియాల్సి ఉంది. ఎన్‌సీసీ ధ్రువపత్రం ఉన్న అభ్యర్థులు మాత్రం విద్యాశాఖ తీరుపై గుర్రుగా ఉన్నారు.*


టీచర్‌ పోస్టుల భర్తీ కొత్త జిల్లాల ప్రకారమే

ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై నెలకొన్న పలు ప్రశ్నలకు సమాధానం లభించింది. కొత్త జిల్లాల ప్రకారమే పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో త్వరలో చేపట్టబోయే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ 31 జిల్లాల ప్రకారం జరగనుంది. ప్రభుత్వం నిబంధనలను కూడా ఖరారు చేసి, మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం డీఎస్సీ పేరును టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ)గా పిలుస్తారు. గతంలో మాదిరిగానే జిల్లా యూనిట్‌గా నియామకాలు చేపట్టనుంది. పోస్టుల భర్తీకి అపాయింటింగ్‌ అథారిటీగా జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)ని నియమించింది.*

నియామక బాధ్యతలను టీఎ్‌సపీఎస్సీకి అప్పగించింది. ప్రభుత్వం అందించే ఖాళీల సంఖ్య ఆధారంగా టీఎ్‌సపీఎస్సీ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. పరీక్షను ఏ పద్ధతిలో నిర్వహించాలనే నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం టీఎ్‌సపీఎస్సీకే అప్పగించింది. విధివిధానాలు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి పది రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు టీఎ్‌సపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 8792 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ టీఎ్‌సపీఎస్సీకి వివరాలు పంపించింది. 31 జిల్లాల ప్రకారం రోస్టర్‌ పాయింట్లు, రిజర్వేషన్ల వివరాలు విద్యాశాఖ ద్వారా అందాల్సి ఉంది. ఈ వివరాలన్నీ వస్తే పది రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు టీఎ్‌సపీఎస్సీ వర్గాలు తెలిపాయి.*

కాగా గురుకుల టీచర్‌ పోస్టుల మాదిరిగా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రాత పరీక్షలు కాకుండా.. ఒకే పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. గతంలో 150 మార్కులకు డీఎస్సీ ప్రశ్నాపత్రం ఇచ్చేవారు. ప్రస్తుతం ఎన్ని మార్కులకు ఇస్తారు?, సిలబస్‌ అంశాలు, టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఎప్పుడు జారీ చేస్తారనే అంశాలపై 12న టీఎ్‌సపీఎస్సీ నిర్ణయం తీసుకోనుంది.*

జిల్లాల సందిగ్ధానికి తెర

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రధానంగా ఒకే ఒక సమస్య అడ్డంకిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం 2016 అక్టోబరు 11న రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 31కి చేరింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టులను పాత జిల్లాల ప్రకారం చేయాలా? లేక కొత్త జిల్లాల ప్రకారం చేయాలా? అనే ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. కొత్త జిల్లాల ప్రకారం చేస్తే న్యాయ సమస్యలు తప్పవనే వాదనలు వినిపించాయి. దీంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. దీనిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంది. ఎట్టకేలకు కొత్త జిల్లాల ప్రకారమే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే కొత్త జిల్లాల ప్రకారం నిర్వహిస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురై భర్తీ ప్రక్రియ ఎక్కడ నిలిచిపోతుందోనని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.*

త్వరలో నోటిఫికేషన్‌!: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నియామక నిబంధనలు ఖరారు కావడంతో ఇక నోటిఫికేషన్‌ విడుదల చేయడమే తరువాయిగా మారింది. ఇప్పటికే 8792 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు నోటిఫికేషన్‌ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. వీరి ఎదురుచూపులకు అనుగుణంగానే త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నిబంధనలు ఖరారు కాడంతో ఖాళీల జాబితా, నిబంధనల జాబితా ప్రభుత్వం టీఎ్‌సపీఎస్సీకి త్వరలోనే అందజేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఫైలు అందగానే నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు టీఎ్‌సపీఎస్సీ సిద్ధంగా ఉంది.*

నిబంధనల్లో ముఖ్యమైన అంశాలు...

కొత్త జిల్లాల ప్రకారమే టీచర్‌ పోస్టుల భర్తీడీఎస్సీ స్థానంలో టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ)గా పేరు మార్పు.*

జిల్లా యూనిట్‌గా నియామకాలు..*

అపాయింటింగ్‌ అథారిటీ డీఈవోనియామక బాధ్యతలు టీఎస్‌పీఎస్సీకి అప్పగింత.*

పరీక్ష విధానం టీఎస్‌పీఎస్సే నిర్ణయిస్తుంది. 80 మార్కులకు పరీక్ష నిర్వహించాలి.టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ.*

ఏపీ టెట్‌ను 2014-06-02 తేదీకి ముందు రాసిన వారి మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఏపీ టెట్‌ రాసి వారి మార్కులను పరిగణలోకి తీసుకోరు.*

ఎంపికైన జాబితాను టీఎస్‌పీఎస్సీ ఆయా జిల్లా అధికారులకు పంపించాల్సి ఉంటుంది.*

అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి. జనరల్‌ అభ్యర్థులు 50శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 45శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. దీంతో పాటే బీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇందులో కూడా జనరల్‌ అభ్యర్థులు 50శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 45 శాతం మార్కులు కలిగి ఉండాలి. దీంతో పాటే టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌(టెట్‌)లో అర్హత సాధించాలి. ఇక సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ పరీక్షకు అభ్యర్థులు ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు డిప్లోమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత అయి ఉండాలి. దీంతో పాటు టెట్‌లో అర్హత సాధించి ఉండాలి.


డీఎస్సీకి ‘కొత్త’ చిక్కులు

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నూతన జిల్లాలే ప్రాతిపదిక*

ప్రభుత్వ నిర్ణయంతో అభ్యర్థుల్లో ఆందోళన జిల్లాల విభజనతో సొంత జిల్లాలోనే స్థానికేతరులయ్యామని ఆవేదన*

పోస్టుల వారీ అర్హత నియమావళిపై ఇంకా రాని స్పష్టత*

నూతన జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో సాంకేతిక సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ఈ పోస్టులన్నీ జిల్లా స్థాయి పోస్టులు కావడంతో స్థానికత, స్థానికేతర ధ్రువీకరణలో ఇబ్బందులు ఎదురుకానున్నాయి. పూర్వజిల్లాలో స్థానికులైన వారంతా ఇప్పుడు కొత్త జిల్లాలో స్థానికేతరులు కానున్నారు. పూర్వ జిల్లాల ప్రాతిపదికన కాకుండా కొత్త జిల్లాలతో ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాల్సి వస్తే నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయే ప్రమాదముందని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అవసరమైతే ఎక్కువగా పోస్టుల్లేని జిల్లాలకు అవసరమైన పోస్టులను సృష్టించాలంటున్నాయి.*

మరోవైపు కొత్త జిల్లాల వారీగా పోస్టులను గుర్తించడం, రోస్టర్‌, రిజర్వేషన్లు, స్థానిక, స్థానికేతర పోస్టుల వివరాలపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో ఉద్యోగ ప్రకటనకు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిసింది.*


కొత్త జిల్లాలు కొన్నింటిలో ఆశించిన సంఖ్యలో పోస్టులు ఉండటం లేదని తెలుస్తోంది. పట్టణ జిల్లాల్లో ఆశావహుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, అక్కడ పోస్టులు తక్కువగా ఉన్నట్లు సమాచారం. గ్రామీణ జిల్లాలో పుట్టినా చాలామంది గతంలో పట్టణ, జిల్లా కేంద్రాల్లో చదువుకున్నారు. జిల్లా విభజనతో వీరు ఇప్పుడు తమ సొంత జిల్లాలోనే స్థానికులవుతున్నారు. అందువల్ల గ్రామీణ జిల్లాలో పోస్టులున్నా వీరు స్థానికేతర కోటాలో పోటీపడాల్సిన పరిస్థితి తలెత్తనుంది. ప్రస్తుతం ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల కనీస వయసు 25 ఏళ్ల పైబడే ఉంటోంది. వీరు స్వగ్రామాల్లో ఉంటూ ప్రాథమిక విద్యను పూర్తి చేసి, మండల, జిల్లా కేంద్రాల్లో వసతిగృహాలు, సంక్షేమ పాఠశాలల్లో ఉంటూ హైస్కూల్‌ విద్య చదివారు. ఉద్యోగుల పిల్లలు పట్టణాల్లోనే విద్యను అభ్యసించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం నాలుగో తరగతి నుంచి 10వ తరగతి వరకు కనీసం నాలుగేళ్లు ఎక్కడైతే చదివారో ఆ జిల్లాను స్థానికతగా తీసుకుంటారు. ఇప్పుడు వీరికి సాంకేతిక సమస్యలు రానున్నాయి.*

ఉదాహరణకు పూర్వ వరంగల్‌ జిల్లాలో ఓ విద్యార్థి మహబూబాబాద్‌లో పుట్టి అక్కడే ప్రాథమిక విద్య చదివాడు. ఐదో తరగతి నుంచి జిల్లా కేంద్రానికి వచ్చాడు. గతంలో అతని స్థానికత పూర్వ వరంగల్‌ జిల్లాగా ఉండేది. ఇప్పుడు వరంగల్‌ అర్బన్‌గా మారింది. ఇప్పుడు అక్కడ పోస్టులు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహబూబాబాద్‌లోపుట్టినప్పటికీ అక్కడి పోస్టులకు అతను దరఖాస్తు చేసే అవకాశం లేకుండా పోయింది.*

పూర్వజిల్లాలోస్థానికుడైనప్పటికీ అక్కడ స్థానికేతర కోటాలో 20 శాతం పోస్టులకు పోటీ పడాలి*

అంటేస్థానికత ధ్రువీకరణకూ ఇబ్బందులు జిల్లాలపునర్విభజననేపథ్యంలో అభ్యర్థుల స్థానికత ధ్రువీకరణకు ఇబ్బందులు పడేపరిస్థితి కనిపిస్తోంది.*

అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులయినప్పుడు పాఠశాల నుంచి తీసుకున్న స్టడీ సర్టిఫికెట్‌ (బోనాఫైడ్‌)లో పూర్వ జిల్లా పేరు ఉంది. ఇప్పుడు తీసుకోవాలంటే కొత్త జిల్లా కింద తీసుకోవాలి. ఈ స్టడీ సర్టిఫికెట్ల ప్రకారం.. ఆ అభ్యర్థి స్థానికత ఎవరు ధ్రువీకరించాలన్న విషయంపైనా ఇంకా స్పష్టత రాలేదు. ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగానికి ఈ బాధ్యతను అప్పగించాలని కొందరు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.*

ఈ మండలాల్లో మరీ ఇబ్బంది*

కొన్ని మండలాలు పూర్వ జిల్లా నుంచి ఏర్పడిన కొత్త జిల్లాలకు కాకుండా మరో జిల్లాలోకి వెళ్లాయి. ఇలాంటి మండలాలు, గ్రామాల పరిధిలోని అభ్యర్థుల పరిస్థితి మరీ గందరగోళంగా మారింది. వీరికి స్థానికత నిర్ణయించడం ఎలా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మరోవైపు నియామక పరీక్షకు సంబంధించిన విద్యార్హతల నియమావళిపై నిరుద్యోగుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.*

ఉపాధ్యాయుల పోస్టులకు పదిరోజుల్లో ప్రకటన*
ఉప  ముఖ్యమంత్రి కడియం వెల్లడి*
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పదిరోజుల్లో ఉపాధ్యాయుల పోస్టుల కోసం ప్రకటన(నోటిఫికేషన్‌) విడుదల చేయనుందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. బుధవారం హన్మకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం పాల్గొనగా.. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటికే 8792 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీకి అందజేసిందని చెప్పారు. పోస్టులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయని, మరో పదిరోజుల్లో ప్రకటన విడుదల అవుతుందన్నారు. మారుమూల ప్రాంతాల అభ్యర్థులను దృష్టిలో పెట్టుకునే కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి 40 నెలలు అవుతోందని, కొత్త జిల్లాలు ఏర్పడి ఏడాది పూర్తయిందని ఈ క్రమంలో మెరుగైన పాలనతో ప్రజలకు దగ్గరయ్యామన్నారు. వరంగల్‌ గ్రామీణ జిల్లాలో ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్‌ పార్కుకు ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారని కడియం చెప్పారు.*



Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

Saturday 7 October 2017

ZPGPF Slips of ZP - Adilabad/Mahabubnagar/Karimnagar/Medak/Nizamabad/RangaReddy/Warangal Dist

ZPGPF Slips of ZP - Adilabad / Mahabubnagar / Karimnagar / Medak / Nizamabad / RangaReddy / Warangal Dist

Good news see your 2016-17 GPF Slips;-& previous also.
ZPGPF Slips of ZP - Adilabad / Mahabubnagar / Karimnagar / Medak / Nizamabad / RangaReddy / Warangal Dist

Steps to see the ZPGPF Slip / Statement:-



  1. Click:- http://zpgpf.telangana.nic.in//
  2. Enter the Dist. Name
  3. Enter your GPF No.
  4. Enter password (type;- emp*********)
  5.  (***** means your GPF No)
  6. Enter the Text given correctly
  7. Click the MENU
  8. Click;- Ledgers / year
  9. Take a print out or view it

ZPGPF Slips of ZP - Adilabad / Mahabubnagar / Karimnagar / Medak / Nizamabad / RangaReddy / Warangal Dist


ZPGPF Zip - ఆదిలాబాద్ / మహబూబ్ నగర్ / కరీంనగర్ / మెదక్ / నిజామాబాద్ / రంగా రెడ్డి / వరంగల్ జిల్లా

ZPGPF స్లిప్ / స్టేట్మెంట్ చూడడానికి దశలు: -
  1. క్లిక్ చేయండి: - http://zpgpf.telangana.nic.in//
  2. జిల్లా పేరు సెలెక్ట్ చేయండి
  3. మీ GPF నెంబరుని నమోదు చేయండి
  4. పాస్వర్డ్ను టైప్ చేయండి (అందిరికి ఓకే రకమైన పాస్వర్డ్ ; - emp *********)
  5. (emp అని టైపు చేసి మీ జి.పి.ఎఫ్. నెంబర్ టైపు చేయండి)
  6. (***** అంటే మీ GPF సంఖ్య అర్థం)
  7. సరిగ్గా ఇవ్వబడిన వచనాన్ని(కాప్త్చ) నమోదు చేయండి
  8. మెనుని క్లిక్ చేయండి
  9. క్లిక్ చేయండి - - లెడ్జర్స్ / సంవత్సరం
  10. ప్రింట్ తీసుకోవచ్చు  లేదా దాన్ని వీక్షించండి

Password for zpgpf -  

పాస్వర్డ్ను టైప్ చేయండి (అందిరికి ఓకే రకమైన పాస్వర్డ్ ; - emp *********)
  1. (emp అని టైపు చేసి మీ జి.పి.ఎఫ్. నెంబర్ టైపు చేయండి)
  2. (***** అంటే మీ GPF సంఖ్య అర్థం)

.
Ruffty-Funny Teacher T-Shirt Gifts. Teacher is Always Right- Men's Cotton T Shirt .
.
కారుణ్య నియామకాలు    2017 - 18 ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను గణన    All district DEO websites    CCL - compensatory casual leaves    child care leave   CHILD CARE LEAVE (CCL)    CLASS ROOM ENGLISH for Teachers    DASSARA SUFFIX - PREFIX    Departmental tests OD    e- Filing Anywhere Anytime ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఇ-ఫైలింగ్ చేయడం:    FUNDAMENTAL RULES    GPF పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్:    Health Card EHS ఇహెచ్‌ఎస్‌ అంటే ఏమిటి?    Important GOs for Teachers    Leave GO s    PAY SCALES IN RPS-2015    Registers in School    ROSTER POINTS IN PROMOTIONS & APPOINTMENTS:    SPP Scale    suffix and prefix of summer vacation    Teachers doubts in telugu సందేహాలు - సమాధానాలు    TSGLI బాండ్ - మీ మొబైల్ లో DOWNLOAD చేసుకోవొచ్చు    Web sites for teachers    ZPGPF Slips Ananthapur Chittur Krishna Nellore Prakasham Srikakulam Vijayanagaram    ZPGPF Slips of ZP - Adilabad / Mahabubnagar / Karimnagar / Medak / Nizamabad / RangaReddy / Warangal Dist    అంతర్ జిల్లా బదిలీ సీనియారిటీ    అర్ధవేతన సెలవులు (HALF PAY LEAVES)    ఉద్యోగుల వైద్యానికి పరిమితేమీ లేదు    ఉపాధ్యాయుల పని తీరును మదింపు    ఉపాధ్యాయుల బదిలీలు తెలంగాణ 2018 గైడ్ లైన్ తేదీలు జీవిత భాగస్వామి పాయింట్లు    ఉపాధ్యాయులకు అంత్యక్రియల ఖర్చు    ఉపాధ్యాయులు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సర్వీసు అంశాలు    ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది?    ఏకీకృత సర్వీస్ రూల్స్ పై కొన్ని సందేహలు.    ఒక ఉపాధ్యాయుడు ప్రమోషన్ ఎన్నిసార్లు తిరస్కరించడానికి అవకాశం ఉంది?    కమ్యూటేషన్ COMMUTATION Leave in Telugu    కుటుంబ పెన్షన్    గ్రాట్యుటీ    చైల్డ్ కేర్ లీవ్ సందేహాలు    టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదల    డిపార్ట్ మెంటల్ పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులకు OD సౌకర్యం ఉంటుందా?    పెన్షన్ అనేవి ఉద్యోగి "ఆస్తి" అని సుప్రీం వ్యాఖ్య    ప్రత్యేక అర్ధవేతన సెలవు:    ప్రత్యేక ఆకస్మిక సెలవుల(Spl.Casual Leave)    ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాల్సిన రికార్డులు    ప్రభుత్వోద్యోగుల భీమా పాలసీ    ప్రాధమిక స్థాయి విద్యార్ధుల కోసం ఒత్తుల గేయం    ఫిన్లాండ్ దేశం విద్యారంగంలో    బదిలీలు ఎందుకు? ఏమిటి ఈ రూల్ నెం. 2(vii)    మధ్యాహ్న భోజనం వివరాలు SMS ద్వారా పంపే విధానం    మహిళా ఉద్యోగుల ప్రత్యేక జీవోలు    ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు    ముఖ్యమైన ప్రభుత్వ ఉత్తర్వులు:    మెడికల్ ఇన్వాలిడేషన్    వేసవిలో సంపాదిత సెలవులు పొందడం ఎలా ?    శాఖపరమైన పరీక్షలు (Departmental Tests) ఎవరు రాయాలనే సందేహం    సకల జనుల సమ్మె నగదుకు వీలుకాని ఆర్జిత సెలవుల గూర్చి    సందేహాలు -- సమాధానాలు    సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగ    సర్వీస్ బుక్ రిజిష్టర్ నిర్వహణ నియమాలు పద్దతులు    సెలవు సద్వినియోగం చేసుకోండిలా.    స్వచ్ఛ విద్యాలయ పురస్కారం 2017
Thankyou.

Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

Thursday 5 October 2017

TS SSA Recruitment 2017 RVM Jobs KGBV Application

TS SSA Recruitment 2017 RVM Jobs KGBV Application

TS SSA Recruitment 2017 RVM Jobs KGBV Application

Update information visit;- http://www.ssa.telangana.gov.in/

Sunday 1 October 2017

సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగ,ఉపాధ్యాయులకు అంత్యక్రియల ఖర్చు

సర్వీసులో ఉండి చనిపోయిన ఉద్యోగ,ఉపాధ్యాయులకు  అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం Rs.20,000 చెల్లిస్తారు.

(G.O.Ms.No122 తేది:11-04-2016)

 మరణించిన ఫ్యామిలి మరియు సర్వీసు పెన్షనర్లందరికీ అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఒకనెల పెన్షన్ లేదా Rs.20,000 ఏది ఎక్కువైతే అది చెల్లిస్తారు. పెన్షనర్ కన్నా ముందే మరణించే భార్యకు కూడా మొత్తాన్ని చెల్లిస్తారు.
(G.O.Ms101తేది: 21-04-2015)

 కుటుంబ పెన్షన్ పొందేవారికి కూడా రీయంబర్స్మెంట్ సౌకర్యం వర్తించును.అయితే వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వర్తించదు.
(G.O.Ms.No.87 తేది:28-02-2004)

 ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అంత్యక్రియల ఖర్చు నిమిత్తం Rs.10,000 చెల్లిస్తారు.
(G.O.Ms.No.38 తేది:28-05-2013)

 ఫ్యామిలి పెన్షనర్ చనిపోతే కుటుంబంలో ఎవరూ లేనిచే వారసులకు చెల్లిస్తారు.
(G.O.Ms.No.136 తేది:29-06-2011)