Labels

Wednesday 19 October 2016

ఉపాధ్యాయ MLC ఎన్నికలకు సంబంధించి క్రింది సందేహాలకు సమాధానాలు

 ఉపాధ్యాయ MLC ఎన్నికలకు సంబంధించి క్రింది సందేహాలకు  సమాధానాలు

   (అ) పదవీ విరమణ చెందిన ఉపాధ్యాయులు ఓటరు నమోదుకు అర్హులేనా?
సమా: అవును. అయితే  1-11-2013 తర్వాత పదవీ విరమణ చెంది ఉండాలి. ఇటువంటి వారు తాము చివరిగా పనిచేసిన సంస్థ అధిపతి  నుండి సర్టిఫికేట్ జతచేస్తే  సరిపోతుంది
  (ఆ) నల్లగొండ జిల్లాలో పనిచేస్తూ,హైదరాబాద్ జిల్లాలో నివాసం ఉన్న ఉపాధ్యాయుడు ఏ జిల్లాలో  నమోదుకు అర్హుడు ?
సమా: ఉపాధ్యాయులు తమ నివాసం ప్రకారం నమోదు చేయించు కోవాలి. ఆ ప్రకారం   హైదరాబాద్ జిల్లాలో  నమోదుకు అర్హుడు
(చూడుడు Hand Book For Electoral Registration Officers లోని పేరా 20.1మరియు  memo No: 3056/Elecs-E/A3/2016-1 Dtd: 29-9-2016 of CEO of AP & T, Hyderabad లోని పేరా xi)
(ఇ) కేంద్రీయ విద్యాలయాల్లో 8,9,10 తరగతులు భోధించని ఉపాధ్యాయులు ఓటరు నమోదుకు అర్హులేనా?
సమా: అవును అర్హులే.( Hand Book For Electoral Registration Officers లోని పేరా 37)
(ఈ) 1-11-2010 మరియు  01-11-2016 మధ్య  రెండు ఉన్నత పాటశాలలలో పనిచేసిన ఉపాధ్యాయులు రెండు సర్వీసు  సర్టిఫికేట్లు జతచేయాలా?
సమా: అవును రెండు ఉన్నత పాటశాలల నుండి విడి విడి సర్వీసు  సర్టిఫికేట్లు జతచేయాలి ( చూడుడు Memo No: 3056/Elecs-E/A3/2016-1 Dtd: 29-9-2016 of CEO of AP & T, Hyderabad లోని పేరా xiv).
(ఉ) ఓటరు నమోదుకు అడ్రస్సు రుజువు ఏదైనా జతచేయాలా?
సమా :  తప్పనిసరి గా జతచేయాల్సిన పత్రాల్లో అడ్రస్సు రుజువు పత్రం లేదు కానీ, జతచేస్తే మంచిది.
(ఊ) ఉపాధ్యాయులు  పనిచేసే చోట  నివాసం ఉండాలి కదా? ఇప్పడు వేరే చోట నివాసం ఉన్నట్లు చూపడం వల్ల, ఉత్తరోత్రా  సమస్యలేమైనా వస్తాయా?
సమా: లేదు. ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే సాదారణ ఎన్నికలలో  (అసెంబ్లీ/పార్లమెంటు ), ఆదార్ కార్డు లో  కూడా ప్రస్తుతం నివాసం ఉండే అడ్రస్సు ఇచ్చి ఉంటారు. ఇప్పటివరకు ఏ సమస్య రాలేదు కదా?
(ఋ)  IIIT, పండిత ట్రైనింగు కళాశాల, ప్రభుత్వ మ్యూజిక్ మరియు డాన్సు స్కూళ్ళలో పనిచేసే ఉపాధ్యాయులు నమోదుకు అర్హులేనా?
సమా: అవును (వీటి స్థాయి సెకండరీ పాటశాల కంటే ఎక్కువ కనుక, చూడుడు  (G.O Ms No: 537 GAD Dt: 28-9-2006)
(ఋ)  ఓటర్ కార్డు (EPIC) లో అడ్రస్, ప్రస్తుత అడ్రస్ వేరే రకంగా ఉన్నది, ఏ అడ్రస్ ప్రకారం  నమోదు చేయించాలి?
సమా: ఉండవచ్చు. EPIC కార్డు కేవలం ఫోటో link up చేయడానికే. ప్రస్తుత అడ్రస్ ప్రకారం  నమోదు చేయించండి
         

అన్ని పాఠశాలల్లో నిర్వహించాల్సిన రికార్డులు , పైల్ లు & రిజిష్టర్ లు

 అన్ని పాఠశాలల్లో నిర్వహించాల్సిన రికార్డులు ,  పైల్  లు & రిజిష్టర్ లు... 


1. విద్యార్థుల ప్రవేశం, తొలగింపు రిజిష్టర్,

2. జనాభా రిజిష్టర్,

3. తనిఖీ రిజిష్టర్,

4. సాధారణ సెలవు రిజిస్టర్,

5. బడిలో చేరని పిల్లల వివరాల రిజిస్టర్,

6. విద్యార్థుల ప్రగతి రిజిస్టర్,

7. విద్యార్థుల హాజరు రిజిస్టర్,

8. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్,

9. ప్రభుత్వ స్టాఫ్ రిజిస్టర్ .
(High school) . ప్రభుత్వేతర స్టాఫ్ రిజిస్టర్(High school),

10. ఆహ్వానం ల రిజిష్టర్,

11. సందర్శకుల రిజిస్టర్,

12. ఎస్ఎస్ఏకు సంబంధించిన క్యాష్ బుక్,

13. రోజు వారి మధ్యాహ్న భోజనానికి సంబంధించిన 3 రిజిస్టర్ లు, 

14. ఆదాయ, వ్యయ రిజిస్టర్ (క్యాష్బుక్),

15. టీసీ రిజిస్టర్,

16. సి.సి.ఇ నివేదిక రిజిస్టర్,

17. అకడమిక్ గైడెన్స్ రిజిస్టర్,

18. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ
రిజిస్టర్,

19. ఇన్స్పెక్షన్ రిజిస్టర్,

20. విద్యార్థుల ప్రార్థన రిజిస్టర్,

21. బడి బయట ఉన్న పిల్లల రిజిస్టర్,

22. తరచూ గైర్హాజరు అయ్యే పిల్లల
వివరాల రిజిస్టర్,

23. గ్రంథాలయ పుస్తకాల పంపిణీ రిజిస్టర్,

24. ఎస్ఎంసీ మినిట్స్ రిజిస్టర్,

25. రేడియో కార్యక్రమాల మినిట్స్ రిజిస్టర్,

26. బాలల సంఘాల మినిట్స్ రిజిస్టర్,

27. గోడపత్రిక రిజిస్టర్,

28. పోస్టుబాక్స్,

29. మూవ్ మెంట్ రిజిస్టర్

30. JABAR రిజిస్టర్,

31. మధ్యాహ్న భోజనం రైస్ స్టాక్ రిజిస్టర్,

32. ఆవాస ప్రాంత విధ్యార్ధుల వివరాల
రిజిస్టర్,

33. యూనిఫార్మ్స్ అక్విటెన్స్ రిజిస్టర్,

34. టెక్స్ట్ బుక్స్ అక్విటెన్స్ రిజిస్టర్,

35. పేరంట్స్ మీటింగ్స్ మినిట్స్ రిజిస్టర్,

36. స్టాక్ రిజిస్టర్,

37. MDM టేస్టింగ్ రిజిస్టర్,

38. సంవత్రరం వారిగ పిల్లల తొలగింపు రిజిష్టర్ ,

39. ఉపాధ్యాయుల సబ్ స్టిట్యూట్ రిజిష్టర్,

40. ప్రత్యేక కార్యక్రమాల రిజిష్టర్,

41. గేమ్స్ మెటీరియల్ ( ఇష్యూ ) రిజిష్టర్,

42. నిజాయితి రిజిష్టర్,

43. మద్యాహ్న భోజన నెలసరి బిల్ వివరాల రిజిష్టర్,

44. ఉపాధ్యాయుల డైరిలు,

45. లెసన్ ప్లాన్ లు,

46. ఉపాధ్యాయుల సమావేశపు రిజిష్టర్,

47. స్కాలర్ షిప్ ల వివరాల రిజిష్టర్ ,

48. పాఠశాల ప్రొఫైల్ రిజిష్టర్,

49. అప్లికేషన్ భద్రపరచూ ఫైల్,

50. అడ్మిషన్ ఫారం ల పైల్,

51. విద్యార్థుల పూర్తి వివరాల ( ప్రొఫైల్ ) రిజిష్టర్,

52. ఉపాధ్యాయుల పూర్తి వివరాల ( ప్రొఫైల్ ) / పర్సనల్ ఫైల్ రిజిష్టర్,

53. ఔట్ వార్డ్ రిజిష్టర్,

54. ఇన్ వార్డ్ రిజిష్టర్,

55. మద్యాహ్న భోజన సిబ్బంది పూర్తి వివరాలు ( ప్రొఫైల్, ఆరోగ్య కార్డ్ ) లు,

56. టాయిలెట్ / స్వీపర్ / ఇతర సిబ్బంది పూర్తి వివరాలు ( ప్రొఫైల్, ఆరోగ్య కార్డ్ ) లు...

57. యూ.సి ( ఖర్చులు, బిల్ లు ) భద్రపరచు ఫైల్,

పై వాటినన్నింటిని ఎప్పటికపుడు అప్ డేట్ చేస్తూ ఉండాలి.