Labels

Sunday, 4 February 2018

treasury.telangana.gov.in

1) మీ 12 నెలల జీతము వివరాలు
విత్ డిడక్శన్ష్, Treasury token no కోసం ....
Click the below direct link
jn

https://treasury.telangana.gov.in/ddoreq/index.php?service=lpccreationtot

------------------------------------
PRTU TS MBNR RURAL
2) మీ CPS ఖాతా లో ఉన్న ఫండ్ తెలుసుకోవడానికి
Click the below direct link....
https://www.cra-nsdl.com/CRA/
------------------------------------
3) మీ PF ఖాతా లో ఉన్న అమౌంట్ చూసు కోవడానికి,PF స్లిప్స్ డౌన్లోడ్ చేసు కోవడానికి
Note: PF ఎకౌంటు చూడటానికి పాస్ వర్డ్ అడుగుతుంది.. పాస్వర్డ్  emp@ మీ pf number
మీ pf నెంబర్ 123789
ఐతే పాస్ వర్డ్ emp@123789
Click the below direct link....
http://zpgpf.telangana.nic.in/
------------------------------------
4) మీ TSGLI వివరాలు
బాండ్ డౌన్లోడ్ చేసు కోవడానికి..
Click the below direct link...
http://www.tsgli.telangana.gov.in/Apgli_bond.aspx 
–---------------------------------
5) మీ TSGLI వివరాలు:::TSGLI policy details డౌన్లోడ్ చేసు కోవడానికి.. Click the below direct link...

http://www.tsgli.telangana.gov.in/PolicyDetails.aspx ------------------------------------
6)  TSGLI వివరాలు :::.TSGLI annual account slip డౌన్లోడ్ చేసుకొనుటకు
Click the below direct link.
http://www.tsgli.telangana.gov.in/AnnualReport.aspx@BJMG/KNG/KGY

 Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

సందేహాలు -- సమాధానాలు

సందేహాలు -- సమాధానాలు


ప్రశ్న:
నేను అనారోగ్యంతో ఏప్రిల్ 1 నుండి సెలవులో ఉన్నాను.సమ్మర్ హాలిడేస్ లో విధులలో చేరవచ్చా??

జవాబు:
వేసవి సెలవుల్లో చేరటానికి అవకాశం లేదు. స్కూళ్ళు రీ--ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే విధులలో చేరాలి.*
_____

ప్రశ్న:
నేను స్కూల్ అసిస్టెంట్ హిందీ గా పనిచేస్తున్నాను.ఇంటర్,డిగ్రీ,హిందీ పోస్టుకి కావాల్సిన అర్హతలు ఉన్నాయి. ఐనా నాకు 12 ఇయర్స్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు.HM పదోన్నతి కూడా ఇవ్వటం లేదు.ఎందుకని??

జవాబు:
మీకు బీ.ఎడ్ లేనందున ఇవ్వలేదు.
_____

ప్రశ్న:
ఒకే విద్యా సంవత్సరం లో రెండు కోర్సులు చేయవచ్చా??

జవాబు:
ఒకే విద్యా సంవత్సరం లో ఒక రెగ్యులర్ కోర్సు,ఒక దూర విద్యా కోర్సు చేయటానికి అనుమతి ఇవ్వండి,అంతేగానీ రెండు రెగ్యులర్ కోర్సులు చేయడానికి అనుమతి ఇవ్వవద్దని యూజీసి 28.12.12 న అన్ని యూనివర్సిటీ లకి లేఖ రాసింది.
_____

ప్రశ్న:
నేను 25 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను.ఇక వాలంటీర్ రిటైర్మెంట్ అవుదామని అనుకొనుచున్నాను.నాకు పెన్షన్ ఎంత వస్తుంది??

జవాబు:
చివరి ములవేతనం లో 45.45% పెన్షన్ గా రావటానికి అవకాశం ఉంది.
_____

సందేహాలు -- సమాధానాలు

ప్రశ్న:
ఒక టీచర్ వేసవి సెలవుల్లో 35 రోజులు వివిధ రకాల ప్రభుత్వ పరీక్షలకి హాజరు అయ్యాడు.అతనికి ఎన్ని ELs జమచేయబడతాయి??

జవాబు:*
వినియోగించుకున్న వేసవి సెలవులు 14 రోజులే కనుక 24 రోజుల ELs జమ చేయబడతాయి.*


ప్రశ్న:
మా స్కూల్లో నలుగురు SGT లు ఒకే DSC లో ,ఒకే రోజు స్కూల్లో జాయిన్ అయ్యారు.ఎవరు మాలో సీనియర్ అవుతారు??

జవాబు:
సీనియారిటీ DSC సెలక్షన్ లిస్ట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది.*

ప్రశ్న:
FAC HM గ్రీన్ ఇంక్ వాడవచ్చా??

జవాబు:
FR.49 ప్రకారం FAC భాద్యతలు నిర్వహిస్తున్న వారికి పోస్టుకి గల అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్ ఇంక్ వాడవచ్చు.


ప్రశ్న:
నేను హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.నాకు మహిళా టీచర్ల కి ఇచ్చే 5 స్పెషల్ CL లు ఇవ్వడం లేదు. ఎందువల్ల??

జవాబు:*
జీఓ.374 తేదీ:16.3.96 ప్రకారం 5 స్పెషల్ CL లు కేవలం మహిళా టీచర్ల కి మాత్రమే వర్తిస్తాయి.*ప్రశ్న:
నేను,మరొక టీచర్ ఇద్దరం ఒకే రోజు SA లుగా పదోన్నతి పొందాము.ఒకే రోజు జాయిన్ అయ్యాము.SA క్యాడర్ లో ఎవరు సీనియర్ అవుతారు??

జవాబు:*
SGT క్యాడర్ లో ఎవరు సీనియర్ ఐతే,వారే SA క్యాడర్ లో కూడా సీనియర్ అవుతారు.*

సందేహాలు_సమాధానాలు

1. Voluntary Retirement (VR)  తీసుకోదలిస్తే ఎన్నినెలల ముందు దరఖాస్తు పెట్టుకోవాలి? దరఖాస్తు ఎవరికి చేయాలి? ఏయే పత్రాలు జతపర్చాలి?

Ans: VR తీసుకోదలిస్తే 3 నెలల ముందు నియామకపు అధికారికి నోటీసు (దరఖాస్తు) ఇవ్వాలి. మూడు నెలల లోపు ఇచ్చే నోటీసులను సైతం నియామకపు అధికారి అనుమతించవచ్చు. ఉపాధ్యాయుల విషయంలో మండల పరిధిలోని టీచర్లు MEO ద్వారా, హైస్కూల్ టీచర్లు HM ద్వారా DEO కు ఏ తేదీ నుంచి VR అమల్లోకి రావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా తెల్పుతూ నోటీసు ఇవ్వాలి. స్పెసిఫిక్ గా జత చేయాల్సిన పత్రాలేవీ లేవు.

2. VR  ఏయే కారణాలపై తీసుకోవచ్చు?

Ans: వ్యక్తిగత, అనారోగ్యం తదితర కారణాలను చూపవచ్చు.

3. ఒక టీచరుకు అక్టోబర్ 2018 నాటికి 20 ఏళ్ళ సర్వీస్ పూర్తవుతుంది. అక్టోబర్ తర్వాత VR తీసుకుంటే పూర్తి పెన్షన్ వస్తుందా?

Ans: 20 ఏళ్ళ నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ పూర్తి చేస్తే VR కి ఎలిజిబిలిటీ వస్తుందికానీ, పూర్తి పెన్షన్ రాదు.

4. ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేశాక VR తీసుకోదలిస్తే... వెయిటేజీ ఎన్ని సంవత్సరాలు Add చేస్తారు?

Ans: క్వాలిఫయింగ్ సర్వీస్ కు.... సూపరాన్యుయేషన్ (58/60 ఏళ్ళు) కి గల తేడాను వెయిటేజీగా Add చేస్తారు. అయితే... దీని గరిష్ట పరిమితి ఐదేళ్లు.
5. Loss of Pay, Long Leave (medical grounds) లో ఉండి VR కి దరఖాస్తు చేయవచ్చా?

Ans: Yes.
6. Medical Leave లో ఉండి,  స్కూల్లో జాయిన్ అయ్యాకే VR కి అప్లై చేయాలా? సెలవులో ఉండి VR తీసుకోవడం ప్రయోజనమా?

Ans: సెలవులో ఉండి  VR తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకోరాదు. స్కూల్లో జూయిన్ అయి VR తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకొని సెలవు కాలానికి పూర్తి వేతనం పొందే అవకాశం ఉంటుంది.

7. అక్టోబర్ 2018 నుంచి VR తీసుకుంటే కొత్త PRC వర్తిస్తుందా?

Ans: 11 వ PRC.... ఫస్ట్ జులై, 2018 నుంచి అమల్లోకి రావాల్సి వుంది. వస్తుందనే నమ్మకమూ నాకుంది. అయితే... నోషనలా? మానిటరీ బెనిఫిట్ ఉంటుందా? అనే విషయాన్ని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం!

8. VR తీసుకున్న తర్వాత GI కంటిన్యూ చేయవచ్చా? GI అమౌంట్ ఎంత వస్తుంది?
Ans: VR తవ్వాత గ్రూప్ ఇన్సూరెన్సు కంటిన్యూ అయ్యే అవకాశంలేదు. ప్రభుత్వం ఏటేటా విడుదల చేసే టేబుల్ ప్రకారం అమౌంట్ వస్తుంది.

9. చివరగా ఒక ప్రశ్న. 20 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ సర్వీస్ మధ్య VR తీసుకుంటే పెన్షన్ ఎంతెంత వస్తుంది?

Ans: వెయిటేజీతో కలుపుకొని 33 ఏళ్ళ సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అయితే.... చివరి Basic Pay లో 50 % పెన్షన్ గా నిర్ధారించబడుతుంది. అలా కాకుండా VR తీసుకుంటే....
నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ > పెన్షన్
20>37.87% (చివరి మూలవేతనంలో)
21>39.4%
22>40.9%
23>42.4%
24>43.93%
25>45.45%
26>46.97%
27>48.48%
28>50%
(ఈ టేబుల్ 58 ఏళ్ళ వయస్సు నిండి ఉద్యోగ విరమణ చేసే వారికీ వర్తిస్తుంది.

సందేహాలు  --    సమాధానాలు

ప్రశ్న:
భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగులు.ఒకరు రిటైర్మెంట్ అయ్యారు.పెన్షన్ వస్తుంది. రెండవ వారు మరణించిన వారి వారసులకి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తారా??

జవాబు:*
మెమో.3548 ;GAD; తేదీ:24.3.12 ప్రకారం ఒకరికి పెన్షన్ వచ్చుచున్నందున కారుణ్య నియామకం వర్తించదు.*
____

ప్రశ్న:
ఒక ఉద్యోగిని ఎంత కాలం సస్పెన్షన్ లో ఉంచవచ్చు??

జవాబు:*
జీఓ.526 : GAD; తేదీ:19.8.08 ప్రకారం ఒక ఉద్యోగిని 2 సంవత్సరం లకి మించి సస్పెన్షన్ పీరియడ్ లో ఉంచకూడదు.*
___

ప్రశ్న:
ఒక మహిళా ఉద్యోగికి వివాహం కోసం డబ్బులు ఏమైనా అప్పుగా ఇస్తారా???

జవాబు:*
జీఓ.39 ; ఆర్థికశాఖ; తేదీ:15.4.15 ప్రకారం 75000/- అప్పుగా ఇస్తారు. దీనిని 70 వాయిదా లలో తిరిగి చెల్లించాలి.*
__

ప్రశ్న:
ప్రత్యేక ఆశక్తత సెలవులో ఉన్న వారికి జీతభత్యాలు ఎలా చెల్లించాలి??

జవాబు:*
120 రోజుల వరకు పూర్తి జీతం,మిగిలిన కాలానికి సగం జీతం చెల్లిస్తారు.*
__

ప్రశ్న:
కమ్యూటెడ్ సెలవును హాఫ్ పే లీవ్ గా మార్చుకోవచ్చా???

జవాబు:*
జీఓ.143 తేదీ:1.6.68 ప్రకారం వీలులేదు.*
___

ప్రశ్న:
బీసీ క్రిమిలేయర్ పరిధిలోకి ఎవరు వస్తారు??

జవాబు:*
కేవలం గ్రూప్--1&11 సర్వీసులో ఉన్న ఉద్యోగులు మాత్రమే వస్తారు.టీచర్లు క్రిమిలేయర్ పరిధిలోకి రారు మరియు 6 లక్షల ఆదాయం కలిగిన బీసీ ఉద్యోగుల0దరూ క్రిమిలేయర్ పరిధిలోకి రారు.*

   


PF ఋణం ఎంత ఇస్తారు??తిరిగి ఎలా చెల్లించాలి??

జవాబు:*
PF నిబంధనలు 15ఏ ప్రకారం 20 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు మరియు 10 ఇయర్స్ లోపు సర్వీసు గలవారు ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. గృహ నిర్మాణ0 కోసం, స్థలం కొనుగోలు చేయడానికి 15 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు కూడా ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. రూల్ 15సీ ప్రకారం బేసిక్ పే కి 6 రెట్లు లేదా నిల్వ లో సగం ఏది తక్కువ ఐతే అది ఋణంగా ఇస్తారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిల్వ మొత్తం లో గరిష్టంగా 75% వరకు ఇవ్వవచ్చు.

ప్రశ్న:
నాకు పదోన్నతి వచ్చింది. నేను పదోన్నతి ఆర్డర్ తీసుకోలేదు. ఇపుడు ఏమి జరుగుతుంది??

జవాబు:
మెమో.10445 ; జీఏడి ; తేదీ:1.6.11 ప్రకారం ఒక సారి పదోన్నతి తిరస్కరించవచ్చు.ఐతే జీఓ.145 ; జీఏడి ; 15.6.04 ప్రకారం మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తర్వాత ఇక చేర్చరు. Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

Wednesday, 20 December 2017

ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది?

ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది?

ఏయే బెనిఫిట్స్ వర్తిస్తాయి?

జ:- *20 సంవత్సరాల సర్వీసు నిండిన ఉద్యోగి యొక్క కోరిక ప్రకారం రిటైర్ అగుటకు అనుమతించబడును.*
( *G.O (P) No. 88, Finance and Planning (Finance Wing) P.N.C. Dept, Date: 26-01-1980* ) *రూల్ : 42,43*

*పెన్షన్ కమ్యూటేషన్:*
                   
*వాలెంటరీ రిటైర్మెంటు పొందిన ఉపాధ్యాయుడు తన పెన్షన్ లో 40% అమ్ముకోవచ్చును.* దీనినే *పెన్షన్ కమ్యూటేషన్* అంటారు.
( *G.O.m.s.No: 158, Finance and Planning ; Date: 16-09-1999*)
గమనిక:- *రిటైరైన సంవత్సరంలోగా సంబంధిత అధికారిగారికి దరఖాస్తు చేసుకోవాలి.* సంవత్సరం దాటితే *మెడికల్ టెస్టులు, అనేక వివరాలతో జాప్యం జరుగుతుంది*

*పెన్షన్*

*పదవీ విరమణ చేయునాటికి 10 సంవత్సరములు అంతకంటే ఎక్కువ సర్వీసు చేసిన వారికి పెన్షన్ ఇస్తారు.*
*పెన్షన్ లెక్కించు విధానము*:-
*చివరి నెల వేతనం× అర్థ సం„యూనిట్లు × 1/2 × 1/66 సూత్రం ప్రకారం లెక్కిస్తారు*
20 సంవత్సరాలకు వాలెంటరీ రిటైర్మెంటు కోరితే 5సంవత్సరాల వెయిటేజిని కలిపి సర్వీస్ కాలమునకు కలిపి పెన్షన్ నిర్ణయిస్తారు.

  *కుటుంబ పెన్షన్ వివరాలు*

            *రిటైర్మెంట్ గ్రాట్యుటీ*

మినిమం క్వాలిఫైయింగ్ సర్వీస్:
5 ఇయర్స్ ఫైనాన్షియల్ బెనిఫిట్: క్వాలిఫైయింగ్ సర్వీస్ పొడవు ఆధారంగా. సుమారు మొత్తం Rs.12.00 లక్షల .

                *డెత్ గ్రాట్యుటీ*

0-1 సంవత్సరాలు సేవ: 6 టైమ్స్/ 4 (చెల్లింపు రోజు)
1-5 సంవత్సరాల సేవ: 18 సార్లు / 4 (పే,డీఏ )
5-18 సంవత్సరాల సర్వీస్: 36 సార్లు 4 (పే-డే) > 18 సంవత్సరాల సేవ: 38
/4 (చెల్లించాల్సిన రోజు)
మాక్సిమం మొత్తం: Rs.12.00 లక్షల. కుటుంబ పింఛను ఉద్యోగి / పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులకు ఇవ్వబడుతుంది.

             *పెన్షన్ రకాలు*

1. *పెంపొందించిన కుటుంబ పెన్షన్* :-

    *మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:*
ఏడు సంవత్సరాలు కంటే ఎక్కువ ఏడు సంవత్సరాల కాలానికి 50% చివరి చెల్లింపు మరియు ఏడు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలుగా చెల్లింపులు.

2.  *కుటుంబ పెన్షన్* : -

  *మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:*

 ఒక సంవత్సరం నుండి 7 సంవత్సరాల. పెంచిన కుటుంబ పెన్షన్ ముగిసిన తరువాత, కుటుంబ పింఛను ఇవ్వబడుతుంది. మొత్తం చెల్లింపు మరియు అనుమతుల యొక్క 30%

3.  *అదనపు సాధారణ కుటుంబ పెన్షన్*:-

 అతని / ఆమె విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అతని పింఛను ఇవ్వబడుతుంది,

        *FAMILY PENSION*

 సర్వీస్ లో ఉండి గానీ, రిటైర్ ఐన తరువాత గానీ ఉద్యోగి మరణించిన ,అతని భార్య కు ఇచ్చే పెన్షన్ ను ఫ్యామిలీ పెన్షన్ అంటారు .

 7ఇయర్స్ సర్వీస్ లోపు చనిపోతే, భార్యకు పే లో 30% ఫ్యామిలీ పెన్షన్ గా ఇస్తారు.

 7ఇయర్స్ సర్వీస్ పైన చేసి రిటైర్మెంట్ లోపు చనిపోతే రెండు రకాలుగా భార్యకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు.

a) మొదటి 7 ఇయర్స్ కి 50%

b) 7 ఇయర్స్ తరువాత నుండి 30%.

EXample* 1:

ఓక ఉద్యోగి సర్వీస్ లో ఉండగా మరణించెను.అప్పటికి అయన సర్వీస్ 3y 6m. అపుడు ఆతని పే 7740 ఐన, భార్య కు వచ్చే ఫ్యామిలీ పెన్షన్
 ➡ 7740×30/100 =2322.00
ఇది భార్య కు జీవితాంతం ఇస్తారు.

 Example* 2:

 ఉద్యోగి మరణించే నాటికి చేసిన సర్వీస్ 8y 4m. అపుడు పే 11530.ఐన, అతని భార్య కు మొదటి 7ఇయర్స్ వచ్చే ఫ్యామిలీ పెన్షన్
 11530×50/100=5765.00.

 7 ఇయర్స్ తరువాత నుండి జీవితాంతం వచ్చే ఫ్యామిలీ పెన్షన్👉� 11530×30/100 = 3459.00

CPS ఖాతాదారుడు తన ఖాతా నుండి డబ్బు ను తిరిగి పొందు విధానం (ఉపసంహరణ విధానం)

రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.ఎస్.నెం-62 . తేది=07/03/2014 ఉత్తర్వుల ద్వారా ఖాతా దారుడు
1.స్వచ్ఛంద పదవి విరమణ.
2.పదవీ విరమణ
3.ఆకాలమరణం

ఈ మూడు సందర్భాలలో CPS ఖాతా నుండి డబ్బును తిరిగిపొందగలరు.

1. *స్వచ్ఛంద పదవీవిరమణ* ::---
ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తము నుండి 80 % ను నెలవారి పెన్షన్గా ఇవ్వడానికి A.S.Pలో ఎంచుకున్న రకానికి చెందిన పెన్షన్ అందజేస్తారు. 20%నిధి ని చెల్లిస్తారు.

*సూచన* :--మొత్తం నిధి 1 లక్ష లోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.

దీనికోసం FORM 102-GP ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను.

2. *సాధారణ పదవీ విరమణ* ::--
ఉద్యోగి పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తములో నుండి 40%ను నేలవారి పెన్షన్ గా ఇవ్వడానికి  A.S.P లో ఎంచుకున్న రకానికి పెన్షన్ అందజేస్తారు.60% నిధిని చెల్లిస్తారు.

*సూచన* :-
  మొత్తం నిధి  2లక్ష లలోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.
దీనికోసం FORM 101-GS ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను.

3. *ఆకాలమరణం పొందిన సందర్భంలో* ::-
ఉద్యోగి ఖాతాలో ఉన్న మొత్తం(100%) నిధిని నామినీ కి చెల్లిస్తారు.

దీనికోసం FORM 103-GD ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను.

Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

TRT-2017:SGT Syllabus in Telugu సిలబస్

TRT-2017:SGT Syllabus in Telugu సిలబస్

TRT-2017 రాయబోయే మిత్రులకోసం సిలబస్ ను తెలుగులోకి అనువదించి రాయడం జరిగింది.ఉపయోగ పడుతుందని ఆశిస్తున్నాను

A.తెలుగు (Telugu)

ఎ.విషయం
1అ) అపరిచిత గద్యం
ఆ) అపరిచిత పద్యం
2    కవులు-రచయితలు – కావ్యాలు – రచనలు
3    ప్రక్రియలు
4    (ఇతిహాసం, పురాణం – ప్రబంధం – శతకం – కథ – కథానిక – గల్పిక – వ్యాసం – లేఖ – సంపాదకీయం – వార్తావ్యాఖ్య – విమర్శ – ఆత్మకథ – జీవిత చరిత్ర)
5    క్రియలు
6    (సమాపక, అసమాపక క్రియలు, అకర్మక, సకర్మక క్రియలు)
7    వాక్యాలు, రకాలు
8    (వాక్యరీతులు, కర్తరి కర్మణీ వాక్యాలు – ప్రత్యక్ష – పరోక్ష వాక్యాలు, వాక్య నిర్మాణం ,వాక్యక్రమం,)
9    ఆధునిక భాష మార్పిడి, ప్రామాణిక లేఖన రూపాలు మాండలికాలు, సంఘటనా క్రమం
10    అర్థవిపరిణామం
11    భాషారూపాలు:
12    (గ్రాంధిక భాష – వ్యావహారిక భాష, మాండలిక భాష, ఆధునిక ప్రామాణిక భాష)
13    వర్ణములు:
14    (ధ్వని, ధ్వన్యుత్పత్తి స్థానాలు, వర్ణమాల, కళలు, దృత ప్రకృతాలు, పరుషాలు, సరళాలు, భాషాభాగాలు, వచనాలు, కాలాలు, లింగం, విభక్తులు, విరామ చిహ్నాలు)
15    అర్థం, నానార్థాలు, పర్యాయపదాలు
16    ప్రకృతి-వికృతులు, వ్యతిరేక పదాలు వ్యుత్పత్యర్థాలు
17    పొడువు కథలు
18    సామెతలు
19    జాతీయాలు
20    చందస్సు
21    అలంకారాలు
22    సంధులు
23    సమాసాలు
బి. బోధనా పద్ధతులు*
24    భాష, మాతృభాష, మాతృభాష బోధన లక్ష్యాలు
25    భాషా నైపుణ్యాలు
26    బోధన పద్ధతులు
27    ప్రణాళిక రచన, వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమం
28    బోధనాభ్యసన ఉపకరణాలు, ఆంధ్ర సాహితి సంగ్రహం
29    మూల్యాంకనం.

B.English


30    Parts of Speech
31    Tenses
32    Types of sentences
33    Articles and Prepositions
34    Degrees of Comparison
35    Direct Speech and Indirect Speech
36    Clauses
37    Voice – Active and Passive Voice
38    Use of Phrases
39    Comprehension of a Prose Passage
40    Composition
41    Vocabulary Methodology
42    Aspects of English:- (a) English language – History, Nature, Importance, Principles of English as Second (B) Problems of Teaching / Learning English
43    Objective of Teaching English
44    Phonetics
45    Development of Language Skills:- (a) Listening, Speaking, Reading & Writing (LSRW) (b) Communicative skills
46    Approaches, Methods, Techniques of teaching English: Introduction, Definition and Types of Approaches, Methods and Techniques of Teaching English, Remedial Teaching
47    Teaching of structures and Vocabulary items.
48    Teaching of Learning Materials in English
49    Lesson Planning
50    Curriculum & Textbooks
51    Evaluation in English Language

*C.సైకాలజీ (Psychology)*

*PART – I - శిశువికాసం*
52    వ్యక్తి అధ్యయన పద్ధతులు:
53    పెరుగుదల – వికాసం – పరిణతుల భావన
54    వైయక్తిక భేదాలు:
55    వైఖరులు, అభిరుచులు మరియు వాటి మాపనాలు
56    మూర్తిమత్వ వికాసం – అర్థం
57    సర్దుబాటు, మానసిక ఆరోగ్యం
58    వికాస కార్యక్రమాలు – ఆటంకాలు

*PART- II (అభ్యాసనాన్ని అర్థంచేసుకోవడం)*

59    అభ్యసనం

*PART-III పెడగాగికల్ కన్సర్న్స్*

60    తరగతిగది నిర్వహణ – మార్గదర్శకత్వం, మంత్రణo.
61    బాలల ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం – 2009
62    బాలలు హక్కులు
63    జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం – 2005
64    బోధన దశలు – preactive, Interactive, Postactive
65    విభిన్న సన్నివేశాలలో బాలలు – ప్రత్యేక అవసరాలుగల బాలలు – ప్రత్యేక విద్య, సమ్మిలిత విద్య.66    బోధన –అభ్యసకునితో, అభ్యసనంతో దాని సంబంధం
67    వివిధ సన్నివేశాలలో అభ్యాసకులు – సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సన్నివేశాలలో అభ్యాసకుడు
68    బోధన శాస్త్ర పద్ధతులను అర్థం చేసుకోవడం – అన్వేషణ, పరికల్పన, సర్వే, పరిశీలన, కృత్యాధార అభ్యసనం
69    వైయుక్తిక, సామూహిక అభ్యసనం
70    అసమా సమూహాలలో అభ్యసనను నిర్వహించడం. సాంఘిక, ఆర్థిక నేపాధ్యం, సామర్థ్యాలు, ఆసక్తులు.
71    అభ్యసన నిర్వహణ నమూనాలు: ఉపాధ్యాయ కేంద్రియా, పాఠ్య విష కేంద్రిత, అభ్యాసి కేంద్రిత పద్ధతులు.
72    ప్రణాళిక బద్ధమైన కార్యకలాపంగా బోధన, ప్రణాళిక మౌలికాంశాలు.
73    అభ్యసన కోసం మూల్యాంకనం – అభ్యసించిన అంశాలు మూల్యాంకనం - వీటి మధ్య భేదాలు – పాఠశాల ఆధారిత మూల్యాంకనం, నిరంతర – సమగ్ర మూల్యాంకనం – దృక్పథాలు – ఆచరణలు,

*D.గణితం: (Mathematics)*

74    సంఖ్యామానం – సంజ్ఞామానం
75    బీజగణితం
76    రేఖా గణితం
77    వ్యాపార గణితం
78    క్షేత్రమితి
79    సంఖ్యాక శాస్త్రం

*E.ఫిజికల్ సైన్స్ (Physical Science)*

80    కాంతి
81    ధ్వని
82    ఉష్ణం
83    అయస్కాంతత్వం
84    విద్యుత్
85    కొలతలు
86    బలం
87    గురుత్వాకర్షణ
88    పని మరియు శక్తి
89    వాతావారణం – గాలి
90    వాతావారణం- శీతోష్ణస్థితి
91    ఇళ్ల నిర్మాణం – పారిశుద్ద్యం
92    సూర్యుడు గ్రహాలు
93    చలనం మరియు కాలం

*F.కెమిస్ట్రీ (Chemistry)*

94    సంకేతాలు, ఫార్ములా మరియు సమీకరణాలు
95    లోహాలు మరియు అలోహాలు
96    పదార్థాలు మరియు వస్తువులు
97    నీరు
98    నేలబొగ్గు మరియు పెట్రోలియం
99    కృత్రిమదారాలు మరియు మారితి ప్లాస్టిక్ లు
100    దహనం, ఇంధనాలు
101    ఆమ్లాలు - క్షారాలు

*G.బయాలజీ (Biology)*

102    విజ్ఞాన శాస్త్రం – అర్థము, నిర్వచనాలు, విభాగాలు
103    కణం – కణజాలాలు
104    సజీవులు- నిర్జీవులు – లక్షణాలు (వర్గీకరణ)
105    మొక్కలు మరియు జంతువులు
106    సూక్ష్మజీవ ప్రపంచం
107    మానవ శరీరం – ఆరోగ్యం
108    మన ఆహారం
109    మన నివాసం
110    శక్తి
111    గాలి
112    నీరు
113    పర్యావరణo
114    జీవావరణ వ్యవస్థలు
115    జీవశాస్త్రంలో నూతన దోరణులు

*H.సోషల్ జాగ్రఫీ (Social Geography)*

116    గ్లోబు-భూమి నమూనా/ అక్షాంశాలు – రేఖాంశాలు
117    భూమి – చలనాలు – ఋతువులు
118    సూర్యుడు – శక్తివనరు
119    ఉష్ణోగ్రత – పీడనం – గాలి – వర్షం
120    ఆర్ద్రత – అవపాతం
121    నదులు – భూస్వారూపాలు
122    మహాసముద్రాలు – చేపలు పట్టడం
123    చెరువులు – భూగర్భాజాలాలు
124    వివిధ రకాల పటాలను అర్ధం చేసుకోవడం
125    మాన చిత్రాల అధ్యయనం – తయారీ
126    మాన చిత్రాలు – గుర్తులు
127    వాతావారణం – గాలి
128    సూర్యుడు – గ్రహాలు
129    మనదేశం – ప్రపంచం
130    యూరప్
131    ఆఫ్రికా
132    ధృవప్రాంతాలు
133    జీవావరణం
134    ప్రపంచం – దేశాలు – ప్రత్యేకతలు

*I.ఇండియన్ జాగ్రఫీ (Indian Geography)*

135    భారతదేశం – ఉనికి
136    నైసర్గిక స్వరూపాలు
137    శీతోష్ణస్థితి
138    అడవులు
139    వ్యవసాయo
140    ఖనిజాలు
141    పటాల అధ్యయనం
142    నదులు
143    హిస్టరీ
144    భారతదేశ చరిత్ర – సంస్కృతి
145    ఆహార సేకరణ నుండి ఆహార ఉత్పత్తి వరకు – ఆదిమానవుడు
146    తెగలు – సామాజిక నిర్ణయాధికారం
147    సామ్రాజ్యాలు – గణతంత్రాల ఆవిర్భావం
148    మొదటి సామ్రాజ్యాలు
149    ప్రాచీన కాలంలో మతం – సమాజం
150    దేవుని యందు ప్రేమ – భక్తి
151    భాష, లిపి, గొప్ప గ్రంథాలు
152    శిల్పం, కట్టడాలు
153    కొత్త రాజ్యాలు – రాజులు
154    ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం – కాతీయులు
155    విజయనగర రాజులు
156    మొఘల్ సామ్రాజ్యం
157    భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య స్థాపన
158    జానపదుల – మతం
159    దైవ సంబంధ భక్తి మార్గాలు
160    రాజులు- కట్టడాలు
161    బ్రిటీష్ నిజాం పాలనలో భూస్వాములు, కౌలుదార్లు
162    జాతీయోద్యమం – తొలిదశ (1885-1919)
163    జాతీయోద్యమo – మలిదశ (1919-1947)
164    భారత జాతీయోద్యమము
165    హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్ర ఉద్యమo
166    సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు
167    ఆధునిక కాలంలో కళలు – కళాకారులు
168    సినిమా – ముద్రాణా మాధ్యమాలు

*J.సివిక్స్ (Civics)*

169    భారత రాజ్యాంగం
170    భారత రాజ్యాంగం – ప్రవేశిక
171    కేంద్ర ప్రభుత్వం
172    న్యాయ సంబంధమైన చట్టాలు
173    రాష్ట్ర ప్రభుత్వం
174    మహిళా రక్షణ చట్టాలు
175    స్థానిక స్వపరిపాలన
176    1947-1977 వరకు
177    భారతదేశంలో 1977 నుంచి 2010
178    ప్రజాస్వామ్యo
179    రవాణా భద్రత విద్య
180    కుల వ్యవస్థ – ఉద్యమాలు
181    సినిమాలు – ముద్రణ యంత్రాలు

*K.ఎకనామిక్స్ (Economics)*
182    అర్థశాస్త్ర పరిచయం
183    ఉత్పత్తి – ఉపాధి
184    ద్రవ్య వ్యవస్థ ఋణం
185    ప్రభుత్వ బడ్జెట్ – పన్నులు
186    ధరలు జీవన వ్యయం
187    ప్రపంచీకరణ
188    సమానత సుస్థిర అభివృద్ధి
189    హక్కులు-అభివృద్ధి
190    ఆహార భద్రత
191    ద్రవ్యము బ్యాంకింగ్
192    ప్రజారోగ్యం – ప్రభుత్వం
193    జమీందారీ వ్యవస్థ – రద్దు
194    అభివృద్ధి భావనలు
195    రవాణా వ్యవస్థ – ప్రాధాన్యత
196    కాగితపు పరిశ్రమ
197    పారిశ్రామిక విప్లవం
198    నేటి వ్యవసాయo
199    వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం
200    చేనేత వృత్తులు – చేనేత వస్త్రాలు
201    రామాపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ
202    జీవనోపాదులు – సాంకేతిక విజ్ఞానం – ప్రభావం
203    పేదరిక అవగాహన Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

Teachers doubts in telugu సందేహాలు - సమాధానాలు

Teachers doubts in telugu సందేహాలు - సమాధానాలు


ప్రశ్న:
నేను జులై 14 న ఉద్యోగంలో చేరాను.ఇంక్రిమెంట్ నెల జులై.నేను జూన్ 30 న రిటైర్ అవుతున్నాను.పెన్షన్ ప్రతిపాదనలు ఎలా పంపాలి?

జవాబు:*
జీఓ.133 తేదీ:3.5.74 మరియు మెమో.49643 తేదీ:6.10.74 ప్రకారం ఇంక్రిమెంట్ అనేది నెల మొదటి తేదీ అవుతుంది. ఉద్యోగం లో చేరిన తేదీ కాదు.కావున మీకు రిటైర్మెంట్ మరుసటి రోజు ఇంక్రిమెంట్ నోషనల్ గా మంజూరు చేసి పెన్షన్ ప్రతిపాదనలు పంపుకోవాలి.*


ప్రశ్న:
నేను ఉన్నత చదువుల కోసం 78 రోజులు జీత నష్టపు సెలవు పెట్టాను.ఆ కాలానికి ఇంక్రిమెంట్ వాయిదా వేశారు.వాయిదా పడకుండా ఉండేందుకు ఏమి చెయ్యాలి?

జవాబు:*
FR-26 ప్రకారం 6 నెలల వరకు ఇంక్రిమెంట్ వాయిదా పడకుండా ఉత్తర్వులు ఇచ్చే అధికార0 CSE గారికి మాత్రమే ఉన్నది.కాబట్టి మీరు CSE గారికి దరఖాస్తు చేసుకోగలరు.*


ప్రశ్న:
డైస్ నాన్ కాలం అంటే ఏమిటి?

జవాబు:*
FR.18 మరియు APLR-1933 లోని రూల్ 5 ప్రకారం 5ఇయర్స్ కి మించి గైర్హాజరు అయిన ఉద్యోగి, తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు గా భావించాలి.తిరిగి ఉద్యోగం లో చేరాలి అంటే ప్రభుత్వం యొక్క అనుమతి కంపల్సరీ.*
FR.18 ప్రకారం డైస్ నాన్ కాలం ఇంక్రిమెంట్లు, సెలవులు, పెన్షన్ తదితర సందర్భాలకు సర్వీసు గా పరిగణించబడదు.కనుక ఈ కాలానికి సెలవు మంజూరు చేయటo,వేతనం చెల్లించటం అనే ప్రశ్నలు ఉత్పన్నం కావు.*

ప్రశ్న:
అనారోగ్యం కారణాలతో ఉద్యోగం చేయలేకపోతున్నాను.నా తమ్ముడు డిగ్రీ, బీ. ఈ. డి చదివాడు.నా ఉద్యోగం తమ్ముడుకి ఇప్పించవచ్చునా?

జవాబు:*
టీచర్ ఉద్యోగం వేరే వారికి నేరుగా బదిలీ చేసే అవకాశం లేదు.*
కానీ జీఓ.66 తేదీ:23.10.2008 ప్రకారం నిబంధనలకు లోబడి మీరు అనారోగ్యం కారణంగా శాశ్వతంగా విధులు నిర్వహించలేరని జిల్లా మెడికల్ బోర్డు దృవీకరించిన మిమ్మల్ని మెడికల్ ఇన్వాలిడేసన్ కింద రిటైర్మెంట్ చేసి మీ తమ్ముడు కి జూనియర్ అసిస్టెంట్ స్థాయి కి మించకుండా కారుణ్య నియామకం కోటాలో ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉంది.*


ప్రశ్న:
నేను,నా భార్య ఇద్దరం టీచర్లం.హెల్త్ కార్డుకి ప్రీమియం నా జీతం ద్వారా చెల్లించుచున్నాను.నా భార్య హెల్త్ కార్డులో వారి  తల్లిదండ్రులు పేర్లు చేర్చుకోవచ్చా?

జవాబు:*
చేర్చుకోవచ్చు. మహిళా టీచర్లు కూడా ఆధారిత తల్లిదండ్రులు పేర్లు హెల్త్ కార్డులో చేర్చుకోవచ్చు.*


ప్రశ్న:
EOL కాలాన్ని వాలoటరీ రిటైర్మెంట్ కి పరిగణనలోకి తీసుకుంటారా?

జవాబు:*
EOL కాలాన్ని అర్హత గల సెలవు గా లెక్కించరు.*
కానీ వ్యక్తిగత కారణాల తో EOL ఐతే 36 నెలల వరకు, అనారోగ్య కారణాలతో ఐతే ఎంతకాలం ఐనా EOL కాలాన్ని పెన్షన్ లెక్కింపు కి అర్హత సెలవుగానే పరిగణిస్తారు.*


ప్రశ్న:
నేను HM గా పనిచేస్తున్నాను.అనారోగ్య కారణాల చేత SA గా రివర్సన్ తీసుకోవాలని అనుకుంటున్నాను.పరిస్థితి ఏమిటి?

జవాబు:*
FR14 ప్రకారం HM పోస్టులో లీన్ స్థిరీకరణ జరిగే వరకు SA పోస్టులో మీ లీన్ కొనసాగుతుంది.కనుక మీరు రివర్శన్ తీసుకోవచ్చు.ఐతే పదోన్నతి ద్వారా వచ్చిన 2 ఇంక్రిమెంట్లు రద్దు అవుతాయి.SA క్యాడర్ లో తదుపరి AAS కి అర్హత ఉండదు.*


ప్రశ్న:
నాకు వినికిడి లోపం 70 శాతం ఉన్నట్లు మెడికల్ సర్టిఫికేట్ కలదు. కాని ఎలవెన్స్ పొందటానికి సరైన వివరములు లేవు. నేను అలవెన్స్ పొందటానికి అర్హుడునా..?

జవాబు:*
మీరు కన్వీయన్స్ ఎలవెన్స్ కు అర్హులు. సంబంధిత ఉత్తర్వులు DDO ఇస్తే సరిపోతుంది.GO MS:197, Dt:6-7-2006. సివిల్ సర్జన్ ర్యాంక్ తగ్గని తత్సంబంధిత వైద్యుడు ఈ ధృవపత్రం జారీ చేయాలి. ఈ సర్టిఫికేట్ జారీ చేసిన తేదీ నుండి వర్తించును. CL తప్పించి మరి ఏ సెలవులలోనూ ఈ ఎలవెన్స్ ఇవ్వబడదు. సస్పెన్సన్ కాలంలో కూడా ఇవ్వబడదు.*
GO MS No:262, Dt:25-8-1980. Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

కమ్యూటేషన్ COMMUTATION Leave in Telugu

కమ్యూటేషన్ COMMUTATION Leave in Telugu


ఉద్యోగికి లభించే పింఛను నుంచి 40% మించ కుండా ఒకేసారి నియమ నిబంధనల మేరకు ఏకమొత్తంగా అతను నగదుగా మార్చుకునే పద్దతినే "కమ్యూటేషన్" గా పరిగణిస్తారు.

ఈ పద్దతి 1-4-1999 నుండి అమలులోకి వచ్చింది.1-4-1999 తేదీన గాని,అటు తర్వాత గాని పదవీ విరమణ గాని,చనిపోయిన ఉద్యోగి విషయంలో గాని ఈ సూత్రం వర్తిస్తుంది.

(G.O.Ms.No.158 F&P తేది:1-4-1999)


 • శాఖాపరమైన న్యాయస్థానాలలో గనుక ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు అపరిష్కృతంగా ఉన్నట్లయితే కమ్యూటేషన్ మంజూరు చేయబడదు.
 • (Rule 3(3) of Commutation Rules 1994)

 • కమ్యూటేషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోనవసరంలేదు. ప్రభుత్వం 
 • G.O.M.No.263 తేది:23-11-1998 ద్వారా నిర్దేశించిన పింఛను ఫారంలోనే,పింఛనుతో పాటు కమ్యూటేషన్ ను కూడా తెలియజేయవచ్చు.
 • (G.O.Ms.No.356 F&P తేది:28-11-1989)

 • పెన్షన్ కమ్యూటేషన్ చేసిన తరువాత తగ్గిన పెన్షన్ 15సం॥ తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పింఛను వస్తుంది.ఈ విధంగా మరల పూర్తి పెన్షన్ పొందిన తర్వాత రెండవసారి కమ్యూట్ చేయు అవకాశం లేదు.
 • (G.O.Ms.No.44 F&P తేది:19-02-1991)

 • 15 సం॥ కాలపరిమితిని కమ్యూట్ చేసిన మొత్తం పొందిన తేది నుంచి గానీ లేక ఆ మొత్తం వసూలు చేసుకోమ్మని జారీచేసిన ఉత్తర్వులు 3 నెలల తర్వాత గానీ ఏది ముందైతే ఆ తేది నుండి లెక్కిస్తారు.
 • (G.O.Ms.No.324 F&P తేది:20-08-1977)

 • కమ్యూటేషన్ మొత్తం పొందిన తర్వాత ఏ కారణము చేతనైనా పెన్షన్ సవరించినయెడల,తత్ఫలితంగా పెన్షన్ ఎక్కువ అయిన సందర్భాలలో తదనుగుణంగా పెరిగినటువంటి కమ్యూటేషన్ మొత్తం కూడా చెల్లించవలసియుంటుoది.
 • (G.O.Ms.No.392 F&P తేది:02-12-1993)

 • కమ్యూటేషన్ మొత్తానికి,గ్రాట్యూటి మాదిరిగా గరిష్ట మొత్తంను నిర్దేశించలేదు.ఎంతమేరకు అర్హులో అంతవరకూ పొందవచ్చు.
Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

Sunday, 10 December 2017

2017 - 18 ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను గణన

2017 - 18 ఆర్థిక సంవత్సరం ఆదాయపు పన్ను గణన

ఆదాయపు పన్ను శ్లాబులు 2017-18 ఆర్థిక సంవత్సరానికి 2016-17 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న 10% శ్లాబ్ స్థానములో 5% శ్లాబ్ గా మార్చారు. మిగితా సెక్షన్ లను దాదాపుగా గత ఆర్ధిక సంవత్సరం వరకు ఉన్నవిధంగానే కొనసాగించారు. ఆదాయపు పన్ను చట్టం (1961) ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరం  గణన లో తేది 01.04.2017 నుండి 31.03.2018 వరకు పొందిన జీతభత్యాలు ఆధాయముగా పరిగణించాలి అదే విదంగా సేవింగ్స్ మరియు మినహాయింపులు పొందే సొమ్ము ఈ కాలంలో చెల్లించినవి అయి ఉండాలి
Category...... Slab......Tax
Age below 60 Years
Upto 2,50,000 .......... Nil
2,50,001-5,00,000 ..... 5% of amount by which the taxable income exceeds Rs. 2,50,000/-.
5,00,001-10,00,000 ...... Rs. 12,500/- + 20% of the amount by which the taxable income exceeds Rs. 5,00,000/-.
above 10,00,000 ........ Rs. 1,12,500/- + 30% of the amount by which the taxable income exceeds Rs. 10,00,000/-.

Age 60Yrs and above -  belowd 80Yrs  (Senior Citizens)*
Upto 3,00,000 ...... Nil
3,00,001-5,00,000 ...... 5% of amount byf which the taxable income exceeds Rs. 3,00,000/-.
5,00,001-10,00,000 ........ Rs. 10,000/- + 20% of the amount by which the taxable income exceeds Rs. 5,00,000/-.
above 10,00,000 ........ Rs. 110,000/- + 30% of the amount by which the taxable income exceeds Rs. 10,00,000/-.

Age 80Yrs and above (Super Senior Citizens)*
Upto 5,00,000 ...... Nil
5,00,001-10,00,000 ...... 20% of amount by which the taxable income exceeds Rs. 5,00,000/-.
above 10,00,000 ........ Rs. 100,000/- + 30% of the amount by which the taxable income exceeds Rs. 10,00,000/-

[Senior Citizen (Individual who is of the age of 60 years or more but below the age of 80 years at any time during the previous year i.e. born on or after 1st April 1938 but before 1st April 1958)].

[Super Seniorf Citizen(Individual who is of the age of 80 years or more at any time during the previous year i.e. born on or before 1st April 1938 )]

Section 87A ప్రకారం పన్ను చెల్లించాల్సిన ఆదాయము 3.5లక్షల లోపు ఉన్నవారికి చెల్లించాల్సిన టాక్స్ లో రిబేట్ సదుపాయాన్ని రూ. 2,500/- కు తగ్గించారు.
 చెల్లించాల్సిన ఆదాయపు పన్ను పైన 3% (2+1) ఎడ్యుకేషన్ సెస్ అదనంగా చెల్లించాలి.

ఆదాయముగా పరిగనించబడే జీతబత్యములు:
Pay, DA, HRA, IR, CCA, అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు, అదనపు ఇంక్రిమెంట్ అలవెన్స్, సరెండర్ లీవు జీతం, పి.అర్.సి బకాయిలు, స్టెప్ అప్ ఎరియర్స్, సెలవు కాలపు జీతం, మొ. నవి ఆదాయంగా పరిగనించబడును.

ఆదాయముగా పరిగనించబడని అంశములు :
పదవి విరమణ తరువాత పొందే GPF/GIS/AP(TS)GLI లనుండి పొందే సొమ్ము మరియు నగదుగా  మార్చుకున్న సంపాదిత సెలవులు, అర్దజీతపు సెలవుల పై వచ్చిన సొమ్ము, LTC పై పొందిన ప్రయాణd భత్యం, మెడికల్ రియంబర్స్మేంట్ మరియు  GPF, AP(TS)GLI లలో అప్పుగా పొందిన సొమ్ము ఆదాయంగా పరిగణించరాదు.

HRA మినహాయింపు :
Under Section 10(13A) ప్రకారం క్రింది మూడు అంశంలలో ఏది తక్కువయితే ఆf మొత్తము ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చును.
పొందిన ఇంటి అద్దె బత్యం మొత్తం
ఇంటి అద్దెగా చెల్లించిన మొత్తం - 10% మూలవేతనం + డి.ఎ
40% వేతనం
ఇంటి అద్దె అలవెన్స్ (HRA) నెలకు 3,000/-  (సంవత్సరానికి సరాసరి 36,000/-) కన్నఎక్కువ పొందుతున్నవారు మొత్తం HRA మినహాయింపు పొందాలంటే రశీదు DDO కు సమర్పించాలి. చెల్లిస్తున్నఇంటి అద్దె 1లక్ష దాటిన పక్షంలో ఇంటి యజమాని PAN నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వంత ఇంట్లో నివాసం ఉంటున్న వారికి HRA మినహాయింపు వర్తించదు.

మినహాయింపులు :
1) ఇంటి ఋణం పై వడ్డి (Section24): ఇంటి ఋణం తో నిర్మించి స్వంతం గా ఉంటున్న వారికి ఋణం పై చెల్లిస్తున్న వడ్డి పై 2లక్షల వరకు మినహాయింపు కలదు. ఒక వేళ  ఇల్లు బార్య మరియు భర్త ఇద్దరు జాయింటుగా ఋణం పొంది ఉంటె ఇద్దరికీ సమానం గా విభజించి ఒక్కొక్కరు గరిష్టంగా 2లక్షల మినహాయింపు పొందవచ్చు. ఇంటి ఋణం తీసుకున్న ఇంట్లో స్వయంగా నివసించకుండా కిరాయకు ఇచ్చినట్టయితే ఇంటి ఋణం పై వడ్డి పూర్తిగా మినహాయింపు కలదు, కాని వచ్చే కిరాయిని ఆదాయంగా చూపాలి.
2) u/s 24 and 80 EE There is an Exemption for interest on housing loan.(for Self occupied Residence). If the loan was taken before Apr 1, 1999 exemption is limited to ₹30,000/- per year. If the loan was taken after Apr 1, 1999 exemption is limited to ₹2,00,000/- per year if the house is self-occupied; There is no limit if the house is rented out.
This exemption is available on accrual basis, which means if interest has accrued, you can claim exemption, irrespective of whether you've paid it or not.. 80EE In finance bill 2016 (an additional rebate of ₹.50.000/- was given to those assesse, who purchase self ocupied single house after 01/04/2016 with maximum value of ₹ 60 Lacs and sanctioned home loan up to 35 Lacs.)
3) ఉన్నత  చదువుల కోసం విద్యాఋణం పై వడ్డి (80E) : Self, Spouse, Children ఉన్నత  చదువుల కోసం విద్యాఋణం పై 2017-18  ఆర్ధికc సంవత్సరం లో చెల్లించిన వడ్డి మినహాయింపు కలదు. ఈ మినహాయింపు గరిష్టం గా 8సం. లు వర్తిస్తుంది.
4) ఆధారపడిన   వారు వికలాంగులయితే (80DD) :  ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిపై ఆడరపడిన వాళ్ళలో వికలాంగులుంటె సెక్షన్ 80DD క్రింద మినహాయింపు కలదు. 80% కన్నా తక్కువగా వైకల్యం ఉంటె 75,000/- , 80% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. ఇందుకోసం సంబందిత అధికారులు జారిచేసిన సర్టిఫికేట్ పొంది ఉండాలి.
5) ఆదాయపు పన్ను చెల్లించె వ్యక్తీ వికలాంగులయితే (80U) : ఉద్యోగి స్వయంగా వికలాంగులైన పక్షంలో 80% కంటే తక్కువ వైకల్యం ఉంటె 75,000/-, 80% లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. వైకల్య ద్రువీకరణ పత్రం సమర్పించాలి.
6) అనారోగ్యానికి చికిత్సకు అయిన ఖర్చు (80DDB) :  ఉద్యోగి కాని తనమీద ఆడరపడిన వారు Cancer, Hemophilia, Talassemia, Neurological diseases మరియు Chronic renal Failure వంటివాటితో అనారోగ్యానికి గురయి చికిత్స కోసం చెల్లించిన సొమ్ములో 60 సంవత్సరాల లోపు వారికి 40,000/-, 60 సంవత్సరాలు లేదా పైబడిన వారికి 60,000/- ,80 లేదా 80సంవత్సరాలు పైబడిన వారికి 80,000/- మినహాయింపు కలదు. దీనికోసం ఫారం 10-I లో సంభందిత  స్పెషలిస్ట్ డాక్టర్ చే ఖర్చుల వివరాలు సమర్పించాలి. కాని ఈ సెక్షన్ కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు.
7)  చందాలు (80G) :  PM, CM రిలీఫ్ ఫండ్ వంటి 100% మినహాయింపు గలవాటికి ఇచ్చే చందాలు మినహా ,  80G క్రిందకు వచ్చే 50%/30% మినహాయింపులోకి వచ్చే ఏ ఇతర చందాలు DDO లు అనుమతించరాదు.

Note : సెక్షన్ 80DDB మరియు 80G కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు. కాని ముందుగా February జీతం తో టాక్స్ చెల్లించి, అధికముగా చేల్లించిన మొత్తాన్ని31 జూలై 2018 లోపు Income Tax Department వారికి SAHAJ ఫారంలో సమర్పించిన  తిరిగి చెల్లిస్తారని ఐ.టి. డిపార్ట్మెంట్ వారు గతంలో DTA/DTO లకు సర్క్యులర్ రూపంలో ఆదేశాలు ఇచ్చినారు (vide E.No TDS/clarification/1011 Dt. 15/12/2011 of Addl. Commissioner IT Dept. Hyderabad)  తిరిగి పొందవచ్చు.
*మెడికల్ ఇన్సురెన్స్ (80D) :*  ఉద్యోగి తన కుటుంబం కోసం మరియు పేరెంట్స్ కోసం చెల్లించిన మెడికల్ ఇన్సూరెన్స్ వేరు వేరుగా మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి తన కుటుంబం కోసం చెల్లించిన సోమ్ముకాని గరిష్టంగా 25,000/- లు, ఉద్యోగి పేరెంట్స్ కి మెడికల్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించిన ప్రీమియం కాని గరిష్టంగా 25,000/- పేరెంట్స్ లో ఒక్కరు సీనియర్ సిటిజెన్ అయినా ప్రీమియం కాని గరిష్టంగా 30,000/- మినహాయింపు పొందవచ్చు.
       ఉద్యోగి  సిటిజెన్ పేరెంట్స్ కోసం మాస్టర్ హెల్త్ చెకప్ కోసం సొమ్ము ఉపయోగిస్తే ఈ సెక్షన్ కింద గరిష్టం గా 5,000/- మినహాయింపు కలదు.
కన్వేయన్స్ అలవెన్స్ కి  మినహాయింపు కలదు. వృత్తి పన్నుకు పూర్తిగా మినహాయింపు కలదు.

పొదుపు పథకాల పై మదుపు రూ. 1.5 లక్ష :
1) *వివిధ పొదుపు పతకాలలో సేవింగ్స్ (80C) :*  GPF, ZPGPF, APGLI, GIS, LIC, PLI, National Saving Certificates, Public Provident Fund, Sukanya Samruddhi Yojana, ELSS, ULIPS మొదలయిన పతకాలలో చేసిన సేవింగ్స్, తన, స్పౌస్ ఉన్నత చదువుకోసం, ఇద్దరు పిల్లల వరకు ప్రీ స్కూల్ నుండి ఉన్నత చదువుల వరకు చెల్లించిన ఫీజు, ఇంటి ఋణం పై చెల్లించిన అసలు (Principle), ఇంటిని ఈ ఆర్ధిక సంవత్సరం లో కొన్నవారికి రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన స్టాంప్ డ్యూటీ  రూ. 1.5 లక్ష వరకు మినహాయింపు కలదు.
2) *Annuity సేవింగ్స్ పథకం లో సేవింగ్ (80 CCC) :*  LIC లేదా ఇతర ఇన్సూరెన్స్ ప్రొవైడర్ ల ద్వారా తీసుకున్న ఆన్యుటి స్కీంల కోసం చేల్లించిన ప్రీమియం.
3) *CPS deduction (80CCD):* కొత్త పెన్షన్ పై నియామకం అయిన ఉద్యోగులు ప్రతినెల తమ జీతం నుండి 10% చెల్లిస్తున్న CPS deduction 80CCD(1) ప్రకారం మినహాయింపు కలదు. ప్రభుత్వం ఉద్యోగి ప్రాన్ ఖాతా లో జమ చేస్తున్న 10% CPS మ్యాచింగ్ గ్రాంట్ ని 80CCD(2) ప్రకారం  జమయిన మొత్తాన్ని పొదుపు రూ. 1.5 లక్షలకు అదనం గా మినహాయింపు కలదు. FY 2015-16 AY 2016-17 లో కొత్తగా 80CCD(1B) సెక్షన్ చేర్చడం జరిగింది దీనిద్వారా కొత్త పెన్షన్ పథకంలో ఉద్యోగి పెట్టిన సొమ్ముపైన 50,000/- వరకు అదనపు మినహాయింపు అవకాశం కల్పించారు ఈ సదుపాయం ఏప్రిల్ 2016 నుండి అందుబాటులోకి వచ్చింది. ఈ సెక్షన్ పైన పలువురు పలు సందేహాలు వ్యక్తపరచగా మన రాష్ట్ర శాఖ వారు  2 సందర్భాల గురించి ఆదాయపన్ను శాఖ వారి నుండి క్లారిఫికేషన్ కోరగా ఆదాయపన్ను శాఖ వారు F.No. Pr. CCIT/Tech/67/2015-16 తేదీ 12.02.2016 సమాధానం ఇచ్చినారు అవి 1. ఒక ఉద్యోగికి 80సి కింద CPS నిది కాకుండా 1.50 లక్షల పొదుపు నిధి ఉన్నప్పుడు CPS కింద ఉద్యోగి జమచేసిన నిధిని 80CCD(1B) కింద చూపొచ్చా? 2. ఒక ఉద్యోగి 80C కింద పొదుపు CPS (NPS)  నిది కాకుండా 1.50లక్షల కంటే తక్కువగా ఉండి CPS (NPS) కింద ఉద్యోగి 50 వేల కంటే ఎక్కువ కొత్త పెన్షన్ కోసం జమచేస్తే ఇట్టి మొత్తాన్ని 80CCD(1B) కింద గరిష్టంగా 50 వేలు పోగా మిగిలిన నిధిని 80C కి విడగొట్టొచ్చా? పై రెండు ప్రశ్నలకు అవును అని సమాధానం ఇచ్చారు.
4) 80C, 80CCC, 80CCD ల పొదుపు ల పైన మొత్తముగా 1.5 లక్షలు ఉంటుంది.
అదనపు మినహాయింపు పొదుపు పథకం RGESS (80CCG) :*  Rajiv Gandhi Equity Saving Scheme దీనిని అదనంగా పన్ను మినహాయింపు పొందడానికి రూపొందించారు దీని  ద్వారా 1.5 లక్షలకి అదనముగా మినాయింపు ఇస్తుంది. వార్షిక ఆదాయము 10 లక్షలలోపు ఉన్నవారు గరిష్టంగా 50,000/- వరకు పొదుపు చెయవచ్చు. పొదుపు చేసిన సొమ్ములో సగం (50%) ను మినహాయిస్తారు అంటె గరిష్ట మినహాయింపు 25,000/- వరకు పొందొచ్చు.
*సేవింగ్స్ ఖాతా పైన పొందిన వడ్డీ మినహాయింపు (80TTA) :*   సేవింగ్స్ ఖాతా లో జమయిన వడ్డీ ని ఆదాయం గా చూపిన దాంట్లో నుండి వడ్డీని గరిష్టం గా 10,000/- వరకు 80TTA ప్రకారం రూ. 1.5 లక్ష సేవింగ్స్ పై అదనముగా 10,000/- వరకు మినహాయింపు అవకాశం ఉంది. 
 Note : DDO లు ఫిబ్రవరి మాసం జీతం బిల్ పొందే సమయములో Form-16 లు సమర్పిస్తు డిడక్ట్ చేసిన ఇన్కమ్ టాక్స్ TAN నెంబర్ తో జమ అవుతుంది, దీనికి సంబందించిన బిన్ నంబర్స్ STO/ Online లో TAN నెంబర్ ద్వారా తీసుకుని ఉద్యోగి వారిగా CA తో ఇ-పిల్లింగ్ ద్వారా TDS వివరాలు వివరాలు 31 జూలై,2018 లోపు ఆన్లైన్ చేయించాలి, ఇలా చేయని వారికి Income Tax Department వారు ఫైన్ వేసే అవకాశం ఉంది.

ఆదాయపు పన్నుకు సంబందించి ఏయే ఫారములు సమర్పించాలి?
   జనవరి,  ఫిబ్రవరి మాసములలో కాలికులేషన్ షీట్ తో  సహా Form-16 పూర్తిచేసి DDOలకు ఇవ్వాలి. ప్రతి ఉద్యోగి ఆదాయపు పన్ను పరిదిలోకి రాకపోయినా "PAN" కార్డ్ విదిగా పొందాలి. దీనికొరకు దగ్గరలోని CA ని సంప్రదించండి. నికర ఆదాయము రూ. 5లక్షల కంటె ఎక్కువ  ఉన్నవారు, బ్యాంక్, పొస్టాఫీసులలో 10,000/- ల కంటే ఎక్కువ ఆదాయము కల ఉద్యోగులు మరియు ఒక ఎంప్లాయర్ కంటే ఎక్కువ ఎంప్లాయర్స్ వద్ద జీతం పొందువారు "SAHAJ" ఫారములలో రిటర్న్ లను 31జూలై , 2017 లోపు Income Tax Department వారికి సమర్పించాలి.

ఆదాయపు పన్నును ఎట్లా చెల్లించవచ్చు?  
     ఆదాయపు పన్నును శ్లాబులకనుగుణముగా తాత్కాలికంగా మదింపు చేసుకున్నాచో సుమారుగా చెల్లించవలసిన ఆదాయపు పన్ను తెలియును. ఈ మొత్తమును ప్రతినెలలో కొంత చొప్పున ఉద్యోగి ప్రణాళిక బద్దంగా ఆన్లైన్ జీతాల బిల్లులో మినహాయించుకోన్నచో  పిబ్రవరి మాసంలలో అధిక భారము పడకుండా ఉండును. ప్రతినెల DDO నుండి ఐ.టి.   మినహాయించి షెడ్యుల్ ను (టోకెన్ నం. తేది తో సహా) తీసుకుని భద్రపరచుకోవాలి.  పిబ్రవరి  నెలలో ఆదాయపు పన్ను Form-16 ప్రకారము మదింపు చేసుకుని అధికముగా చెల్లించవలసినది ఏమైనా ఉంటె పిబ్రవరి 2018 నెలలో మినహాయించుకోవచ్చు. షెడ్యుల్ లో PAN తప్పనిసరిగా పొందుపరచాలి. Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

Useful for TEACHERS