Labels

Friday 30 June 2017

ఉపాధ్యాయుల పని తీరును మదింపు

భారత ప్రభుత్వం, మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాలలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల ఎయిడెడ్ పాఠశాలలోని ఉపాధ్యాయుల పని తీరును మదింపు చేయడానికి,


*ఉపాధ్యాయుడు స్వయంగా  మదింపు చేసుకోవడానికి వీలుగా RTE చట్టం -2009, సెక్షన్  24-29, NCF-2005,*

*ఎస్.ఎస్.ఎ ఫ్రేమ్ వర్క్- 2001 సూచనల మేరకు PINDICS ను రూపొందించింది.*

*సంవత్సరానికి 4 క్వార్టర్లు మదింపు చేయాలి.*

1.క్వార్టర్ : జూన్-ఆగష్టు ,

2. క్వార్టర్: సెప్టెంబర్- నవంబర్,

3. క్వార్టర్: డిసెంబర్ – ఫిబ్రవరి ,

 4. క్వార్టర్: మార్చి- మే

 మదింపు చేసుకుని 2,4 క్వార్టర్ నివేదికలను సంబంధిత అధికారికి సబ్మిట్ చేయాలి.

 ఉపాధ్యాయుల పని తీరును మదింపు వేయడం రెండు రకాలుగా జరుగుతుంది.

 ఉపాధ్యాయుడు తనంతట తను తన పనితీరును రెండవ క్వార్టర్ చివరిలో ఒకసారి 4 వ క్వార్టర్ చివరిలో రెండవ సారి మదింపు చేసుకోవడం జరుగుతుంది.
ఇది అంతర్గత మదింపు.

 ఉపాధ్యాయుల పని తీరును పర్యవేక్షించి, ఉపాధ్యాయుని  ఆధారంగా ప్రధానోపాధ్యాయుడు లేదా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు మదింపు చేయడం జరుగుతుంది.
ఇది కూడా రెండవ,
మూడవ క్వార్టర్ల చివర్లో జరుగుతుంది.
ఇది బాహ్య మదింపు.

Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment