Labels

Thursday 9 August 2018

NON Drawal Certificate LPC for Teachers

NON Drawal Certificate LPC for Teachers 

Click to Download the format of NON drawl certificate for teachers and LPC Last pay certificate 

NON DRAWL CERTIFICATE FOR TEACHERS

NON DRAWL CERTIFICATE LPC

LAST PAY CERTIFICATE
 

https://drive.google.com/open?id=1Mp2u9wJ7pD9EDIi5ucRYO88bwzMHiHEm 

Tuesday 7 August 2018

ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది?

ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది?

ఏయే బెనిఫిట్స్ వర్తిస్తాయి?

జవాబు- 20 సంవత్సరాల సర్వీసు నిండిన ఉద్యోగి యొక్క కోరిక ప్రకారం రిటైర్ అగుటకు అనుమతించబడును.
( G.O (P) No. 88, Finance and Planning (Finance Wing) P.N.C. Dept, Date: 26-01-1980* ) రూల్ : 42,43

పెన్షన్ కమ్యూటేషన్:
                  
వాలెంటరీ రిటైర్మెంటు పొందిన ఉపాధ్యాయుడు తన పెన్షన్ లో 40% అమ్ముకోవచ్చును.* దీనినే *పెన్షన్ కమ్యూటేషన్* అంటారు.
( G.O.m.s.No: 158, Finance and Planning ; Date: 16-09-1999)
గమనిక:- రిటైరైన సంవత్సరంలోగా సంబంధిత అధికారిగారికి దరఖాస్తు చేసుకోవాలి. సంవత్సరం దాటితే మెడికల్ టెస్టులు, అనేక వివరాలతో జాప్యం జరుగుతుంది


పెన్షన్

పదవీ విరమణ చేయునాటికి 10 సంవత్సరములు అంతకంటే ఎక్కువ సర్వీసు చేసిన వారికి పెన్షన్ ఇస్తారు.
పెన్షన్ లెక్కించు విధానము:-
*చివరి నెల వేతనం× అర్థ సం„యూనిట్లు × 1/2 × 1/66 సూత్రం ప్రకారం లెక్కిస్తారు
20 సంవత్సరాలకు వాలెంటరీ రిటైర్మెంటు కోరితే 5సంవత్సరాల వెయిటేజిని కలిపి సర్వీస్ కాలమునకు కలిపి పెన్షన్ నిర్ణయిస్తారు.

 కుటుంబ పెన్షన్ వివరాలు

రిటైర్మెంట్ గ్రాట్యుటీ

మినిమం క్వాలిఫైయింగ్ సర్వీస్:
5 ఇయర్స్ ఫైనాన్షియల్ బెనిఫిట్: క్వాలిఫైయింగ్ సర్వీస్ పొడవు ఆధారంగా. సుమారు మొత్తం Rs.12.00 లక్షల .

డెత్ గ్రాట్యుటీ

0-1 సంవత్సరాలు సేవ: 6 టైమ్స్/ 4 (చెల్లింపు రోజు)
1-5 సంవత్సరాల సేవ: 18 సార్లు / 4 (పే,డీఏ )
5-18 సంవత్సరాల సర్వీస్: 36 సార్లు 4 (పే-డే) > 18 సంవత్సరాల సేవ: 38
/4 (చెల్లించాల్సిన రోజు)
మాక్సిమం మొత్తం: Rs.12.00 లక్షల. కుటుంబ పింఛను ఉద్యోగి / పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులకు ఇవ్వబడుతుంది.

పెన్షన్ రకాలు

1. పెంపొందించిన కుటుంబ పెన్షన్ :-

 మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:
ఏడు సంవత్సరాలు కంటే ఎక్కువ ఏడు సంవత్సరాల కాలానికి 50% చివరి చెల్లింపు మరియు ఏడు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలుగా చెల్లింపులు.

2.  కుటుంబ పెన్షన్ : -

 మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:

 ఒక సంవత్సరం నుండి 7 సంవత్సరాల. పెంచిన కుటుంబ పెన్షన్ ముగిసిన తరువాత, కుటుంబ పింఛను ఇవ్వబడుతుంది. మొత్తం చెల్లింపు మరియు అనుమతుల యొక్క 30%

3.  అదనపు సాధారణ కుటుంబ పెన్షన్:-

 అతని / ఆమె విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అతని పింఛను ఇవ్వబడుతుంది,

        *FAMILY PENSION*

 సర్వీస్ లో ఉండి గానీ, రిటైర్ ఐన తరువాత గానీ ఉద్యోగి మరణించిన ,అతని భార్య కు ఇచ్చే పెన్షన్ ను ఫ్యామిలీ పెన్షన్ అంటారు .

 7ఇయర్స్ సర్వీస్ లోపు చనిపోతే, భార్యకు పే లో 30% ఫ్యామిలీ పెన్షన్ గా ఇస్తారు.

 7ఇయర్స్ సర్వీస్ పైన చేసి రిటైర్మెంట్ లోపు చనిపోతే రెండు రకాలుగా భార్యకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు.

a) మొదటి 7 ఇయర్స్ కి 50%

b) 7 ఇయర్స్ తరువాత నుండి 30%.

EXample 1:

ఓక ఉద్యోగి సర్వీస్ లో ఉండగా మరణించెను.అప్పటికి అయన సర్వీస్ 3y 6m. అపుడు ఆతని పే 7740 ఐన, భార్య కు వచ్చే ఫ్యామిలీ పెన్షన్
 ➡ 7740×30/100 =2322.00
ఇది భార్య కు జీవితాంతం ఇస్తారు.

 Example2:

 ఉద్యోగి మరణించే నాటికి చేసిన సర్వీస్ 8y 4m. అపుడు పే 11530.ఐన, అతని భార్య కు మొదటి 7ఇయర్స్ వచ్చే ఫ్యామిలీ పెన్షన్
 11530×50/100=5765.00.

 7 ఇయర్స్ తరువాత నుండి జీవితాంతం వచ్చే ఫ్యామిలీ పెన్షన్👉11530×30/100 = 3459.00

CPS ఖాతాదారుడు తన ఖాతా నుండి డబ్బు ను తిరిగి పొందు విధానం (ఉపసంహరణ విధానం)

రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.ఎస్.నెం-62 . తేది=07/03/2014 ఉత్తర్వుల ద్వారా ఖాతా దారుడు
1.స్వచ్ఛంద పదవి విరమణ.
2.పదవీ విరమణ
3.ఆకాలమరణం

ఈ మూడు సందర్భాలలో CPS ఖాతా నుండి డబ్బును తిరిగిపొందగలరు.

1. స్వచ్ఛంద పదవీవిరమణ ::---
ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తము నుండి 80 % ను నెలవారి పెన్షన్గా ఇవ్వడానికి A.S.Pలో ఎంచుకున్న రకానికి చెందిన పెన్షన్ అందజేస్తారు. 20%నిధి ని చెల్లిస్తారు.

సూచన :--మొత్తం నిధి 1 లక్ష లోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.

దీనికోసం FORM 102-GP ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను.

2. సాధారణ పదవీ విరమణ ::--
ఉద్యోగి పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తములో నుండి 40%ను నేలవారి పెన్షన్ గా ఇవ్వడానికి  A.S.P లో ఎంచుకున్న రకానికి పెన్షన్ అందజేస్తారు.60% నిధిని చెల్లిస్తారు.

సూచన :-
  మొత్తం నిధి  2లక్ష లలోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.
దీనికోసం FORM 101-GS ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను.

3. ఆకాలమరణం పొందిన సందర్భంలో ::-
ఉద్యోగి ఖాతాలో ఉన్న మొత్తం(100%) నిధిని నామినీ కి చెల్లిస్తారు.

దీనికోసం FORM 103-GD ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను.