Labels

Sunday 4 February 2018

treasury.telangana.gov.in

1) మీ 12 నెలల జీతము వివరాలు
విత్ డిడక్శన్ష్, Treasury token no కోసం ....
Click the below direct link
jn

https://treasury.telangana.gov.in/ddoreq/index.php?service=lpccreationtot

------------------------------------
PRTU TS MBNR RURAL
2) మీ CPS ఖాతా లో ఉన్న ఫండ్ తెలుసుకోవడానికి
Click the below direct link....
https://www.cra-nsdl.com/CRA/
------------------------------------
3) మీ PF ఖాతా లో ఉన్న అమౌంట్ చూసు కోవడానికి,PF స్లిప్స్ డౌన్లోడ్ చేసు కోవడానికి
Note: PF ఎకౌంటు చూడటానికి పాస్ వర్డ్ అడుగుతుంది.. పాస్వర్డ్  emp@ మీ pf number
మీ pf నెంబర్ 123789
ఐతే పాస్ వర్డ్ emp@123789
Click the below direct link....
http://zpgpf.telangana.nic.in/
------------------------------------
4) మీ TSGLI వివరాలు
బాండ్ డౌన్లోడ్ చేసు కోవడానికి..
Click the below direct link...
http://www.tsgli.telangana.gov.in/Apgli_bond.aspx 
–---------------------------------
5) మీ TSGLI వివరాలు:::TSGLI policy details డౌన్లోడ్ చేసు కోవడానికి.. Click the below direct link...

http://www.tsgli.telangana.gov.in/PolicyDetails.aspx ------------------------------------
6)  TSGLI వివరాలు :::.TSGLI annual account slip డౌన్లోడ్ చేసుకొనుటకు
Click the below direct link.
http://www.tsgli.telangana.gov.in/AnnualReport.aspx@BJMG/KNG/KGY

 



Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

సందేహాలు -- సమాధానాలు

సందేహాలు -- సమాధానాలు


  • ప్రశ్న: నేను అనారోగ్యంతో ఏప్రిల్ 1 నుండి సెలవులో ఉన్నాను.సమ్మర్ హాలిడేస్ లో విధులలో చేరవచ్చా?
  • జవాబు: వేసవి సెలవుల్లో చేరటానికి అవకాశం లేదు. స్కూళ్ళు రీ--ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే విధులలో చేరాలి.


ప్రశ్న: నేను స్కూల్ అసిస్టెంట్ హిందీ గా పనిచేస్తున్నాను.ఇంటర్,డిగ్రీ,హిందీ పోస్టుకి కావాల్సిన అర్హతలు ఉన్నాయి. ఐనా నాకు 12 ఇయర్స్ ఇంక్రిమెంట్ ఇవ్వలేదు.HM పదోన్నతి కూడా ఇవ్వటం లేదు.ఎందుకని??

జవాబు: మీకు బీ.ఎడ్ లేనందున ఇవ్వలేదు.

  • ప్రశ్న: ఒకే విద్యా సంవత్సరం లో రెండు కోర్సులు చేయవచ్చా?
  • జవాబు: ఒకే విద్యా సంవత్సరం లో ఒక రెగ్యులర్ కోర్సు,ఒక దూర విద్యా కోర్సు చేయటానికి అనుమతి ఇవ్వండి,అంతేగానీ రెండు రెగ్యులర్ కోర్సులు చేయడానికి అనుమతి ఇవ్వవద్దని యూజీసి 28.12.12 న అన్ని యూనివర్సిటీ లకి లేఖ రాసింది.

ప్రశ్న: నేను 25 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను.ఇక వాలంటీర్ రిటైర్మెంట్ అవుదామని అనుకొనుచున్నాను.నాకు పెన్షన్ ఎంత వస్తుంది??

జవాబు: చివరి ములవేతనం లో 45.45% పెన్షన్ గా రావటానికి అవకాశం ఉంది.

  • ప్రశ్న: ఒక టీచర్ వేసవి సెలవుల్లో 35 రోజులు వివిధ రకాల ప్రభుత్వ పరీక్షలకి హాజరు అయ్యాడు.అతనికి ఎన్ని ELs జమచేయబడతాయి?
  • జవాబు: వినియోగించుకున్న వేసవి సెలవులు 14 రోజులే కనుక 24 రోజుల ELs జమ చేయబడతాయి.


ప్రశ్న: మా స్కూల్లో నలుగురు SGT లు ఒకే DSC లో ,ఒకే రోజు స్కూల్లో జాయిన్ అయ్యారు.ఎవరు మాలో సీనియర్ అవుతారు??

జవాబు: సీనియారిటీ DSC సెలక్షన్ లిస్ట్ ఆధారంగా నిర్ణయించబడుతుంది.

  • ప్రశ్న: FAC HM గ్రీన్ ఇంక్ వాడవచ్చా?
  • జవాబు: FR.49 ప్రకారం FAC భాద్యతలు నిర్వహిస్తున్న వారికి పోస్టుకి గల అన్ని అధికారాలు ఉంటాయి. కాబట్టి గ్రీన్ ఇంక్ వాడవచ్చు.


ప్రశ్న: నేను హైస్కూల్ లో రికార్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.నాకు మహిళా టీచర్ల కి ఇచ్చే 5 స్పెషల్ CL లు ఇవ్వడం లేదు. ఎందువల్ల??

జవాబు: జీఓ.374 తేదీ:16.3.96 ప్రకారం 5 స్పెషల్ CL లు కేవలం మహిళా టీచర్ల కి మాత్రమే వర్తిస్తాయి.*


  • ప్రశ్న: నేను,మరొక టీచర్ ఇద్దరం ఒకే రోజు SA లుగా పదోన్నతి పొందాము.ఒకే రోజు జాయిన్ అయ్యాము.SA క్యాడర్ లో ఎవరు సీనియర్ అవుతారు?
  • జవాబు: SGT క్యాడర్ లో ఎవరు సీనియర్ ఐతే,వారే SA క్యాడర్ లో కూడా సీనియర్ అవుతారు.

1. Voluntary Retirement (VR)  తీసుకోదలిస్తే ఎన్నినెలల ముందు దరఖాస్తు పెట్టుకోవాలి? దరఖాస్తు ఎవరికి చేయాలి? ఏయే పత్రాలు జతపర్చాలి?

Ans: VR తీసుకోదలిస్తే 3 నెలల ముందు నియామకపు అధికారికి నోటీసు (దరఖాస్తు) ఇవ్వాలి. మూడు నెలల లోపు ఇచ్చే నోటీసులను సైతం నియామకపు అధికారి అనుమతించవచ్చు. ఉపాధ్యాయుల విషయంలో మండల పరిధిలోని టీచర్లు MEO ద్వారా, హైస్కూల్ టీచర్లు HM ద్వారా DEO కు ఏ తేదీ నుంచి VR అమల్లోకి రావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా తెల్పుతూ నోటీసు ఇవ్వాలి. స్పెసిఫిక్ గా జత చేయాల్సిన పత్రాలేవీ లేవు.

  • 2. VR  ఏయే కారణాలపై తీసుకోవచ్చు?
  • Ans: వ్యక్తిగత, అనారోగ్యం తదితర కారణాలను చూపవచ్చు.

3. ఒక టీచరుకు అక్టోబర్ 2018 నాటికి 20 ఏళ్ళ సర్వీస్ పూర్తవుతుంది. అక్టోబర్ తర్వాత VR తీసుకుంటే పూర్తి పెన్షన్ వస్తుందా?

Ans: 20 ఏళ్ళ నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ పూర్తి చేస్తే VR కి ఎలిజిబిలిటీ వస్తుందికానీ, పూర్తి పెన్షన్ రాదు.

  • 4. ఇరవై ఏళ్ళ సర్వీస్ పూర్తి చేశాక VR తీసుకోదలిస్తే... వెయిటేజీ ఎన్ని సంవత్సరాలు Add చేస్తారు?
  • Ans: క్వాలిఫయింగ్ సర్వీస్ కు.... సూపరాన్యుయేషన్ (58/60 ఏళ్ళు) కి గల తేడాను వెయిటేజీగా Add చేస్తారు. అయితే... దీని గరిష్ట పరిమితి ఐదేళ్లు.
5. Loss of Pay, Long Leave (medical grounds) లో ఉండి VR కి దరఖాస్తు చేయవచ్చా?

Ans: Yes.
6. Medical Leave లో ఉండి,  స్కూల్లో జాయిన్ అయ్యాకే VR కి అప్లై చేయాలా? సెలవులో ఉండి VR తీసుకోవడం ప్రయోజనమా?

Ans: సెలవులో ఉండి  VR తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకోరాదు. స్కూల్లో జూయిన్ అయి VR తీసుకుంటే కమ్యూటేడ్ లీవ్ పెట్టుకొని సెలవు కాలానికి పూర్తి వేతనం పొందే అవకాశం ఉంటుంది.

  • 7. అక్టోబర్ 2018 నుంచి VR తీసుకుంటే కొత్త PRC వర్తిస్తుందా?
  • Ans: 11 వ PRC.... ఫస్ట్ జులై, 2018 నుంచి అమల్లోకి రావాల్సి వుంది. వస్తుందనే నమ్మకమూ నాకుంది. అయితే... నోషనలా? మానిటరీ బెనిఫిట్ ఉంటుందా? అనే విషయాన్ని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం!

8. VR తీసుకున్న తర్వాత GI కంటిన్యూ చేయవచ్చా? GI అమౌంట్ ఎంత వస్తుంది?
Ans: VR తవ్వాత గ్రూప్ ఇన్సూరెన్సు కంటిన్యూ అయ్యే అవకాశంలేదు. ప్రభుత్వం ఏటేటా విడుదల చేసే టేబుల్ ప్రకారం అమౌంట్ వస్తుంది.

  • 9. చివరగా ఒక ప్రశ్న. 20 ఏళ్ళ నుంచి 28 ఏళ్ళ సర్వీస్ మధ్య VR తీసుకుంటే పెన్షన్ ఎంతెంత వస్తుంది?
  • Ans: వెయిటేజీతో కలుపుకొని 33 ఏళ్ళ సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులు రిటైర్ అయితే.... చివరి Basic Pay లో 50 % పెన్షన్ గా నిర్ధారించబడుతుంది. అలా కాకుండా VR తీసుకుంటే....
నెట్ క్వాలిఫయింగ్ సర్వీస్ > పెన్షన్
20>37.87% (చివరి మూలవేతనంలో)
21>39.4%
22>40.9%
23>42.4%
24>43.93%
25>45.45%
26>46.97%
27>48.48%
28>50%
(ఈ టేబుల్ 58 ఏళ్ళ వయస్సు నిండి ఉద్యోగ విరమణ చేసే వారికీ వర్తిస్తుంది.

సందేహాలు  --    సమాధానాలు


ప్రశ్న:
భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగులు.ఒకరు రిటైర్మెంట్ అయ్యారు.పెన్షన్ వస్తుంది. రెండవ వారు మరణించిన వారి వారసులకి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇస్తారా??

జవాబు:
మెమో.3548 ;GAD; తేదీ:24.3.12 ప్రకారం ఒకరికి పెన్షన్ వచ్చుచున్నందున కారుణ్య నియామకం వర్తించదు.

  • ప్రశ్న:-ఒక ఉద్యోగిని ఎంత కాలం సస్పెన్షన్ లో ఉంచవచ్చు?
  • జవాబు:-జీఓ.526 : GAD; తేదీ:19.8.08 ప్రకారం ఒక ఉద్యోగిని 2 సంవత్సరం లకి మించి సస్పెన్షన్ పీరియడ్ లో ఉంచకూడదు.
ప్రశ్న:
ఒక మహిళా ఉద్యోగికి వివాహం కోసం డబ్బులు ఏమైనా అప్పుగా ఇస్తారా???

జవాబు:
జీఓ.39 ; ఆర్థికశాఖ; తేదీ:15.4.15 ప్రకారం 75000/- అప్పుగా ఇస్తారు. దీనిని 70 వాయిదా లలో తిరిగి చెల్లించాలి.*

  • ప్రశ్న:-ప్రత్యేక ఆశక్తత సెలవులో ఉన్న వారికి జీతభత్యాలు ఎలా చెల్లించాలి?
  • జవాబు:-120 రోజుల వరకు పూర్తి జీతం,మిగిలిన కాలానికి సగం జీతం చెల్లిస్తారు.
ప్రశ్న:
కమ్యూటెడ్ సెలవును హాఫ్ పే లీవ్ గా మార్చుకోవచ్చా?
జవాబు:
జీఓ.143 తేదీ:1.6.68 ప్రకారం వీలులేదు.

ప్రశ్న;-బీసీ క్రిమిలేయర్ పరిధిలోకి ఎవరు వస్తారు?
  • జవాబు:-కేవలం గ్రూప్--1&11 సర్వీసులో ఉన్న ఉద్యోగులు మాత్రమే వస్తారు.టీచర్లు క్రిమిలేయర్ పరిధిలోకి రారు మరియు 6 లక్షల ఆదాయం కలిగిన బీసీ ఉద్యోగుల0దరూ క్రిమిలేయర్ పరిధిలోకి రారు.*

PF ఋణం ఎంత ఇస్తారు??తిరిగి ఎలా చెల్లించాలి??

జవాబు:
PF నిబంధనలు 15ఏ ప్రకారం 20 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు మరియు 10 ఇయర్స్ లోపు సర్వీసు గలవారు ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. గృహ నిర్మాణ0 కోసం, స్థలం కొనుగోలు చేయడానికి 15 ఇయర్స్ సర్వీసు పూర్తి చేసిన వారు కూడా ఋణం తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. రూల్ 15సీ ప్రకారం బేసిక్ పే కి 6 రెట్లు లేదా నిల్వ లో సగం ఏది తక్కువ ఐతే అది ఋణంగా ఇస్తారు.అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నిల్వ మొత్తం లో గరిష్టంగా 75% వరకు ఇవ్వవచ్చు.

ప్రశ్న:-నాకు పదోన్నతి వచ్చింది. నేను పదోన్నతి ఆర్డర్ తీసుకోలేదు. ఇపుడు ఏమి జరుగుతుంది??
  • జవాబు:-మెమో.10445 ; జీఏడి ; తేదీ:1.6.11 ప్రకారం ఒక సారి పదోన్నతి తిరస్కరించవచ్చు.ఐతే జీఓ.145 ; జీఏడి ; 15.6.04 ప్రకారం మరుసటి సంవత్సరం ప్యానల్ లిస్టులో చేరుస్తారు. ఆ తర్వాత ఇక చేర్చరు

సందేహాలు -- సమాధానాలు
ప్రశ్న:స్వచ్చంద ఉద్యోగ విరమణ చేయదలచుకొన్నపుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలి??
  • జవాబు:-స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కి అనుమతి కోరుతూ HM ద్వారా DEO గారికి 3 నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి.దరఖాస్తు తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, SR,10వ తరగతి నుండి విద్యా అర్హతల సర్టిఫికేట్లు,సెల్ఫ్ డిక్లరేషన్ జాతపరచాలి.

ప్రశ్న:
సర్వీసు మొత్తం మీద ఎన్ని కమ్యూటెడ్ సెలవులు వాడుకోవాలి??

జవాబు:
సర్వీసు మొత్తం మీద 240 రోజులు కమ్యూటెడ్ సెలవుగా వాడుకోవచ్చు.అప్పుడు అర్థ జీతపు సెలవు ఖాతా నుండి 480 రోజులు తగ్గించబడతాయి.ఆ తర్వాత కూడా సెలవు అవసరం ఐతే కేవలం అర్ధ జీతపు సెలవు గా మాత్రమే ఖాతాలో నిల్వ ఉన్నంత వరకు వాడుకోవచ్చు.

ప్రశ్న:-ఓపెన్ యూనివర్సిటీ SSC, ఇంటర్ పరీక్షల ఇన్విజిలేటర్ గా పనిచేసిన వారికి సంపాదిత సెలవు నమోదు కొరకు ప్రతి సంవత్సరం ఉత్తర్వులు రావాలా?
  • జవాబు:-అవసరం లేదు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు వారి ఉత్తర్వులు ఆర్.సి.నo.362/ఇ1-1/2013 తేదీ:16.11.2013 ప్రకారం జమ చేయవచ్చు.

ప్రశ్న:
LFL HM కి 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి కావలసిన అర్హతలు ఏమిటి??

జవాబు:
LFL HM కి తదుపరి పదోన్నతి హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు కాబట్టి డిగ్రీ, బీ. ఈ. డీ, డిపార్ట్మెంట్ పరీక్షల ఉతీర్ణత ఉండాలి.50 ఇయర్స్ వయస్సు నిండితే డిపార్ట్మెంట్ టెస్టుల మినహాయింపు వర్తిస్తుంది.


  • ప్రశ్న: UP స్కూల్ లో పనిచేస్తున్న టీచర్ అదే మండలం నకు FAC MEO గా భాద్యత లు నిర్వహించుచున్న అతని వార్షిక ఇంక్రిమెంట్లు, ELs ఎవరు మంజూరు చేస్తారు?
  • జవాబు: FR.49 ప్రకారం ఒక పోస్టులో అదనపు బాధ్యతలు నిర్వహించుచున్న సందర్భంలో ఆ పోస్టుకి గల అన్ని అధికారాలు సంక్రమిస్తాయి.కనుక వార్షిక ఇంక్రిమెంట్లు తనే మంజూరు చేసుకోవచ్చు. ELs మాత్రం DEO గారి ఆనుమతి తో జమ చేయవలసి ఉంటుంది.

ప్రశ్న: SGT గా పనిచేస్తున్న టీచర్ VRO గా ఎంపిక ఐతే పే--ప్రొటెక్షన్,సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుందా?*

జవాబు: DEO అనుమతి తో పరీక్ష రాస్తే వేతన రక్షణ ఉంటుంది. జీఓ.105 తేదీ:2.6.2011 ప్రకారం నూతన పోస్టు యొక్క స్కేల్ లో ప్రస్తుతం పొందుతున్న వేతనానికి సమానమైన స్టేజి లో వేతనం నిర్ణయించబడుతుంది. ఇంక్రిమెంట్ మాత్రం నూతన సర్వీసు లో చేరిన ఒక సంవత్సరం తర్వాతే మంజూరు చేస్తారు.

  • ప్రశ్న: మహిళా టీచర్ భర్త నిరుద్యోగి.అత్త, మామ కూడా ఈమె పైనే ఆధార పడి జీవిస్తున్నారు.అత్త గారికి ఆరోగ్యం బాగా లేదు.మెడికల్ రీఅ0బర్సుమెంట్ వర్తిస్తుందా?
  • జవాబు: APIMA రూల్ 1972 ప్రకారం వర్తించదు. కేవలం మహిళా టీచర్ అమ్మ,నాన్న లకి మాత్రమే వర్తిస్తుంది.

ప్రశ్న: నాకు మొదటి సారి అమ్మాయి.తర్వాత కవల పిల్లలు జన్మించారు. LTC లో ముగ్గురు పిల్లలు ప్రయాణం చేయవచ్చా?

జవాబు: జీఓ.140 తేదీ:3.4.96 ప్రకారం ఇద్దరు పిల్లలుకి మాత్రమే అవకాశం ఉంది.

  • ప్రశ్న: అబార్షన్ కి రెండుసార్లు మాత్రమే సెలవు ఉపయోగించుకోవాలి అనుచున్నారు.వాస్తవమా?? కదా?
  • జవాబు: జీఓ.254;ఆర్ధిక;తేదీ:10.11.95 ప్రకారం ఇద్దరు కంటే తక్కువ జీవించియున్న బిడ్డలు గలవారు అర్హులు.అంతేకానీ ఎన్నోసారి అనే దానితో నిమిత్తం లేదు.

.
ఉన్నత విద్య కోసం DEO అనుమతి తో డెప్యూటషన్ లో ఉన్న SC, ST టీచర్స్ కు AGI మంజూరు చేయవచ్చా?


సమాధానం...
మంజూరు చేయవచ్చు.
GO. no.342 dt:30.08.1977 ద్వారా ఉన్నత విద్య కోసం ఇచ్చిన డెప్యూటషన్ కాలం onduty గానే పరిగణిస్తారు

.
.




 Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions