Labels

Monday 13 March 2017

Appointment on compensation grounds కారుణ్య నియామకం

సర్వీస్ మేటర్స్

Appointment on compensation grounds కారుణ్య నియామకం


అర్హులు:-

1.మరణించిన
2.గడిచిన 7 ఇయర్స్ కు పైగా కనిపించకుండా పోయిన
3.వైద్య కారణము ల ఫై రిటైర్మెంట్ కు అనుమతి0చబడిన తేదీ నుంచి 5 ఇయర్స్ సర్వీసు గల ఉద్యోగి కుటుంబం లో సంపాదన పరులు ఎవ్వరూ లేనపుడు, ఆ కుటుంబం లో ఒకరు నియామకానికి అర్హులు.

ఆధారితులు:-


1.ఉద్యోగి భార్య/భర్త
2.కుమారుడు/కుమార్తె
3.వివాహిత కుమార్తె/విధవ రాలు ఐన కుమార్తె
4.తమ్ముడు/చెల్లెలు

ఇచ్చే పోస్ట్:-
1.అటెండర్
2.జూనియర్ అసిస్టెంట్

పోస్టుకు అర్హతలు:-
జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కు ఇంటర్ కావాలి.లేక పొతే పాస్ అవటానికి 3 ఇయర్స్ అవకాశం ఇస్తారు.గడువు లోగా పాస్ కాకపోతే అటెండర్ గా నియమిస్తారు.

వయస్సు:-
OC లకు గరిష్టంగా 33 ఇయర్స్ , BC, SC, ST లకు గరిష్టంగా 38 ఇయర్స్.
ఉద్యోగి భార్య/భర్త కు కారుణ్య నియామకం ఇవ్వవలసిన సందర్భం లో గరిష్టంగా 45 ఇయర్స్.

 నియామకపు విధానం:-
ఉద్యోగి మరణించిన 1 ఇయర్ లోగా అతని కుటుంబ సభ్యుడు నియామకం కోరుతూ నియామకపు అధికారికి దరఖాస్తు చేసుకోవాలి.
మైనర్ పిల్లలకు ఉద్యోగి మరణించిన 2 ఇయర్స్ లోగా 18 ఇయర్స్ వయస్సు నిండి నపుడు మాత్రమే వారి దరఖాస్తు పరిగణించబడుతుంది.
వైద్య కారణం లపై రిటైర్మెంట్ కోరుకొనే వారి దరఖాస్తు ను జిల్లా/రాష్ట్ర వైద్యుల కమిటీ కి పంపి వారి నివేదిక ఆధారంగా జిల్లా/రాష్ట్ర కమిటీ సిఫార్సు మేరకు నియామక అధికారి అనుమతి ఇస్తారు.ఆ తరువాత మాత్రమే కారుణ్య నియామకం నకు అప్లై చేసుకోవాలి.
జతపరచ వలసినవి;

1.application with bio-data.
2.educational qualifications.
3.death certificate of employee.
4.legal heir certificate.
5.list of family members.
6.no objection declaration of the other legal heirs of deceased government employee attested by notary.
7.no re- marriage certificate.
8.declaration stating that there being no other earning member in the family.
9.certificate of registration in employment exchange.
10.community certificate.

నియామక పరిధి:-
మరణించిన ఉద్యోగి పని చేసిన యూనిట్ లొనే నియామకం ఇవ్వబడుతుంది.ఆ యూనిట్ లో ఖాళీ లేనపుడు కలెక్టరు గారికి ఫైల్ పంపినచో వారు వేరే డిపార్టుమెంటు కు కేటాఇంచవచ్చు.ఏ డిపార్టుమెంటు లో ఖాళీ లేకపోతే కలెక్టరు గారు 5 సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి వాటిలో పోస్టింగ్ ఇవ్వవచ్చు.5 కంటే ఎక్కువగా పోస్టు లు అవసరం ఐన govt నుండి అనుమతి తీసుకుంటారు.
ఈ కారుణ్య నియామకాలు సిక్స్ పాయింట్ ఫార్ములా కు లోబడి  ఇవ్వబడతాయి.రిజర్వేషన్ లు కూడా అమలు జరపాలి.
భార్యకు మాత్రం సొంత జిల్లా లో గానీ, భర్త చేసిన చోట గానీ, నివాసం ఉండు ప్రాంతం లో గానీ నియామకం కోరుకొనే హక్కు ఉంది.

ఎక్సుగ్రేషియా:-
కారుణ్య నియామకం ఇవ్వటం సాధ్యపడనపుడు 4వ తరగతి ఉద్యోగుల కుటుంబాలకు 20,000రూ, నాన్ గజిటెడ్ వారికి 30,000రూ, గజిటెడ్ వారికి 40,000రూ ఎక్సుగ్రేషియా ఇస్తారు.



Friday 10 March 2017

మహిళా ఉద్యోగుల ప్రత్యేక జీవోలు

మహిళా ఉద్యోగుల ప్రత్యేక జీవోలు

పురుషుల కంటే మహిళా టీచర్లకు 5CLs  అధికం
(G.O.Ms.No.374, Edn, Dt:16-3-1996)
👉ఫ్యామిలీ ప్లానింగ్కు 14 రోజులు సెలవు ఇస్తారు.
(G.O.Ms.No.1415, M&H, Dt:10-06-1968)
👉మొదటి ఆపరేషన్ ఫేయిలైతే రెండో ఆపరేషన్ కు14 రోజులు సెలవు ఇస్తారు
(G.O.Ms.No.124, F&P, Dt:13-04-1982)
👉లూప్ వేయించుకొన్న రోజు స్పెషల్ CL ఇస్తారు
(G.O.Ms.No.128, F&P,Dt:13-04-1982)
👉ఆపరేషన్ తరువాత పిల్లలు చనిపోతే రీకానలైజెషన్ చేయించుకున్న  ఉద్యోగికి 21 రోజులు సెలవు ఇస్తారు
(G.O.Ms.No.102,M&H,Dt:19-02-1981)
👉గర్భసంచి తొలగిస్తే  సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫార్సు మేరకు 45 రోజులు ప్రత్యేక సెలవు ఇస్తారు
(G.O.Ms.No.52, Fin,Dt:1-04-2011)
👉180 రోజులు ప్రసూతి సెలవు ఇస్తారు ఇది ఇద్దరు జీవించి ఉన్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది
(G.O.Ms.No.152, Fin,Dt:04-05-2010) &
(G.O.Ms.No.38, F&P, Dt:13-08-1992)
👉సమ్మర్ హాలిడేస్ లో ప్రసవించిన,ఇక్కడి నుండి 180 రోజులు ఇస్తారు.
(G.O.Ms.No.463,Edn,Dt:04-05-1979)
👉అబార్షన్ కు 6 వారాలు సెలవు ఇస్తారు.
(G.O.Ms.No.762,M&H,Dt:11-08-1976)
👉వివాహానికి రూ.75,000 అప్పుగా ఇస్తారు.దీన్ని  70 వాయిదాల్లో 5.50% వడ్డీ తో చెల్లించాలి
(G.O.Ms.No.39 F&P,Dt:15-04-2015).