Labels

Wednesday 15 February 2017

IT FY 2016-17 - సస్పెన్షన్లు-ప్రవర్తనా నియమావళి-CCA రూల్స్-పార్ట్-III:

IT FY 2016-17

ప్రశ్నలు - సమాధానాలు

1. ఆదాయం, మినహాయింపులు మరియు పోదుపులుగా వేటిని FY 2016-17 ఇన్కం టాక్స్ నందు చూపాలి?
జ।। తేదీ 01.04.2016 నుండి 31.03.2017 మధ్య పొందిన ఆదాయాన్ని ఆదాయంగా చూపాలి, అదేవిధంగా మినహాయింపులు మరియు పొదుపుల కింద వచ్చే సెక్షన్లన్నిటికి చెల్లించిన మొత్తం కూడా పైన చెప్పిన కాలంలో చెల్లించినవై ఉండాలి.


2. సెక్షన్ 80CCD(1B) కింద ప్రతి CPS ఉద్యోగికి అధనంగా 50,000/- మినహాయింపు ఇవ్వవచ్చా?
జ।।లేదు. ఉద్యోగులకు 1,50,000/- దాటి పొదుపు ఉన్నప్పుడు  మాత్రమే సెక్షన్ 80CCD(1B) కింద CPS కోసం జమచేసిన నిధిని చూపి గరిష్ఠంగా 50,000/- మినహాయింపు పొందవచ్చు.


3. రిబేట్ 5,000/- ఎవరికి వర్తిస్తుంది?
జ।। ఆదాయం 5లక్షల వరకు గల వారికి సెక్షన్ 87A ప్రకారం చెల్లించాల్సిన టాక్స్ కాని గరిష్ఠంగా 5,000/- వరకు కానీ మినహాయింపు కలదు. ఆదాయం అనగా గ్రాస్ ఆదాయం నుండి మినహాయింపులు మరియు పొదుపులను తీసివేయగా వచ్చినది. కానీ టాక్స్ లేని 2,50,000/- లను తీసివేయగా వచ్చే 5లక్షలకు కాదు.


ఉదాహరణకు:
గ్రాస్ ఆదాయం  : 7,50,005/-
మినహాయింపు : 1,00,000/-
పొదుపులు       : 1,50,000/-
------------------------
ఆదాయం         : 5,00,005/-
------------------------
ఆదాయం 5లక్షల పైన ఉంది కాబట్టి 5,000/- రిబేట్ వర్తించదు. (Government of India Ministry of Finance వారి Circular 1/2017 తేదీ 02.01.2017 page no. 34 ప్రకారం)

కొందరు అడుగుతున్నారు 5,00,005/- నుండి టాక్స్ లేని 2,50,000/- తీసివేస్తే వచ్చే 2,50,005/- మాత్రమే కదా దీనికి 5,000/- రిబేట్ వర్తించాలీ కదా అని కానీ ఇది సరికాదు.                    



సస్పెన్షన్లు-ప్రవర్తనా నియమావళి-CCA రూల్స్-పార్ట్-III:



FR-55 ప్రకారం సస్పెండు అయిన ఉద్యోగికి సస్పెన్షన్ కాలములో ఎలాంటి సెలవులు మంజూరు చేయకూడదు.

 సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటూన్నట్లయితే అతనికి పదోన్నతి(Promotion) కల్పించటకు అవకాశము లేదని ప్రభుత్వం G.O.Ms.No.257 తేది:10-06-1999 ద్వారా తెలియజేసింది.

 ప్రభుత్వ ఉద్యోగికి సస్పెన్షన్ కాలములో పదవీ విరమణ వయస్సు వచ్చినయెడల అతనిపై ఉన్న క్రమశిక్షణా చర్యలు పెండింగ్లో ఉన్న యెడల అట్టివానికి భంగం కలగకుండా ఆ ఉద్యోగిని పదవీ విరమణ గావించవలెను.
(G.O.Ms.No.64 F&P తేది:01-03-1979)
(Section 3 of A.P.Public Employment of age of super annuation Act 1984)


సస్పెన్షన్ లో ఉంటూ చనిపోయిన ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు పుర్తిగాకుండా అసంపూర్తిగా ఉన్న సమయంలో సస్పెన్షన్  లో ఉన్న ఉద్యోగి చనిపోయిన యెడల,సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీ క్రింద పరిగణించవలెనని ప్రభుత్వం G.O.Ms.No.275 F&P తేది:08-08-1997 ద్వారా ఉత్తర్వులు జారీచేసింది.

 AP స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1996 లోని రూలు.30 ప్రకారం సస్పెన్షన్ ఉన్న ఉద్యోగి క్రమశిక్షణా చర్యల గురించి విచారణ పూర్తికాకముందే ఏ కారణము చేతనైన తన పదవికి రాజీనామా చేసిన యెడల అట్టి రాజీనామా అంగీకరించకూడదు.


రెండు సం॥ కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్ లో ఉన్న ఉద్యోగి యొక్క క్రమశిక్షణా చర్యలు పెండింగ్లో పెడుతూ వెంటనే సర్వీసలోకి పునరుద్దరించవలెను. కొన్ని ప్రత్యేక పరిస్థితులలలో మాత్రమే సస్పెన్షన్ కొనసాగిన్చవచ్చు.
(G.O.Ms.No.526 GAD తేది:19-08-2008)

 సస్పెన్షన్ కాలంలో ఉద్యోగి జీవనాధారంగా వున్న ఉద్యోగం ద్వారా జీతభత్యాలు పొందు అర్హత ఉండదు కాబట్టి,అట్టి ఉద్యోగికి జీవనాధారంగా భత్యములు చెల్లించు అవకాశం FR-53 లోని నియమ నిబంధనలకులోబడి చెల్లించే విధానాలు ప్రభుత్వం కల్పించింది.

సస్పెండ్ అయిన ఉద్యోగిని తిరిగి సర్వీసులో పునరుద్దరించే  Resistance)సందర్భంలో జారీచేయవలసిన ఉత్తర్వుల ఫారం ప్రభుత్వం G.O.Ms.No.82 GAD తేది:01-03-1996) ద్వారా నిర్దేశించింది.

సస్పెండ్ అయిన ఉద్యోగి తాను సస్పెండ్ అయిన తర్వాత ఏ విధమైన ఉద్యోగం గాని/వృత్తి గాని/వ్యాపారం గాని యితరత్రా వ్యాపకం గాని చేయటం లేదని ధృవీకరణ పత్రము అధికారికి అందజేయవలెను.

 జీవనాధార భత్యము సస్పెండ్ అయిన ఉద్యోగికి తిరస్కరించరాదు. జీవనాధార భత్యము(Subsistance Allowance) చెల్లింపులు తిరస్కరించటం శిక్షించదగ్గ నేరము.
(Govt.memo.no.29730/A/458/A2/FR-II/96/F&P తేది:14-10-1996)

 సస్పెన్షన్ కాలాన్ని డ్యూటీలో లేని కాలం(Non Duty) గా పరిగణించినప్పుడు ఉద్యోగి అభ్యర్ధనమేరకు సెలవుగా మార్పు (Convert) చేసినపుడు అతని సెలవు జీతములో నుంచి అతనికి ఇదివరకే చెల్లించియున్న జీవనభృతి లో మొత్తం రికవరీచేయాలి.

 ఉద్యోగిని చిన్న కారణాల వల్ల న్యాయ సమ్మతము గాని సస్పెండ్ చేసే బదులు అతనిని బదిలీచేయవచ్చు. అట్టి బదిలీ కాబడిన ఉద్యోగి బదిలీ కాబడిన కొత్త స్థానంలో చేరకుండా సెలవు పెట్టిన యెడల అట్టి సెలవు మంజూరుచేయకూడదు.
(Govt.circular.memo.no.595SP/B/2000 తేది:21-09-2000 & Govt.memo.no.1733/ser.C GAD 03-08-1967)

ఉద్యోగులను సర్వసాధారణమైన సామాన్య కారణాలపై అనవసరంగా సస్పెండు చేయకూడదు.ఆ విధంగా సస్పెండు కాబడిన ఉద్యోగికి జీవనాధార భృతి చెల్లించటమే కాకుండా,అతని సేవలు కూడా ప్రభుత్వం పోగొట్టుకుంటుoది. అందువలన అనవసర కారణాల వల్ల ఉద్యోగిని సస్పెండు చేయకూడదు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
(Govt.memo.no.2213/ser.C/66-1 GAD తేది:30-11-1966 & memo no.4993/police-C/69-1 తేది:08-12-1969