Labels

Sunday 31 July 2016

ఏకీకృత సర్వీస్ రూల్స్ పై కొన్ని సందేహలు.

ఏకీకృత సర్వీస్ రూల్స్ పై కొన్ని సందేహలు. 

 

అవి


ప్రశ్నలకు సమాధానములు:
-------------------------
ఉపాధ్యాయ సర్వీస్ రూల్స్ రాష్ట్ర పతి ఎందుకు ఆమోదించాలి?రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఎందుకు లేదు?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల కలయికతో ఏర్పడింది. ఇరు రాష్ట్రాలలో ఉద్యోగాల అసమతౌల్యం ఏర్పడకుండా ఉండటానికి భారత రాజ్యాంగం లో ఆర్టికల్ 371-D ద్వార కొన్ని స్థానిక క్యాడర్ ఉద్యోగాలు ఏర్పరిచారు. సో రాజ్యాంగాన్ని సవరించాలంటే రాష్ట్రపతి కేంద్ర హోమ్ శాఖ మాత్రమే చేయగలవు. స్టేట్ govt కి అధికారం లేదు.

లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ అంటే ఏమిటి?
ఇటువంటి సమస్య అన్ని రాష్ట్రాలలో ఉన్నదా? లేదా మన రాష్ట్రానికే సంబందించినదా?

తెలంగాణా రాయలసీమ ఉత్తరాంద్ర మన ఉమ్మడి రాష్ట్రం లో వెనక పడిన ప్రాంతాలుగా పేరుపడ్డవి. ఆ ప్రాంతాలలో అక్షరాస్యత తక్కువ. అందుకని ఉద్యోగాలలో వారు వెనకపడి పోకుండా ఏఏ జిల్లాలో వారు ఆ జిల్లాలలో ఉద్యోగం పొందే లోకల్ క్యాడర్ ఉద్యోగాలు (టీచర్, క్లర్క్,పోలీస్) లాంటివి. మరియు జోనల్ క్యాడర్ ఉద్యోగాలు MRO MDO లాంటి ఉద్యోగాలు విభజన చేసారు.దీనిని లోకల్ క్యాడర్ organization అంటారు.

ఈ సమస్య అన్ని రాష్ట్రలలో లేదు ప్రాంతం పరంగా అసమనతలున్న రాష్ట్రాలలో మాత్రమే ఉంది.

పంచాయితీరాజ్ ఉపాద్యాయులు విద్యశాఖకు సంబందించినవారు కాదని అంటున్నారు.

73,74 రాజ్యాంగ సవరణ ద్వార పంచాయతీ రాజ్ చట్టం ఏర్పాటైంది. దాని ద్వార zp మరియు mpp లలో స్కూల్స్ ఏర్పాటు చేసారు. దాంట్లో టీచర్ పోస్ట్ లు ఇచ్చారు. వారికీ జీతం ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇచ్చే ఫండ్ ద్వార ఇవ్వాలి. ఇవి కాక నేరుగా ప్రభుత్వం appsc ద్వార govt. స్కూల్స్ లో టీచర్లను నియమించింది.1996 వరకు. వారు నేరుగా govt పద్దు నుండి జీతం పొందుతారు. వారె govt టీచర్స్.

ఏకీకృత సర్వీసు అంటే ఏమిటి?

పై రెండు సర్వీసులను కలపడమే ఏకీకృతా సర్వీస్...KY
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Friday 29 July 2016

e- Filing Anywhere Anytime ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఇ-ఫైలింగ్ చేయడం:

 e- Filing Anywhere Anytime
ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఇ-ఫైలింగ్ చేయడం:

పన్ను వర్తించే ఆదాయం రూ.2,50,000 కన్నా ఎక్కువ ఉన్న వారు జులై 31 లోగా
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయవలసి ఉంటుంది.

ఫిబ్రవరి మాసంలో సమర్పించిన ఫారం 16 ఆధారంగా రిటర్న్ దాఖలు చేయాలి.

 దాఖలు చేయవలసిన విధానం:

వేతనం లేదా పింఛను ద్వారా ఆదాయం పొందుచున్న వారు, పెట్టుబడులపై వడ్డీ ఆదాయం పోన్స్య్ వారూ, ఒకే గృహం ద్వారా ఆదాయం ఉన్న వారు ITR-1(సహజ్) ఫారం ద్వారా రిటర్న్ దాఖలు చేయాలి.

ఆన్ లైన్ ద్వారా "ఇ- రిటర్న్" ను సులభంగా దాఖలు చేయ వచ్చు. దాఖలు చేసే విధానాన్ని పరిశీలిద్దాం.

 పేరు రిజిస్టర్ చేసుకొనుట:
incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి Register your self అను ఆప్సన్ ను ఎంచుకొనవలెను. దానిలో పాస్ వర్డ్ తదితర వివరములను పూర్తిచేసిన తదుపరి మెయిల్ కు వచ్చిన లింక్ కాపీ చేసి బ్రౌజర్ లో పేస్ట్ చేసిన తర్వాత మొబైల్ కి వచ్చిన పిన్ నంబర్ ను నమోదు చేస్తే రెజిస్ట్రేషన్ పూర్తి అయినట్లే. మీ పాస్ వర్డ్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.

 ఫారం 26 AS:

ఇ- ఫైలింగ్ చేసేందుకు ఫారం 26 AS ను పరిశీలించుకోవాలి. పైన తెలిపిన వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తదుపరి 'VIEW FORM 26 AS' ను ఎంచు కోవాలి. దానిలో యూజర్ ID అంటే పాన్ నంబర్, రిజిస్ట్రేషన్ లో మనం ఎంచుకొన్న పాస్ వర్డ్ తదితర అంశాలను నమోదు చేసిన తదుపరి ఫారం 26 AS ను క్లిక్ చేసి ఎసెస్మెంట్ సంవత్సరం సెలెక్ట్ చేసుకోవడం ద్వారా ఫారం 26 AS ఓపెన్ అవుతుంది. దానిలో ఆ సంవత్సరం మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు అయినదీ లేనిదీ పరిశీలించుకోవచ్చు. ఫారం లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నప్పుడే ఇ- రిటర్న్ చేయాలి.

 ఫారం 26 AS లో నమోదుల పరిశీలన:

ఫారం 26 AS లో మనం పరిశీలన చేసినప్పుడు మనం చెల్లించిన పన్ను సక్రమంగా నమోదు కానట్లయితే DDO కు తెలియజేయాలి. సక్రమంగా నమోదు కాక పోవడానికి కారణాలు DDO త్రై మాసిక రిటర్న్(Q1, Q2, Q3, Q4) లను సమర్పించక పోవడం లేదా సమర్పించిన వానిలో పొరబాటు జరగడం అయివుండ వచ్చు. త్రైమాసిక రిటర్న్ దాఖలు చేయవలసిన బాధ్యత DDO లదే కాబట్టి వారే దాఖలు చేయడం లేదా తప్పులను సవరించడం చేయవలసి ఉంటుంది.

 ఇ- ఫైలింగ్ చేయడం:

ఫారం 26 AS లో పన్ను నమోదు సక్రమంగా ఉన్నట్లు సంతృప్తి చెందిన తరువాత ఇ- ఫైలింగ్ చేయడం ప్రారంభించాలి. ముందు చెప్పిన వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తరువాత 'Quick e file ITR- 4S' ఎంపిక చేసుకోవాలి.

PAN నంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీతడితర వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన వెంటనే ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. ఇష్టం అయితే నమోదు చేయవచ్చు లేదా తదుపరి అని పేర్కొన వచ్చు.

అనంతరం పాన్ నంబర్, ITR పేరు(ITR-1) అసెస్ మెంట్ సంవత్సరం సెలెక్ట్ చేసు కోవాలి. తరువాత ఇవ్వబడిన 3 ఆప్షన్ లు 1) పాన్ ఆధారంగా 2) గతంలో దాఖలు చేసిన రిటర్న్ ఆధారంగా 3) నూతన చిరునామా లలో ఒకటి ఎంపిక చేసుకొని లాగిన్ అవ్వాలి.
తదుపరి వచ్చే ఫారం లో వ్యక్తిగత వివరాలు, ఆదాయం వివరాలు, పన్ను వివరాలు, పన్ను చెల్లింపు వివరాలు, 80 G వివరాలు నమోదు చేయాలి. నమోదులు ఎప్పటి కప్పుడు సేవ్ చేసుకొంటే మంచిది. అన్ని నమోదులు పూర్తి అయిన తరువాత సబ్ మిట్ చేయాలి. 26 AS లో నమోదు అయిన పన్ను, ఇ- ఫైలింగ్ లో పన్ను ఒకే విధంగా ఉండాలి. లేనట్లయితే నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది.

 ఎకనాలెడ్జ్మెంట్:
ITR- 1 సబ్ మిట్ చేసిన తరువాత ఎకనాలెడ్జ్మెంట్ ఆప్షన్స్ వస్తాయి. దానిలో 'NO CVC' అనే ఆప్షన్ ఎంపిక చేసుకొని తదుపరి వచ్చిన ఆప్షన్స్ లో 'Mobile OTP' ఆప్షన్ ఎంపిక చేసుకుంటే మన ఫోన్ కి, మెయిల్ కి OTP వస్తుంది. ఆ పాస్ వర్డ్ ని నమోదు చేస్తే ఎకనాలెడ్జ్మెంట్ మన మెయిల్ కి వస్తుంది. దాని నుండి ఎకనాలెడ్జ్మెంట్ డౌన్ లోడ్ చేసుకొని భద్ర పరచు కోవాలి. ఎకనాలెడ్జ్మెంట్ సీపిసి బెంగుళూరుకు పంప వలసినదీ, లేనిదీ ఎకనాలెడ్జ్మెంట్ క్రింది భాగంలో పేర్కొన బడుతుంది. పంప వలసి వస్తే సంతకం చేసి 3 నెలల లోపు పంపాలి.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Saturday 9 July 2016

child care leave



 Andhra Pradesh 💥🌹ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి ఉద్యొగినులకు 60 రోజుల Child Care Leave ను ఇస్తూ G.O.Ms.No.132 Dt 06.07.2016 ను విడుదల చేయడం జరిగింది.

🌹ఇకమీదట మహిళా ఉద్యొగినులు తమ పిల్లలకు( గరిష్టముగా ఇద్దరు మాత్రమే) 18 ఏళ్ళు వచ్చే వరకు వారికి ఓంట్లొ బాగా లెనప్పుడు, పరీక్షలకు హాజరు అగునప్పుడు, ఫంక్షన్లకు, అవసరం అయినపుడు గరిష్టముగ 60 రొజుల వరకు సెలవు వాడుకొనవచ్చును.

🌹ఈ సెలవును వంతుల వారీగా కూడ అవసరమయినప్పుడు వాడు కోవచ్చును.

🌹పిల్లలు పుట్టిన తేది ఆధారముగ ఈ సెలవు మంజురు‌చెస్త్తారు.
AP NEWS:

ఉద్యోగినులకు రెండు నెలల శిశు సంరక్షణ సెలవు

ఉద్యోగినులకు రెండు నెలలపాటు శిశు సంరక్షణ సెలవు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆరు నెలలపాటు ప్రసూతి సెలవు ఇస్తున్నారు.

ఇప్పుడు అదనంగా రెండు నెలలపాటు శిశు సంరక్షణ నిమిత్తం సెలవు ఇస్తారు. దీనికి సంబంధించిన దస్త్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి

All district DEO websites at a glance

All district DEO websites at a glance


Adilabad
 www.deoadb.weebly.com

Nizamabad
deonizamabad.com

MEDAK
www.medakdeo.in

Hyderabad
deohyderabad.com

MBNR
deombnr-ap.webnode.com

NALGONDA
deonalgonda.blogspot.in

Karimnagar
www.karimnagardeo.in

Khammam
khammamdeo.in

 Warangal
deowarangal.net

Rangareddy
deorangareddy.in