Labels

Wednesday 12 July 2017

ప్రత్యేక అర్ధవేతన సెలవు:

ప్రత్యేక అర్ధవేతన సెలవు:


లెప్రసీ,టి.బి,క్యాన్సర్, మానసిక అనారోగ్యం, గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యంతో వంటి వ్యాధులతో ధీర్ఘకాల చికిత్స పొందుతున్న వారు,సంబంధిత వైద్య ధృవపత్రం ఆధారంగా 6 నెలల గరిష్ట పరిమితితో తన ఖాతాలో నిల్వయున్న అర్ధవేతన సెలవును వినియోగించుకుని పూర్తివేతనం పొందవచ్చు.
(G.O.Ms.No.188 Fin Dt:30-07-1973)*
(G.O.Ms.No.386 Fin Dt:06-09-1976)*
(G.O.Ms.No.20 Fin Dt:25-01-1977)*

గుండె జబ్బులకు:*
(G.O.Ms.No.449 Fin Dt:28-10-1976)*

మూత్రపిండ వైఫల్యానికి:*
(G.O.Ms.No.268 Fin Dt:25-01-1977)*

సెలవులో వెళ్ళడానికి ముందు పొందిన వేతనం ఆధారంగా మాత్రమే సెలవు కాలపు జీతభత్యాలు చెల్లించబడతాయి.

ఏ కారణం వల్లనైనా సెలవు మధ్యలో వేతనం పెంపుదల జరిగినప్పటికీ, సెలవు అనంతరం డ్యూటీలో చేరిన తేది నుండి మాత్రమే ఆర్ధిక లాభం వర్తింపచేస్తారు.

6 నెలల వరకు వినియోగించుకున్న అన్ని రకాల సెలవులకు HRA,CCA చెల్లించబడుతుంది.
(G.O.Ms.No.28 Fin Dt:09-03-2011)*

కుష్టు,గుండె జబ్బు,క్యాన్సర్,ఎయిడ్స్,మానసిక అనారోగ్యం, మూత్రపిండాల వైఫల్యం వంటి జబ్బుల చికిత్స సందర్భంలో 8 నెలల వరకు HRA చెల్లించబడుతుంది.
(G.O.Ms.No.29 Fin Dt:09-03-2011)*

 ఒకసారి మంజూరు చేయబడిన సెలవు ఎట్టి పరిస్థితులలో మార్పుచేయబడదు.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment