Labels

Friday 23 June 2017

సకల జనుల సమ్మె నగదుకు వీలుకాని ఆర్జిత సెలవుల గూర్చి

సకల జనుల సమ్మె నగదుకు వీలుకాని ఆర్జిత సెలవుల గూర్చి


సకల జనుల సమ్మె
(SJS)లో  పాల్గొని.... తదనంతరం ప్రభుత్వం నిర్దేశించిన 16 ప్రభుత్వ సెలవు రోజుల్లో పాఠశాలలకు హాజరై, విధులు నిర్వర్తించిన ఉపాధ్యాయులకు సరెండర్ చేసినప్పుడుకానీ, ఉద్యోగ విరమణ చేసిన సందర్భంలో కానీ నగదు చేసుకోవడానికి వీలులేని ఆర్జిత సెలవులు నిల్వ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీచేసిన విషయం మనకు తెలిసిందే కదా!

ఈ ELs ని preserve చేయడానికి SJS పీరియడ్ లో పనిచేసిన పాఠశాల... హైస్కూల్ అయినట్లుంటే HM......PS, UPS లు అయిన పక్షంలో MEO లు అటెండన్స్ సర్టిఫికెట్స్ ని ఇప్పటివరకు జారీచేయకపోతే వెంటనే జారీ చేయాలి.

సదరు సర్టిఫికెట్స్ జతచేసి ఉపాధ్యాయులు HSHM/MEO కి దరఖాస్తు పెట్టుకోవాలి. 2011 నుంచి ఇంకా అదే పాఠశాలలో పనిచేస్తుంటే ఉపాధ్యాయులు కేవలం ELs Preserve చేయాలని కోరుతూ దరఖాస్తు చేస్తే సరిపోతుంది. అటెండన్స్ సర్టిఫికెట్స్ జారీచేయడం.....  ELs నిల్వ చేయడం.... సంబంధిత HSHM/MEO లదే పూర్తి బాధ్యత!

ఇక్కడొక మాట! ఎవరూ అన్యధా భావించొద్దు. ఎన్నికలు... కౌంటింగ్ etc ....డ్యూటీలు మనం నిర్వహించినప్పుడు Revenue/PR అధికారులు డ్యూటీ సర్టిఫికెట్స్ జారీలో ఆలస్యం చేస్తే గట్టిగా ప్రశ్నిస్తాం.. హక్కుగా సర్టిఫికెట్స్ తీసుకుంటాం. అదే స్ఫూర్తితో... అంతకంటే స్పీడ్ గా సర్టిఫికెట్స్ జారీచేసి మిగతా అన్నిశాఖల అధికారులకు ఆదర్శంగా ఉందాం!

ఇక విషయానికి వస్తే....*
 సర్వీస్ మొత్తంలో ఎప్పుడైనా.... అదీ.... ఒకరోజు....రెండురోజుల చొప్పున కూడా వాడుకునే అవకాశమున్న ఈ SJS-ELs ని ఉపాధ్యాయుల సర్వీస్ బుక్  లో ఓ ప్రత్యేక పేజీలో నమోదుచేయాలి.

సర్వీస్ బుక్ లోని AP లీవ్ రూల్స్ -1933 Regular  ELs  నమోదు చేసే పేజీల్లో  వెనుక నుండి 3పేజీలు వదిలి చేయవచ్చు. అందరు ఇలానే చేయాలనే రూలేంలేదు. ఇంతకంటే మంచి పద్ధతిలో ఎంట్రీ చేయాలనే ఆలోచనలు ఉన్నవారు తమ ఆలోచలన ప్రకారం ఎంట్రీ చేస్తే బెటర్.

మన స్టూడెంట్స్ కి ఒరిజినల్ TC లను TC బుక్ లో మొదటినుంచి ప్రారంభించి చివరిదాకా ఇస్తాం.

Duplicate TC లేనేమో చివరినుంచి ఇస్తూ వస్తాం కదా! ఎందుకంటే భవిష్యత్ ఆడిట్ సమయంలోగానీ, ఇతర సందర్భాల్లోగానీ గందరగోళంగా మారకుండా ఉండడానికి. ఇక్కడా అట్లేనన్నమాట!

మొత్తానికి Regular ELs .... SJS ELs కల్సిపోకుండా... గజిబిజి కాకుండా స్పష్టంగా....ఓ ప్రత్యేక పేజీలో నమోదు చేస్తే సరిపోతుంది.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment