Labels

Thursday 29 June 2017

ప్రాధమిక స్థాయి విద్యార్ధుల కోసం ఒత్తుల గేయం

ప్రాధమిక స్థాయి విద్యార్ధుల కోసం ఒత్తుల గేయం


 ఒత్తును నేనండీ..
*క*ఒత్తును నేనండీ...
*అక్కకు చుక్కకు* ఉంటానండీ...

ఒత్తును నేనండీ...
*గ* ఒత్తును నేనండీ....
*అగ్గికి సిగ్గుకి* ఉంటానండీ....

ఒత్తును నేనండీ...
*చ* ఒత్తును నేనండీ...
*అచ్చుకు కుచ్చుకు* ఉంటానండీ...

ఒత్తును నేనండీ....
*జ* ఒత్తును నేనండీ...
*సజ్జకు బొజ్జకు* ఉంటానండీ....

ఒత్తును నేనండీ...
*ట* ఒత్తును నేనండీ...
*అట్టకు పిట్టకు* ఉంటానండీ...

ఒత్తును నేనండీ...
*డ* ఒత్తును నేనండీ...
*గడ్దికి బిడ్డకు* ఉంటానండీ...

ఒత్తును నేనండీ...
*త* ఒత్తును నేనండీ...
*అత్తకు గిత్తకు* ఉంటానండీ...

ఒత్తును నేనండీ...
*ద* ఒత్తును నేనండీ...
*ఎద్దుకు హద్దుకు* ఉంటానండీ...

ఒత్తును నేనండీ..
*న* ఒత్తును నేనండీ...
*అన్నకు వెన్నకు* ఉంటానండీ...

ఒత్తును నేనండీ...
*ప* ఒత్తును నేనండీ..
*కప్పకు చిప్పకు* ఉంటానండీ...

ఒత్తును నేనండీ..
*బ* ఒత్తును నేనండీ...
*సబ్బుకు మబ్బుకి* ఉంటానండీ...

ఒత్తును నేనండీ..
*మ* ఒత్తును నేనండీ..
*అమ్మకు బొమ్మకు* ఉంటానండీ...

ఒత్తును నేనండీ..
*య* ఒత్తును నేనండీ...
*అయ్యకు పెయ్యకు* ఉంటానండీ...

ఒత్తును నేనండీ..
*ర* ఒత్తును నేనండీ..
*కర్రకు బుర్రకు* ఉంటానండీ...

ఒత్తును నేనండీ..
*ల* ఒత్తును నేనండీ...
*ఇల్లుకి కల్లుకి* ఉంటానండీ...

ఒత్తును నేనండీ...
*వ* ఒత్తుని నేనండీ...
*అవ్వకు బువ్వకు* ఉంటానండీ...

ఒత్తును నేనండీ...
*స* ఒత్తుని నేనండీ...
*కస్సుకి బుస్సుకి* ఉంటానండీ...

ఒత్తును నేనండీ..
*హ* ఒత్తుని నేనండీ...
*అర్హకు కర్హకు* ఉంటానండీ...

ఒత్తును నేనండీ...
*ళ*ఒత్తుని నేనండీ..
*కళ్లకి మళ్లకి* ఉంటానండీ...

ఒత్తును నేనండీ...
బండిరా ఒత్తుని నేనండీ...
*గొర్రెకి బర్రెకి* ఉంటానండీ...

ఈ పదాల్లొ అర్హ కి పూజ, సేవ అనే అర్ధలున్నాయి.
గర్హకి  నింద అనే అర్ధముంది...
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

No comments:

Post a Comment