Labels

Sunday 15 October 2017

TS DSC Notification 8,792 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ Flash..

TS DSC Notification 8,792 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్  Flash..

G.O.Ms.No.25 Dt:10-10-2017
Telangana Direct Recruitment for the posts of Teacher's Rules 2017-Orders-Issued.


టీచర్ అభ్యర్థులకు దీపావళి కానుక

టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ మార్గదర్శకాలు జారీ

31 జిల్లాల ప్రకారం ఉపాధ్యాయ నియామకాలు

స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50శాతం తప్పనిసరి

ఎస్జీటీలకు ఇంటర్‌లో 50శాతం మార్కుల అర్హతఅర్హత విషయంలో ఈక్వలెన్స్ విధానం రద్దు

యూజీసీ, ఎన్సీటీఈ ప్రకారమే నిబంధనల రూపకల్పన

రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు ప్రభుత్వం దీపావళి కానుక ప్రకటించింది. ప్రభుత్వ, జిల్లాపరిషత్తు, మండలపరిషత్తు పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి తుది ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ) మార్గదర్శకాలను మంగళవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య విడుదల చేశారు. ఈ మార్గదర్శకాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు పంపించారు. పదిరోజుల్లోగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసుకొంటున్నది. కొత్తగా ఏర్పాటుచేసిన 31జిల్లాల ప్రకారమే టీచర్ పోస్టులను భర్తీచేయడానికి ఇప్పటికే న్యాయశాఖ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంగళవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి 31జిల్లాల ప్రకారం టీచర్ నియామకాలను చేపట్టడానికి సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు. ఆ వెంటనే నియామక నిబంధనలతో జీవో 25ను విడుదల చేశారు. 31 జిల్లాలవారీగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీలు, రోస్టర్ పాయింట్ల వివరాల సేకరణలో ఇప్పటికే సర్వీస్ కమిషన్ అధికారులు నిమగ్నమయ్యారని విద్యాశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సిలబస్ రూపకల్పన, పరీక్ష నిర్వహణ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, గురుకులాల్లో టీచర్ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల మాదిరిగానే ఈ టీచర్ల భర్తీ పరీక్షలు కూడా ఉంటాయని వారు చెప్పారు. గతంలో మాదిరిగా భాషాపండితుల పోస్టుల కోసం రకరకాల సంస్థలు, బోర్డులు, వర్సిటీల నుంచి తెచ్చుకొన్న సర్టిఫికెట్లకు ఈక్వలెన్స్ ఇచ్చే విధానాన్ని రద్దుచేసినట్టు తెలిపారు.

డిగ్రీలో 50 శాతం మార్కులు అనివార్యం
టీచర్ రిక్రూట్‌మెంట్ నిబంధనల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. యూజీసీ నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ టీచర్ క్యాడర్ పోస్టుకు బ్యాచిలర్ డిగ్రీ, లేదా పీజీ.. 50 శాతం మార్కులతో పాస్ కావాలి. సంబంధిత మెథడాలజీతో ఎన్సీటీఈ గుర్తింపుపొందిన విద్యాసంస్థ నుంచి బీఎడ్ పూర్తిచేసి ఉండాలి. లేదా నాలుగేండ్ల డిగ్రీ ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో (ఉదాహరణ బీఏ, బీఎడ్/ఎంఎస్సీ బీఎడ్)లో 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. వీటితోపాటు టీఎస్‌టెట్ లేదా సీటెట్‌లో అర్హత సాధించాలి. జూన్ 2, 2014 కంటే ముందుగా నిర్వహించిన ఏపీ టెట్‌లో అర్హత సాధించిన వారు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు డిగ్రీలో 45శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీలో గణితం, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, తమి ళం, మరాఠీ, సంస్కృతం సబ్జెక్టులుగా ఉంటాయి.

సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) క్యాడర్ పోస్టుల అర్హతలోనూ మార్పులుచేశారు. ఇంటర్‌లో కనీసం 50శాతం మార్కులతోపాటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సు పూర్తిచేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఇంటర్మీడియట్‌లో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. 2010 కంటే ముందుగా డీఎడ్ పూర్తిచేసిన వారు ఇం టర్‌లో 45శాతం మార్కులు పొందిఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 40 శాతం మార్కులుంటే చాలు. టీఎస్ టెట్ పేపర్ -1లో అర్హత సాధించాలి. జూన్ 2, 2014 కంటే ముందుగా నిర్వహించిన ఏపీ టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు కూడా ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.

🏋ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ క్యాడర్ పోస్టులకు ఇం టర్‌లో 50శాతం పాస్ పర్సంటేజీ తప్పనిసరి. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో యూజీ డిప్లొమా/ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పూర్తిచేసిఉండాలి.
-భాషాపండితుల క్యాడర్ పోస్టులకు డిగ్రీలో ఒక సబ్జెక్టుగా తెలుగు కచ్చితంగా ఉండాలి లేదా తెలుగు సాహిత్యంలో డిగ్రీ /తెలుగులో బ్యాచిలర్ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజీ/ పీజీలో తెలుగు చేసి ఉండాలి. వీటిలో 50శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 45 శాతం మార్కులుండాలి. బీఎడ్‌లో తెలుగు మెథడాలజీ పూర్తిచేసి ఉండాలి. టెట్‌లో కూడా కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలి.

💢20 మార్కుల వెయిటేజీ..
ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు టెట్‌లో అర్హత సాధించిన మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. టీఎస్‌టెట్/ఏపీటెట్/ సీటెట్‌లో అర్హత సాధించాలి. 150 మార్కుల టెట్‌లో ఓసీలకు 90 మార్కులు, బీసీలకు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ వారికి 60 మార్కులు ఉండాలి.


రేపు టీఎస్‌పీఎస్సీ భేటీ*

టీఆర్టీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) ద్వారా ఉద్యోగాల భర్తీకి వారం పదిరోజుల్లో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. గురువారం జరుగనున్న టీఎస్‌పీఎస్సీ సర్వసభ్య సమావేశంలో ఎంపిక విధానంపై చర్చించి తుది నిర్ణయం తీసుకొంటారని సమాచారం. టీచర్ల నియామకానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా టీఎస్‌పీఎస్సీకి అందిన తర్వాత వారంపాటు అంతర్గత ప్రక్రియ పూర్తిచేసి టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం 80ః20 కోటాను అనుసరించి 31 జిల్లాలవారీగా టీఆర్టీ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అపాయింట్‌మెంట్ అథారిటీగా డీఈఓలు ఉంటారు. ఎస్‌ఏ, ఎస్జీటీ, పండిట్ల పోస్టులకు మూడు వేర్వేరు పరీక్షలు నిర్వహిస్తారు.



Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

No comments:

Post a Comment