Labels

Sunday 15 October 2017

TS DSC 2017 - తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ నియామక నిబంధనలు- 2017

TS DSC 2017 - తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ నియామక నిబంధనలు- 2017
TS DSC 2017 - తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ నియామక నిబంధనలు- 2017

జీవో నెం: 25 తేదీ: 10.10.2017 ద్వారా విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ పోస్టుల ప్రత్యక్ష నియామక నిబంధనలు-2017
ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలల్లోని అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులకు వర్తిస్తాయి.
జిల్లా విద్యాశాఖాధికారే నియామకపు అధికారి
టిఎస్‌పిఎస్‌సి ద్వారా ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ, వ్రాత పరీక్ష నిర్వహణ
టిఎస్‌టెట్‌, సెంట్రల్‌ టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. (2.06.2014కంటే ముందు ఎపిటెట్‌ ఉత్తీర్ణులైన వారూ అర్హులే)
టెట్‌లో ఓసీ-90 మార్కులు, బిసీ- 75 మార్కులు, ఎస్‌సి/ఎస్‌టి/ విభిన్న సామర్థ్యాల వారికి 60 మార్కులు కనీసంగా నిర్ణయించారు.
ఉపాధ్యాయ నియామకాలను వ్రాత పరీక్షకు 80శాతం మార్కులు, టెట్‌ వెయిటేజీ 20శాతం మార్కులు.
వ్యాయామ ఉపాధ్యాయులకు టెట్‌ నుండి మినహాయింపు. వ్రాత పరీక్షకే 100 శాతం మార్కులు.
సంబంధిత సబ్జెక్టులో 50శాతం మార్కులతో డిగ్రీ లేదా పీజీ మరియు సంబంధిత మెథడాలజీతో బి.ఇడి. ఉత్తీర్ణులైన వారే స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు అర్హులు. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, విభిన్న సామర్థ్యాల అభ్యర్థులకు డిగ్రీ/ పిజీలో 45 శాతం మార్కులు చాలు.
ఎన్‌సిటిఇ నిబంధనల ప్రకారమే విద్యార్హతలు.
భాష, భాషేతర సబ్జెక్టులన్నింటికీ డిగ్రీ లేదా పోస్టుగ్రాడ్యుయేషన్‌తోపాటు సంబంధిత మెథడాలజీతో బి.ఇడి ఉత్తీర్ణులై ఉండాలి.
సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు ఇంటర్‌లో 50 శాతం మార్కులతో, బిసి, ఎస్‌సి, ఎస్‌టి, విభిన్న సామర్థ్యాల అభ్యర్థులకు 45 శాతం పాటు 2 సంవత్సరాల డిఎడ్‌ లేదా 4 సంవత్సరాల ఎలిమెంటరీ విద్యలో బ్యాచులర్‌ డిగ్రీ ఉన్నవారు అర్హులు.
 2007 సంవత్సరం కంటే ముందే 2 సంవత్సరాల డి.ఎడ్‌లో ప్రవేశం పొందిన వారికి ఇంటర్‌లో 45 శాతం మార్కులు సరిపోతాయి. బిసి, ఎస్‌సి, ఎస్‌టి, విభిన్న సామర్థ్యాల అభ్యర్థులకు 5శాతం సడలింపు వర్తిస్తుంది)
డిగ్రీ, బిపి.ఇడి. అర్హత కల్గిన వారికి డిగ్రీలో కనీస మార్కులు పేర్కొనలేదు.
భాషేతర సబ్జెక్టుల ఉపాధ్యాయ అభ్యర్థులు ఎస్‌ఎస్‌సి లేదా ఇంటర్‌ లేదా డిగ్రీలో సంబంధిత భాషా మాధ్యమంలో చదివిన వారు లేదా ఎస్‌ఎస్‌సిలో మొదటి భాషగాను, ఇంటర్‌/ డిగ్రీలో ద్వితీయ బాషగానూ చదివినవారే సంబంధిత మీడియంలో ఉపాధ్యాయులుగా ఎంపికకు అర్హులు.
ఏ మీడియంలో పోస్టుకు పోటీ పడదల్చుకున్నారో వ్రాత పరీక్ష (టిఆర్‌టి) ప్రశ్నాపత్రం కూడా సంబంధిత మీడియంలోనే ఉంటుంది.
ఎస్‌జిటిలు టెట్‌ పేపర్‌-1 ఉత్తీర్ణులు కావాలి.
స్కూల్‌ అసిస్టెంట్లు, భాషా పండితులు, టెట్‌ పేపర్‌-2 ఉత్తీర్ణత కావాలి.
భాషా పండితులు సంబంధిత భాషలో 50శాతం మార్కులతో, బిసి/ఎస్‌సి/ఎస్‌టి/ విభిన్న సామర్థ్యాల అభ్యర్థులకు 45 శాతం మార్కులు డిగ్రీ లేదా పీజీ అర్హతతోపాటు సంబంధిత మెథాడాలజీతో బి.ఇడి. లేదా పండిట్‌ ట్రైనింగ్‌ ఉత్తీర్ణులై ఉండాలి.
వ్యాయామ ఉపాధ్యాయులకు 50శాతం మార్కులతో ఇంటర్‌ మరియు వ్యాయామ విద్యలో డిప్లొమా లేదా డిగ్రీ, బి.పి.ఇడి
కలిగి ఉండాలి.
(ఎస్‌సి/ఎస్‌టి/బిసి అభ్యర్థులకు 5శాతం మినహాయింపులేదు)
2016 అక్టోబర్‌ 10న ఏర్పడిన కొత్త రెవెన్యూ జిల్లాల ప్రాతిపదిపక ఉపాధ్యాయ ఖాళీలను నిర్ణయించి పాఠశాల విద్యా డైరెక్టర్‌ సూచించిన మేరకు టిఎస్‌పిఎస్‌సి నియామక నోటిఫికేషన్‌ (ప్రకటన ) విడుదల చేస్తుంది.
షెడ్యూల్డ్‌ ఏజెన్సీ ప్రాంతంలో జీ.వో. నెం: 3, తేదీ: 10.01.2000 ప్రకారం ఉపాధ్యాయ పోస్టులన్నింటికీ స్థానిక గిరిజన అభ్యర్థులు మాత్రమే అర్హులు. మైదాన ప్రాంత పాఠశాలల్లో నియామకాలకు కూడా ఏజెన్సీ స్థానిక గిరిజనులు అర్హులు.
రాష్ట్ర ప్రభుత్వ సాధారణ సర్వీసు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సు నిర్ణయించబడుతుంది.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక అభ్యర్థుల రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఎస్‌సి, ఎస్‌టి, బిసి, విభిన్న సామర్థ్యాలు, మాజీ సైనికులు, మహిళల రిజర్వేషన్లు అన్ని రాష్ట్ర ప్రభుత్వ సాధారణ నిబంధనల ప్రకారం వర్తిసాయి.
వ్యాయామ విద్య స్కూల్‌ అసిస్టెంట్లు, పి.ఇటి.ల పోస్టులకు వికలాంగుల కోటా వర్తించదు.
ఖాళీ పోస్టులకు సమాన సంఖ్యలోనే ఉపాధ్యాయ అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది
నిరీక్షణ జాబితా (వెయిటింగ్‌ లిస్ట్‌) ఉండదు.
ఎంపికైన అభ్యర్థుల జాబితాను టిఎస్‌పిఎస్‌సి సంబంధిత నియామకపు అధికారికి పంపుతుంది. నియామకపు అధికారి, నియామక ఉత్తర్వులు ఇచ్చి కౌన్సెలింగ్‌ ద్వారా పాఠశాలలు కేటాయిస్తారు.
పాఠశాలల కేటాయింపుపై సవివరమైన మార్గదర్శకాలు ప్రభుత్వం విడిగా ఇస్తుంది.
ఉపాధ్యాయ నియమాకాలకు సంబంధించి 2009 జనవరి 23న విడుదల చేసిన జీవోలు 11, 12లలోని విద్యార్హతలను ఈ జీవో ద్వారా సవరించారు.

గత (2012) ఉపాధ్యాయ నియామక నిబంధనలతో పోలిస్తే సాధారణ విద్యార్హతలు, ఇంటర్‌, డిగ్రీలలో కనీసం మార్కులు (50 శాతం లేదా 45 శాతంస్త్ర నిర్ణయించడం, గిరిజన సంక్షేమ పాఠశాలలను నియామక ప్రక్రియ నుండి మినహాయించడం, కొత్త జిల్లాల వారీగా నియామకాలు చేయడం, పిజి అర్హతలున్నవారిని కూడా స్కూల్‌ అసిస్టెంట్‌, భాషాపండితుల నియమకానికి అర్హులుగా పేర్కొనడం కొత్త అంశాలు.

పీఈటీ అర్హతల్లో ఎన్‌సీసీకి విలువేదీ?*


రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులకు ప్రకటించిన అర్హతల్లో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ (పీఈటీ) అర్హతల్లో ఎన్‌సీసీ ప్రస్తావించలేదు. దీంతో ఎన్‌సీసీ ధ్రువపత్రాలు ఉన్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎన్‌సీసీ ధ్రువపత్రం పీఈటీ పోస్టులకు అర్హత కాదా?అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. బీపీఈడీ కోర్సులో ప్రవేశాలకు ఎన్‌సీసీ సీ ధ్రువపత్రం ఉన్నోళ్లు అర్హులేనని ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. ఇంకోవైపు గురుకుల విద్యాసంస్థల్లో ప్రకటించిన పీఈటీ పోస్టులకు ఎన్‌సీసీ ధ్రువపత్రం ఉన్నా అర్హులేనని ప్రకటించింది. కానీ విద్యాశాఖ మాత్రం ఎన్‌సీసీ ధ్రువపత్రాన్ని విస్మరించడం చర్చనీయాంశమైంది. పీఈటీ అర్హతల్లో ఎన్‌సీసీ చేసిన విలువేదని అభ్యర్థులు అడుగుతున్నారు. విద్యాశాఖ ఉద్దేశపూర్వకంగా ఎన్‌సీసీ ధ్రువపత్రం ఉన్న వారిని మినహాయించిందా? లేక ఏదైన సాంకేతిక కారణం ఉందా?అన్నది తెలియాల్సి ఉంది. ఎన్‌సీసీ ధ్రువపత్రం ఉన్న అభ్యర్థులు మాత్రం విద్యాశాఖ తీరుపై గుర్రుగా ఉన్నారు.*


టీచర్‌ పోస్టుల భర్తీ కొత్త జిల్లాల ప్రకారమే

ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై నెలకొన్న పలు ప్రశ్నలకు సమాధానం లభించింది. కొత్త జిల్లాల ప్రకారమే పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో త్వరలో చేపట్టబోయే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ 31 జిల్లాల ప్రకారం జరగనుంది. ప్రభుత్వం నిబంధనలను కూడా ఖరారు చేసి, మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం డీఎస్సీ పేరును టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ)గా పిలుస్తారు. గతంలో మాదిరిగానే జిల్లా యూనిట్‌గా నియామకాలు చేపట్టనుంది. పోస్టుల భర్తీకి అపాయింటింగ్‌ అథారిటీగా జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)ని నియమించింది.*

నియామక బాధ్యతలను టీఎ్‌సపీఎస్సీకి అప్పగించింది. ప్రభుత్వం అందించే ఖాళీల సంఖ్య ఆధారంగా టీఎ్‌సపీఎస్సీ నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. పరీక్షను ఏ పద్ధతిలో నిర్వహించాలనే నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం టీఎ్‌సపీఎస్సీకే అప్పగించింది. విధివిధానాలు వెలువడిన నేపథ్యంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి పది రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు టీఎ్‌సపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 8792 పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ టీఎ్‌సపీఎస్సీకి వివరాలు పంపించింది. 31 జిల్లాల ప్రకారం రోస్టర్‌ పాయింట్లు, రిజర్వేషన్ల వివరాలు విద్యాశాఖ ద్వారా అందాల్సి ఉంది. ఈ వివరాలన్నీ వస్తే పది రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు టీఎ్‌సపీఎస్సీ వర్గాలు తెలిపాయి.*

కాగా గురుకుల టీచర్‌ పోస్టుల మాదిరిగా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రాత పరీక్షలు కాకుండా.. ఒకే పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. గతంలో 150 మార్కులకు డీఎస్సీ ప్రశ్నాపత్రం ఇచ్చేవారు. ప్రస్తుతం ఎన్ని మార్కులకు ఇస్తారు?, సిలబస్‌ అంశాలు, టీఆర్‌టీ నోటిఫికేషన్‌ ఎప్పుడు జారీ చేస్తారనే అంశాలపై 12న టీఎ్‌సపీఎస్సీ నిర్ణయం తీసుకోనుంది.*

జిల్లాల సందిగ్ధానికి తెర

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రధానంగా ఒకే ఒక సమస్య అడ్డంకిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం 2016 అక్టోబరు 11న రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 31కి చేరింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టులను పాత జిల్లాల ప్రకారం చేయాలా? లేక కొత్త జిల్లాల ప్రకారం చేయాలా? అనే ప్రశ్న ఉత్పన్నం అయ్యింది. కొత్త జిల్లాల ప్రకారం చేస్తే న్యాయ సమస్యలు తప్పవనే వాదనలు వినిపించాయి. దీంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. దీనిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంది. ఎట్టకేలకు కొత్త జిల్లాల ప్రకారమే ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే కొత్త జిల్లాల ప్రకారం నిర్వహిస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురై భర్తీ ప్రక్రియ ఎక్కడ నిలిచిపోతుందోనని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.*

త్వరలో నోటిఫికేషన్‌!: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి నియామక నిబంధనలు ఖరారు కావడంతో ఇక నోటిఫికేషన్‌ విడుదల చేయడమే తరువాయిగా మారింది. ఇప్పటికే 8792 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ కూడా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు నోటిఫికేషన్‌ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. వీరి ఎదురుచూపులకు అనుగుణంగానే త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నిబంధనలు ఖరారు కాడంతో ఖాళీల జాబితా, నిబంధనల జాబితా ప్రభుత్వం టీఎ్‌సపీఎస్సీకి త్వరలోనే అందజేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి ఫైలు అందగానే నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు టీఎ్‌సపీఎస్సీ సిద్ధంగా ఉంది.*

నిబంధనల్లో ముఖ్యమైన అంశాలు...

కొత్త జిల్లాల ప్రకారమే టీచర్‌ పోస్టుల భర్తీడీఎస్సీ స్థానంలో టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ)గా పేరు మార్పు.*

జిల్లా యూనిట్‌గా నియామకాలు..*

అపాయింటింగ్‌ అథారిటీ డీఈవోనియామక బాధ్యతలు టీఎస్‌పీఎస్సీకి అప్పగింత.*

పరీక్ష విధానం టీఎస్‌పీఎస్సే నిర్ణయిస్తుంది. 80 మార్కులకు పరీక్ష నిర్వహించాలి.టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ.*

ఏపీ టెట్‌ను 2014-06-02 తేదీకి ముందు రాసిన వారి మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఏపీ టెట్‌ రాసి వారి మార్కులను పరిగణలోకి తీసుకోరు.*

ఎంపికైన జాబితాను టీఎస్‌పీఎస్సీ ఆయా జిల్లా అధికారులకు పంపించాల్సి ఉంటుంది.*

అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పులు లేవు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి. జనరల్‌ అభ్యర్థులు 50శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 45శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. దీంతో పాటే బీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇందులో కూడా జనరల్‌ అభ్యర్థులు 50శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 45 శాతం మార్కులు కలిగి ఉండాలి. దీంతో పాటే టీచర్‌ ఎలిజబిలిటీ టెస్ట్‌(టెట్‌)లో అర్హత సాధించాలి. ఇక సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ పరీక్షకు అభ్యర్థులు ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు డిప్లోమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ఉత్తీర్ణత అయి ఉండాలి. దీంతో పాటు టెట్‌లో అర్హత సాధించి ఉండాలి.


డీఎస్సీకి ‘కొత్త’ చిక్కులు

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నూతన జిల్లాలే ప్రాతిపదిక*

ప్రభుత్వ నిర్ణయంతో అభ్యర్థుల్లో ఆందోళన జిల్లాల విభజనతో సొంత జిల్లాలోనే స్థానికేతరులయ్యామని ఆవేదన*

పోస్టుల వారీ అర్హత నియమావళిపై ఇంకా రాని స్పష్టత*

నూతన జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో సాంకేతిక సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ఈ పోస్టులన్నీ జిల్లా స్థాయి పోస్టులు కావడంతో స్థానికత, స్థానికేతర ధ్రువీకరణలో ఇబ్బందులు ఎదురుకానున్నాయి. పూర్వజిల్లాలో స్థానికులైన వారంతా ఇప్పుడు కొత్త జిల్లాలో స్థానికేతరులు కానున్నారు. పూర్వ జిల్లాల ప్రాతిపదికన కాకుండా కొత్త జిల్లాలతో ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయాల్సి వస్తే నిరుద్యోగ అభ్యర్థులు నష్టపోయే ప్రమాదముందని విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అవసరమైతే ఎక్కువగా పోస్టుల్లేని జిల్లాలకు అవసరమైన పోస్టులను సృష్టించాలంటున్నాయి.*

మరోవైపు కొత్త జిల్లాల వారీగా పోస్టులను గుర్తించడం, రోస్టర్‌, రిజర్వేషన్లు, స్థానిక, స్థానికేతర పోస్టుల వివరాలపై పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో ఉద్యోగ ప్రకటనకు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నట్లు తెలిసింది.*


కొత్త జిల్లాలు కొన్నింటిలో ఆశించిన సంఖ్యలో పోస్టులు ఉండటం లేదని తెలుస్తోంది. పట్టణ జిల్లాల్లో ఆశావహుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ, అక్కడ పోస్టులు తక్కువగా ఉన్నట్లు సమాచారం. గ్రామీణ జిల్లాలో పుట్టినా చాలామంది గతంలో పట్టణ, జిల్లా కేంద్రాల్లో చదువుకున్నారు. జిల్లా విభజనతో వీరు ఇప్పుడు తమ సొంత జిల్లాలోనే స్థానికులవుతున్నారు. అందువల్ల గ్రామీణ జిల్లాలో పోస్టులున్నా వీరు స్థానికేతర కోటాలో పోటీపడాల్సిన పరిస్థితి తలెత్తనుంది. ప్రస్తుతం ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల కనీస వయసు 25 ఏళ్ల పైబడే ఉంటోంది. వీరు స్వగ్రామాల్లో ఉంటూ ప్రాథమిక విద్యను పూర్తి చేసి, మండల, జిల్లా కేంద్రాల్లో వసతిగృహాలు, సంక్షేమ పాఠశాలల్లో ఉంటూ హైస్కూల్‌ విద్య చదివారు. ఉద్యోగుల పిల్లలు పట్టణాల్లోనే విద్యను అభ్యసించారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం నాలుగో తరగతి నుంచి 10వ తరగతి వరకు కనీసం నాలుగేళ్లు ఎక్కడైతే చదివారో ఆ జిల్లాను స్థానికతగా తీసుకుంటారు. ఇప్పుడు వీరికి సాంకేతిక సమస్యలు రానున్నాయి.*

ఉదాహరణకు పూర్వ వరంగల్‌ జిల్లాలో ఓ విద్యార్థి మహబూబాబాద్‌లో పుట్టి అక్కడే ప్రాథమిక విద్య చదివాడు. ఐదో తరగతి నుంచి జిల్లా కేంద్రానికి వచ్చాడు. గతంలో అతని స్థానికత పూర్వ వరంగల్‌ జిల్లాగా ఉండేది. ఇప్పుడు వరంగల్‌ అర్బన్‌గా మారింది. ఇప్పుడు అక్కడ పోస్టులు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహబూబాబాద్‌లోపుట్టినప్పటికీ అక్కడి పోస్టులకు అతను దరఖాస్తు చేసే అవకాశం లేకుండా పోయింది.*

పూర్వజిల్లాలోస్థానికుడైనప్పటికీ అక్కడ స్థానికేతర కోటాలో 20 శాతం పోస్టులకు పోటీ పడాలి*

అంటేస్థానికత ధ్రువీకరణకూ ఇబ్బందులు జిల్లాలపునర్విభజననేపథ్యంలో అభ్యర్థుల స్థానికత ధ్రువీకరణకు ఇబ్బందులు పడేపరిస్థితి కనిపిస్తోంది.*

అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులయినప్పుడు పాఠశాల నుంచి తీసుకున్న స్టడీ సర్టిఫికెట్‌ (బోనాఫైడ్‌)లో పూర్వ జిల్లా పేరు ఉంది. ఇప్పుడు తీసుకోవాలంటే కొత్త జిల్లా కింద తీసుకోవాలి. ఈ స్టడీ సర్టిఫికెట్ల ప్రకారం.. ఆ అభ్యర్థి స్థానికత ఎవరు ధ్రువీకరించాలన్న విషయంపైనా ఇంకా స్పష్టత రాలేదు. ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగానికి ఈ బాధ్యతను అప్పగించాలని కొందరు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.*

ఈ మండలాల్లో మరీ ఇబ్బంది*

కొన్ని మండలాలు పూర్వ జిల్లా నుంచి ఏర్పడిన కొత్త జిల్లాలకు కాకుండా మరో జిల్లాలోకి వెళ్లాయి. ఇలాంటి మండలాలు, గ్రామాల పరిధిలోని అభ్యర్థుల పరిస్థితి మరీ గందరగోళంగా మారింది. వీరికి స్థానికత నిర్ణయించడం ఎలా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మరోవైపు నియామక పరీక్షకు సంబంధించిన విద్యార్హతల నియమావళిపై నిరుద్యోగుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.*

ఉపాధ్యాయుల పోస్టులకు పదిరోజుల్లో ప్రకటన*
ఉప  ముఖ్యమంత్రి కడియం వెల్లడి*
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పదిరోజుల్లో ఉపాధ్యాయుల పోస్టుల కోసం ప్రకటన(నోటిఫికేషన్‌) విడుదల చేయనుందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. బుధవారం హన్మకొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కడియం పాల్గొనగా.. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటికే 8792 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీకి అందజేసిందని చెప్పారు. పోస్టులకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయని, మరో పదిరోజుల్లో ప్రకటన విడుదల అవుతుందన్నారు. మారుమూల ప్రాంతాల అభ్యర్థులను దృష్టిలో పెట్టుకునే కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందన్నారు. రాష్ట్రం ఆవిర్భవించి 40 నెలలు అవుతోందని, కొత్త జిల్లాలు ఏర్పడి ఏడాది పూర్తయిందని ఈ క్రమంలో మెరుగైన పాలనతో ప్రజలకు దగ్గరయ్యామన్నారు. వరంగల్‌ గ్రామీణ జిల్లాలో ఏర్పాటు చేయనున్న టెక్స్‌టైల్‌ పార్కుకు ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారని కడియం చెప్పారు.*



Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

No comments:

Post a Comment