Labels

Monday 17 August 2020

difference between earned leave and paid leave

difference between earned leave and paid leave

అసాధారణ సెలవు (EOL) సంపాదిత సెలవు (EL) మధ్య వ్యత్యాసం:-


మౌలిక నిబంధనలోని 85(A) ప్రకారం ఏ  ఇతర అనుమతించదగిన సెలవు ప్రభుత్యోద్యోగి ఖాతాలో జమగా లేని సందర్భాలలో వ్రాతపూర్వకంగా దరఖాస్తు ద్వారా ప్రత్యేక పరిస్థితులలో మంజూరు చేయు సెలవును అసాధారణ సెలవు అందురు.

ఈ సెలవుకు జీతభత్యాలు అనుమతించరు

 అసాధారణ సెలవు వ్యక్తిగత అవసరాల దృష్ట్యా వాడుకుంటే 3 సంవత్సరాల వరకు పెన్షన్ కు అనుమతిస్తారు. ఆ పైన సెలవును నాన్-క్వాలిఫయింగ్ సెలవుగా పరిగణిస్తారు.

 ఈ సెలవు కాలంలో సమాన రోజులు వార్షిక ఇంక్రిమెంటు ముందుకు జరుగును. అదే అసాధారణ సెలవు వైద్య ధృవపత్రం పై వాడుకుంటే పెన్షన్ కు కలుస్తుంది. 6 నెలలకు మించిన సెలవును ఇంక్రిమెంటు మంజూరుకు అనుమతిస్తారు అయితే C&DSE గారి అనుమతి పొందాలి. 6 నెలలకు మించిన కాలమునకు ప్రభుత్వ అనుమతి పొందాలి.

 సస్పెన్షన్ పీరియడు కు అసాధారణ సెలవు మంజూరు అయిన సందర్భంలో మాత్రం ఆ EOL పీరియడ్ను ఇంక్రిమెంట్లకు, పెన్షన్ లెక్కించాల్సిందే. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం Sub-Rule (5) of FR-54 మరియు Sb-Rule (7) of FR-54 ను సవరిస్తూ... GO Ms No 307 Fin (FR.II) Dept. dated 03.12.2012 జారీ చేసింది.

 5 సంవత్సరాల సర్వీసు గల ప్రభుత్వోద్యోగులు ప్రభుత్వ అనుమతితో విదేశాలలో ఉద్యోగం చేయుటకు 5 సంవత్సరాల వేతనం లేని సెలవు వాడుకొనవచ్చును. ఈ కాలము 2,3 లేదాఅంతకన్నా ఎక్కువ దఫాలుగా వాడుకొనవచ్చును.
G.O.Ms.No.214 F&P తేది: 3.9.1996


 సంపాదిత సెలవు (EL):-

 సంపాదిత సెలవు గురించి APLR Rules-1933 లోని రూల్- 8,9,10,11,12,17 మరియు 20  లలో వివరించడం జరిగింది.

 సంపాదిత సెలవు డ్యూటీలోనూ మరియు లీవ్ కాలంలోనూ జమచేయవచ్చు.

 పర్మనెంట్ ఉద్యోగులకు సంవత్సరానికి 30 రోజులు, G.O.Ms.No.317 తేది: 15.9.1994 ప్రకారం  ఉపాధ్యాయులకు సంవత్సరానికి 6 చొప్పున మంజూరుచేస్తారు.

 ప్రతి అర్ధ సంవత్సరమునకు జనవరి 1న,జులై 1న 3 రోజుల చొప్పున EL ఖాతాకు జమచేయబడును.


 CLs,HPLs ఖాతాలో నిల్వలేని సందర్భాలలో ఉద్యోగ/ఉపాధ్యాయుల కు  ఒక్కరోజు కూడా EL మంజూరుచేసే అధికారం సంబంధిత DDO లకు కలదు.

 ఈ సెలవు గరిష్ట నిలువ పరిమితి 300 రోజులు మాత్రమే G.O.Ms.No.232 తేది: 16.9.2005

 ఇట్టి సంపాదిత సెలవును ఒకేసారి 180 రోజుల వరకు వాడుకొనవచ్చును. G.O.Ms.No.153 తేది: 4.5.2010

No comments:

Post a Comment