Labels

Saturday 19 May 2018

Teacher Transfers Telangana 2018 Guide Lines Dates Spouse Points

Teacher Transfers Telangana 2018 Guide Lines Dates Spouse Points

May / June 2018 లో టీచర్ల బదిలీలు:-
  • కసరత్తు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ. ఏ మేనేజ్‌మెంట్‌ వారికి ఆ మేనేజ్‌మెంట్‌లోనే బదిలీ
  • పాత జిల్లాల ప్రకారమే బదిలీలకు అవకాశం
  • అనంతరం కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగులు
  • కోర్టులో ఉన్న సర్వీసు రూల్స్‌ అంశం తేలాకే పదోన్నతులు
  • బదిలీల కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్న టీచర్లు
  • ఈసారి తప్పనిసరిగా చేపట్టాలని విజ్ఞప్తి
  • డిమాండ్ల పరిష్కారం కోసం టెన్త్‌ ‘స్పాట్‌’ బహిష్కరణకు నిర్ణయం
  • ఉపాధ్యాయ సంఘాలతో భేటీ కానున్న కడియం శ్రీహరి

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 1.30 లక్షల మంది టీచర్ల బదిలీలకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వం అంగీకరిస్తే మే నెలలోనే బదిలీలు చేపట్టేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఏకీకృత సర్వీసు రూల్స్‌పై స్పష్టత రాని నేపథ్యంలో ఏ యాజమాన్య పరిధిలోని టీచర్లను ఆ యాజమాన్య పరిధిలోనే బదిలీలు చేపట్టనుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించి మూడేళ్లు (2015 జూన్‌/జూలై) కావస్తోంది. ఈ నేపథ్యంలో 54 ఉపాధ్యాయ సంఘాలు ‘జాయింట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టీచర్స్‌ యూనియన్‌ (జేసీటీయూ)’గా ఏకమై బదిలీల డిమాండ్‌ను లేవనెత్తాయి. ఈసారి కచ్చితంగా టీచర్ల బదిలీలు చేపట్టాలని, ఏకీకృత సర్వీసు రూల్స్‌ను పరిష్కరించి పదోన్నతులు కల్పించాలని కోరాయి. మరోవైపు ఏడాది కింద కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న పండిట్, పీఈటీ అప్‌గ్రెడేషన్‌ విషయంలో.. వారికి పదోన్నతులు కల్పించి బదిలీలు చేయాల్సి ఉంది. ఇక కొత్తగా రానున్న 8,792 మంది ఉపాధ్యాయులకు జూన్‌/జూలై నెలల్లో పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ముందుగానే టీచర్ల బదిలీలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మేరకు మే నెలలో టీచర్ల బదిలీలను చేపట్టేందుకు విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది.

వేర్వేరుగానే బదిలీలు
ప్రస్తుతం ఏ మేనేజ్‌మెంట్‌ (ప్రభుత్వ, జిల్లా పరిషత్‌) టీచర్లను ఆ మేనేజ్‌మెంట్‌ పరిధిలోనే బదిలీ చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అన్ని మేనేజ్‌మెంట్ల టీచర్లను కలిపి సీనియారిటీ ఆధారంగా బదిలీలు చేసే పరిస్థితి లేదు. ఏకీకృత సర్వీసు రూల్స్‌కు రాష్ట్రపతి ఆమోదం లభించినా.. దానిని సవాలు చేస్తూ ప్రభుత్వ టీచర్ల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. విచారణలో ఉన్న ఈ కేసుకు ఇప్పట్లో పరిష్కారం లభించే పరిస్థితి కనిపించడం లేదని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో ఏ మేనేజ్‌మెంట్‌ వారికి ఆ మేనేజ్‌మెంట్‌ పరిధిలోనే బదిలీలు చేపడితే ఇబ్బందులు ఉండవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. పదోన్నతుల అంశాన్ని కూడా కోర్టు కేసు పరిష్కారమయ్యాక చూడవచ్చని భావిస్తున్నారు.

పోస్టింగ్‌ల కోసమైనా బదిలీలు చేపట్టాల్సిందే..
రాష్ట్రంలో 8,792 టీచర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే రాత పరీక్ష నిర్వహించింది. ఫలితాలను ప్రకటించి.. పోస్టింగులు ఇవ్వాల్సి ఉంది. సాధారణంగా విద్యాశాఖలో కొత్తగా టీచర్లుగా చేరే వారికి కేటగిరీ–4 ప్రాంతాల్లో పోస్టింగులు ఇస్తారు. ఈ లెక్కన చూసినా ముందుగా ప్రస్తుతమున్న టీచర్ల బదిలీలు చేపట్టాల్సిందే. లేకపోతే కొత్త వారికి పట్టణ ప్రాంతాల్లో పోస్టింగులు వచ్చి, సీనియర్‌ టీచర్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇందుకు సీనియర్‌ టీచర్లు అంగీకరించరు. కాబట్టి కొత్తవారికి పోస్టింగులు ఇవ్వడానికి ముందే.. బదిలీలు చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది.

Teacher Transfers Telangana 2018 Guide Lines Dates Spouse Points


ఆందోళనకు సిద్ధమైన ఉపాధ్యాయులు
బదిలీలు చేపట్టాలంటూ ఇప్పటికే టీచర్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఉపాధ్యాయ సంఘాల జాయింట్‌ కౌన్సిల్‌ తమ డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి జరగాల్సిన పదో తరగతి స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ను బహిష్కరిస్తామని కూడా ప్రకటించింది. దీంతో ఒకట్రెండు రోజుల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉపాధ్యాయ సంఘాలతో భేటీకానున్నట్టు సమాచారం. ఆ సమావేశంలో బదిలీల అంశంపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది.
వేసవి సెలవుల్లోనే ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ పూర్తయ్యేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి చెప్పారు. ఏకీకృత సర్వీస్ రూల్స్‌పై కోర్టు స్టే ఎత్తివేస్తే దానికనుగుణంగా బదిలీలు జరుగుతాయన్నారు. ఒకవేళ స్టే ఎత్తివేయకపోతే పాత పద్దతిలోనే బదిలీలు కొనసాగే అవకాశం ఉందన్నారు.మరోవైపు సీపీఎస్ ‌పై ఉద్యోగులకు నష్టం కలగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు.

గురువారం నాడు ఆయన వన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రవేశపెడుతుందని చెప్పారు.

Teacher Transfers Telangana 2018 Guide Lines Dates Spouse Points


సీపీఎస్ విధానం విషయంలో కొందరు రాజకీయ ఉద్దేశ్యంతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగులకు నష్టం వాటిల్లే విధంగా ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకోదని ఆయన చెప్పారు.

పాత జిల్లాల ప్రకారమే బదిలీలకు మొగ్గు!
టీచర్ల బదిలీని పాత జిల్లాల ప్రకారమే చేపట్టే అవకాశముంది. కొత్త జిల్లాలు ఏర్పాటైనా.. పాత జిల్లాల ప్రకారమే బదిలీలు చేపడతామని ప్రభుత్వం అప్పట్లోనే ఉపాధ్యాయ సంఘాలకు హామీ ఇచ్చింది. దీంతో పాత జిల్లాల ప్రకారమే బదిలీలు ఉండే అవకాశముంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని జనగామ ప్రాంతానికి చెందిన ఒకరు గతంలో భూపాలపల్లి జిల్లాలో టీచర్‌గా నియమితులయ్యారు. కొత్త జిల్లాల ప్రకారం చూస్తే.. ఆ టీచర్‌ ఇటీవల ఏర్పాటైన తన కొత్త జిల్లా పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. దీంతో ఒకసారి పాత జిల్లాల ప్రకారం బదిలీలు చేస్తే.. అలాంటి వారందరికీ ఉపశమనం కల్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు

ఉద్యోగుల బదిలీలకోసం ఏర్పాటుచేసిన అజయ్‌మిశ్రా కమిటీతో ఉద్యోగ జేఏసీ నాయకులు శుక్రవారం సమావేశమయ్యారు. శనివారం ఉపాధ్యాయసంఘాల నేతలతో చర్చించిన అనంతరం అజయ్‌మిశ్రా కమిటీ సీఎంకు నివేదిక ఇస్తుంది. సీఎం సూచనల ప్రకారం ప్రభుత్వ సీఎస్ మార్గదర్శకాలు విడుదలచేస్తారు. ఈ నెల 22న మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. 25 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించనున్నారు. ముందుగా టీచర్ల బదిలీలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల బదిలీల కమిటీ చైర్మన్ అజయ్‌మిశ్రాతోపాటు కమిటీ సభ్యులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు అధర్‌సిన్హా, శివశంకర్‌లు ఉద్యోగ జేఏసీ నేతలతో సమావేశమయ్యారు. బదిలీల ప్రక్రియమొత్తం పారదర్శకంగా ఉండాలని, అవినీతికి తావు ఇవ్వవద్దని ఉద్యోగ జేఏసీ చైర్మన్ కారం రవీందర్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. ఇదివరలో 20% మాత్రమే బదిలీలు చేసేవారని, ఆ నిబంధనను పరిగణనలోకి తీసుకోకుండా అర్హులైన ప్రతీ ఉద్యోగినీ బదిలీచేయాలని కోరారు. శాఖలవారీగా బదిలీలకు అర్హులైనవారి జాబితాలు రూపొందించాలని, ప్రాధాన్య క్రమంలో బదిలీలు చేపట్టాలని సెక్రటరీ జనరల్ మమత కోరారు.

ఒకేస్థానంలో ఎక్కువకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వారు కోరుకున్న చోటుకు బదిలీ చేయాలని, కౌన్సిలింగ్ నిబంధనల ప్రకారం స్థానచలనం చేయాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఏ పద్మాచారి విజ్ఞప్తి చేశారు. మారుమూల ప్రాంతాల్లో చాలాకాలంగా పనిచేస్తున్నవారిని బదిలీచేయాలని, అదేవిధంగా మారుమూల ప్రాంతాలకు బదిలీ అయ్యేవారి సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీఎన్జీవో ప్రధానకార్యదర్శి మామిండ్ల రాజేందర్, తెలంగాణ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పీ మధుసూదన్‌రెడ్డి, టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, తెలంగాణ నాలుగోతరగతి సంఘం కార్యదర్శి ఖాదర్, టీఎన్జీవో సహఅధ్యక్షుడు మందడి ఉపేందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పవన్‌కుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు.


Updates within few days.................

No comments:

Post a Comment