Labels

Wednesday 25 April 2018

మెడికల్ ఇన్వాలిడేషన్

మెడికల్ ఇన్వాలిడేషన్


అనారోగ్య కారణంగా పదవీ విరమణ పొందు ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణకు కనీసం 5 సంవత్సరాల సర్వీసు కలిగియుండి,ఉద్యోగి కుటుంబానికి ఎటువంటి జీవనాధారము లేని తీవ్ర,దుర్భర ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినచో నియామకాధికారి సంతృప్తి చెందిన మీదట కొన్ని షరతులకు లోబడి ఉద్యోగి కుటుంబ ఆధారితులకు కారుణ్య నియామకము చేస్తారు.
(G.O.Ms.NO.504,GAD తేది:30-4-1980)
(G.O.Ms.NO.309,GAD తేది:04-07-1985)
(A.P Pension code volume-I,Article-441)

తదుపరి ఒక కేసులో రాష్ట్రఉన్నతస్థాయి న్యాయస్థానం అట్టి కారుణ్య నియమకాలు రాజ్యంగ విరుద్దమని తీర్పు వెలువరించిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఇన్వాలిడేషన్ పై కారుణ్య నియామకాల పద్దతిని రద్దుపరచింది.

భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుమేరకుప్రభుత్వం మరలా మెడికల్ఇన్వాలిడేషన్ పై  ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల పద్దతిని మరలా పునరుద్దరించింది.(G.O.Ms.No.661 GAD తేది:23-10-2008)

ఎవరు అర్హులు:
కుటుంబ సభ్యులు అనగా AP Revised Pension Rules 1980 లోని రూలు 50(12B)లో నిర్దేశించిన వారై ఉండాలి.

భార్య/భర్త, కుమారులు,కూతుళ్ళు , చట్టరిత్యా దత్తత తీసుకున్న కుమారుడు/కూతురు, అట్టి దత్తత రిటైర్మెంటుకు ముందుగా తీసుకునియుండాలి.

అవివాహిత కూతురు,విధవరాలైనకూతురు,విడాకులు పొందిన కూతురు.

మెడికల్ ఇన్వాలిడేషన్ నిబంధనలు*
మెడికల్ ఇన్వాలిడేషన్  కోరు ఉద్యోగి నియామకాధికారికి దరఖాస్తు చేసుకోవాలి.

సదరు దరఖాస్తు మెడికల్ బోర్డు సిఫార్సులనిమిత్తం పంపబడుతుంది.

 జూనియర్ అసిస్టెంట్, తత్సమానమైన పోస్టు అంతకంటే తక్కువైన పోస్టులో నియామకం చేయవచ్చు.
(G.O.Ms.No.35 తేది:10-04-2000)


మెడికల్ ఇన్వాలిడేషన్ పై ఉద్యోగి రిటైరైన తేదినుంచిఒక సంవత్సరం లోపల ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలి.

నియామక ఉత్తర్వులు జారీచేసిన తర్వాత,అభ్యర్ధికి సంబంధించిన అన్ని వివరములుఎంప్లాయిమెంట్ కార్యాలయానికి తెలియజేయాలి.

మెడికల్ బోర్డు నివేదిక  అందిన తర్వాత ఉద్యోగిని  నియామక అధికారి జిల్లాస్థాయి కమిటీ వారి పరిశీలనార్ధం పంపాలి.

జిలాస్థాయి కమిటీ:
1.జిల్లా కలెక్టర్-అధ్యక్షుడు(CHAIRMAN)
2.జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి-సభ్యుడు
3.సంబంధిత జిల్లా శాఖ అధికారి-సభ్యుడు/కన్వీనర్

శాఖధిపతి(Head of the Department)కార్యాలయాలలో పనిచేయు ఉద్యోగులు/సెక్రటేరియేట్ శాఖాలలో పనిచేయు ఉద్యోగుల విషయంలో రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలిస్తుంది

మెడికల్ ఇన్వాలిడేషన్ పథకం క్రింద,కారుణ్యనియామకాలు,యూనిట్ నియామకాల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలలో 5 % మించకూడదు.


భార్య,భర్తలిరువురు ఉద్యోగులైన సందర్భములో కారుణ్య నియామకానికి అవకాశము లేదు.*

 మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీము జిల్లాపరిషత్,మున్సిపల్,ఎయిడెడ్ టీచర్లకు వర్తింపచేసారు.   మెడికల్ ఇన్వాలిడేషన్(అనారోగ్య కారణాలపై)వైద్య ధ్రువపత్రము ద్వారా రిటైర్ అయిన వారికి పెన్షన్,కమ్యూటేషన్ అవకాశములేదు.

మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగికి ఇన్వాలిడు పింఛను ఇస్తారు

ఏ జబ్బుల వల్లమెడికల్ ఇన్వాలిడేషన్ పై  రిటైరు కావచ్చు*
క్రింద తెలిపిన ఏదేని జబ్బులు రోగ పీడితులుగా ఉన్న ఉద్యోగి మెడికల్ఇన్వాలిడేషన్ పై మెడికల్ బోర్డు నిర్థారణ సర్టిఫికేట్ ఆధారంగా,మెడికల్ ఇన్వాలిడేషన్ పై రిటైరు కావచ్చును.

1.పక్షవాతము(PARALYSIS):            
A)నాలుగు అవయవములు-కాళ్ళు,చేతులు
B)ఒకవైపు పై భాగము లేదా,క్రింది భాగము
C)క్రింది భాగము రెండు అవయవములు లేదా/అంగములు

అంతిమదశలో ఉన్న మూత్రపిండముల రోగము(END STAGE RENAL DISEASE)

అంతిమదశలో ఉన్న కాలేయ రోగము(END STAGE LEVER DISEASE)

క్యాన్సరు(CANCER WITH METASTASIS STAGE OR SECONDARIES)

మానసిక సంబంధితము(DEMENTIA-MENTAL DISORDER)

తీవ్రమైన పార్కిన్సన్ జబ్బు(SEVERE PARKINSON DISEASE)

మెడికల్ ఇన్వాలిడేషన్  విషయంలో కమిటీకి పంపవలసిన వివరములు*

GOVT MEMO.NO.10054/K2/2009 తేది:05-09-2009 ప్రకారం_

1.మెడికల్ ఇన్వాలిడేషన్ కోరు ఉద్యోగి పేరు:
2.ఉద్యోగి పనిచేస్తున్న శాఖ-హోదా-జీతపు స్కేలు:
3.ఏదైనా క్రమశిక్షణా చర్యలు అపరిష్క్రుతంగాఉన్నాయా:
4.ఉద్యోగి సర్వీసు క్రమబద్దీకరించబడిందా:
5.సర్వీసు రిజిస్టరు మేరకు పుట్టిన తేది:
6.వాస్తవంగా కాలపరిమితిమేరకు పదవీవిరమణ  చేయు తేది:
7.రోగ వివరములు:
8.అట్టి రోగము ప్రభుత్వ ఉత్త్ర్వులు G.O.Ms.No.661, తేది:23-10-2008 లో తెలిపిన మేరకు కలిగియున్నదా:
9.ఉద్యోగి రోగ చికిత్స నిమిత్తం అతను/ఆమె మెడికల్ సెలవుపై ఉన్నారా,అయితే ఏ తేదినుంచి  అట్టి సెలవుపై అట్టి             రోగ చికిత్స నిమిత్తం ఉన్నారు:

10.మెడికల్ బోర్డు వారి సిఫార్సులు(ORIGINAL) సిఫార్సు జతపరిచారా:

11.శాఖాపర విశ్లేషణ-సిఫార్సు

No comments:

Post a Comment