Labels

Sunday 27 August 2017

బదిలీలు ఎందుకు? ఏమిటి ఈ రూల్ నెం. 2(vii)

బదిలీలు ఎందుకు? ఏమిటి ఈ రూల్ నెం. 2(vii)


ఏ డిపార్ట్మెంట్లోనైనా ఒకే స్థానంలో కొంత కాలం పనిచేసిన తర్వాత ఉద్యోగికి బదిలీ తప్పనిసరి. మన దృష్టిలో బదిలీ అంటే మనకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళడం కావొచ్చు. కానీ బదిలీ ఎందుకు తప్పనిసరి అంటే – ఒక ఉద్యోగి ఒక స్థానంలో అధిక కాలం పనిచేసిన తరువాత అక్కడి స్థానికులతో ఏర్పడే *పరిచయాల వల్ల తన పలుకుబడితో అక్కడి ఆఫీసును చెప్పుచేతల్లో ఉంచుకోవడం, దాని కార్యకలాపాలను నియంత్రించడం జరగవచ్చు*. అంతెందుకు, చివరకు పాఠశాలలో పనిచేసే స్థానిక ఉపాధ్యాయులు తమ స్థానిక పరిచయాల వల్ల మిగతా అందిరికన్నా పవరఫుల్ కదా. అందువల్లే కొంత కాలం అయిన తరువాత ఉద్యోగిని తప్పని సరిగా బదిలీ చేస్తారు.

ఒకసారి G.O. Ms. No. 31 లొ రూల్ నెం. 2(vii) ని చూద్దాం: “The number of years of service completed *in a particular school, in a particular cadre* should be taken into consideration”
అనగా ప్రస్తుత బదిలీ ఉత్తర్వులలో విచిత్రంగా ఒక ఉపాధ్యాయుడు *ఒక పాఠశాలలో* అది కూడా *ఒక కేడర్ లొ* పనిచేసిన కాలం 8 సం.లు దాటితేనే బదిలీ అనివార్యం అట. 

అంటే –
1. *వివిధ కేడర్లలో ఒకే స్కూల్లో 8 సం.లు మించి పనిచేసిన పరవాలేదా?* (ప్రమోషన్ లొ కూడా అదే స్కూల్ కోరుకోవడం వల్ల)
2. *ఈ బదిలీలో అదే పంచాయతిలో మరో స్కూల్ కోరుకున్నను పరవాలేదా?*

_*ఎందుకు గతంలో లేని ఈ కొత్త నిబంధనలు?*_

ఉదాహరణకు, ఒక ఉపాధ్యాయుడు ఒక పాఠశాలలో 8 సం.లు సర్వీసు పూర్తిచేసి ప్రస్తుత బదిలీల్లో మరలా అదే పంచాయతిలో ఇంకొక స్కూల్ కోరుకోవచ్చు (ప్రస్తుత నిబంధనల ప్రకారం). తరువాత సంవత్సరం జరగబోయే బదిలీల్లో మరలా పాత నిబంధననే అమలు చేయదలిస్తే, ఆ పంచాయతిలో 8 సం.లు దాటినందుకు ఈ ఉద్యోగి మళ్లీ బదిలీకి గురవుతాడు కదా. మరి అలాంటప్పుడు, ఈ నిబంధనను ఇప్పుడే మార్చడం అవసరం కదా. అంతేకాక కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వడం సరైనదే కదా. మరి *FAPTO-JACTO ఇచ్చిన రిప్రజెంటేషన్ లో ఎందుకు ఈ పాయింట్ చేర్చలేదని ఉపాధ్యాయ లోకం ప్రశ్నిస్తుంది.*
Please make this post viral

No comments:

Post a Comment