Labels

Wednesday 19 October 2016

ఉపాధ్యాయ MLC ఎన్నికలకు సంబంధించి క్రింది సందేహాలకు సమాధానాలు

 ఉపాధ్యాయ MLC ఎన్నికలకు సంబంధించి క్రింది సందేహాలకు  సమాధానాలు

   (అ) పదవీ విరమణ చెందిన ఉపాధ్యాయులు ఓటరు నమోదుకు అర్హులేనా?
సమా: అవును. అయితే  1-11-2013 తర్వాత పదవీ విరమణ చెంది ఉండాలి. ఇటువంటి వారు తాము చివరిగా పనిచేసిన సంస్థ అధిపతి  నుండి సర్టిఫికేట్ జతచేస్తే  సరిపోతుంది
  (ఆ) నల్లగొండ జిల్లాలో పనిచేస్తూ,హైదరాబాద్ జిల్లాలో నివాసం ఉన్న ఉపాధ్యాయుడు ఏ జిల్లాలో  నమోదుకు అర్హుడు ?
సమా: ఉపాధ్యాయులు తమ నివాసం ప్రకారం నమోదు చేయించు కోవాలి. ఆ ప్రకారం   హైదరాబాద్ జిల్లాలో  నమోదుకు అర్హుడు
(చూడుడు Hand Book For Electoral Registration Officers లోని పేరా 20.1మరియు  memo No: 3056/Elecs-E/A3/2016-1 Dtd: 29-9-2016 of CEO of AP & T, Hyderabad లోని పేరా xi)
(ఇ) కేంద్రీయ విద్యాలయాల్లో 8,9,10 తరగతులు భోధించని ఉపాధ్యాయులు ఓటరు నమోదుకు అర్హులేనా?
సమా: అవును అర్హులే.( Hand Book For Electoral Registration Officers లోని పేరా 37)
(ఈ) 1-11-2010 మరియు  01-11-2016 మధ్య  రెండు ఉన్నత పాటశాలలలో పనిచేసిన ఉపాధ్యాయులు రెండు సర్వీసు  సర్టిఫికేట్లు జతచేయాలా?
సమా: అవును రెండు ఉన్నత పాటశాలల నుండి విడి విడి సర్వీసు  సర్టిఫికేట్లు జతచేయాలి ( చూడుడు Memo No: 3056/Elecs-E/A3/2016-1 Dtd: 29-9-2016 of CEO of AP & T, Hyderabad లోని పేరా xiv).
(ఉ) ఓటరు నమోదుకు అడ్రస్సు రుజువు ఏదైనా జతచేయాలా?
సమా :  తప్పనిసరి గా జతచేయాల్సిన పత్రాల్లో అడ్రస్సు రుజువు పత్రం లేదు కానీ, జతచేస్తే మంచిది.
(ఊ) ఉపాధ్యాయులు  పనిచేసే చోట  నివాసం ఉండాలి కదా? ఇప్పడు వేరే చోట నివాసం ఉన్నట్లు చూపడం వల్ల, ఉత్తరోత్రా  సమస్యలేమైనా వస్తాయా?
సమా: లేదు. ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే సాదారణ ఎన్నికలలో  (అసెంబ్లీ/పార్లమెంటు ), ఆదార్ కార్డు లో  కూడా ప్రస్తుతం నివాసం ఉండే అడ్రస్సు ఇచ్చి ఉంటారు. ఇప్పటివరకు ఏ సమస్య రాలేదు కదా?
(ఋ)  IIIT, పండిత ట్రైనింగు కళాశాల, ప్రభుత్వ మ్యూజిక్ మరియు డాన్సు స్కూళ్ళలో పనిచేసే ఉపాధ్యాయులు నమోదుకు అర్హులేనా?
సమా: అవును (వీటి స్థాయి సెకండరీ పాటశాల కంటే ఎక్కువ కనుక, చూడుడు  (G.O Ms No: 537 GAD Dt: 28-9-2006)
(ఋ)  ఓటర్ కార్డు (EPIC) లో అడ్రస్, ప్రస్తుత అడ్రస్ వేరే రకంగా ఉన్నది, ఏ అడ్రస్ ప్రకారం  నమోదు చేయించాలి?
సమా: ఉండవచ్చు. EPIC కార్డు కేవలం ఫోటో link up చేయడానికే. ప్రస్తుత అడ్రస్ ప్రకారం  నమోదు చేయించండి
         

No comments:

Post a Comment