Labels

Sunday 10 December 2017

Health Card EHS ఎవరు అర్హులు?

Health Card EHS ఇహెచ్‌ఎస్‌ అంటే ఏమిటి?

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 'ది ఆంధ్ర ప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ మెడికల్‌ అటెండెన్స్‌ రూల్స్‌, 1972' క్రింద ప్రస్తుతం వున్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ సిస్టమ్‌లో భాగంగా ఆరోగ్య శ్రీ ఆరోగ్య రక్షణ ట్రస్ట్‌ క్రింద నమోదయిన ఆసుపత్రుల నెట్‌వర్క్‌ ద్వారా నగదు రహిత చికిత్సలను అందించేందుకు ఉద్దేశించినది ఉద్యోగుల ఆరోగ్య పథకం. (ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ - ఇహెచ్‌ఎస్‌).

5 డిసెంబర్‌ 2013వ తేదీన ప్రారంభించిన ఈ పథకాన్ని జి.ఓ. ఎంఎస్‌. నెంబర్‌ 134 హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (1.1) డిపార్ట్‌మెంట్‌, డేటెడ్‌ 29.10.2014 ప్రకారం మార్పులతో ఈ పథకం ప్రస్తుతం అమలు అవుతోంది.
జాబితాలో పేర్కొన్న అన్ని రకాల చికిత్సలకు ఎంపానెల్డ్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నుంచి నగదు లేని చికిత్సలను లబ్ధిదారులు పొందవచ్చు. మరింత సమాచారం కోసం www.ehf.gov.in  వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
 Health Card  EHS ఎవరు అర్హులు?

Healthcard ఎవరు అర్హులు?

  • ఎ)ఎఫ్‌ఆర్‌లో నిర్వచించిన అందరు రెగ్యులర్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రొవిన్షియలైజ్డ్‌ వర్క్‌ ఛార్జ్‌డ్‌ ఉద్యోగులతో సహా
  • బి) స్థానిక సంస్థల ప్రొవిన్షియలైజ్డ్‌ ఉద్యోగులు
  • సి) అందరు సర్వీస్‌ పింఛనుదారులు
  • డి)కుటుంబ పింఛనుదారులు
  • ఇ) తిరిగి ఉద్యోగం పొందిన సర్వీసు పింఛనుదారులు
  • ఎవరు అర్హులు కాదు?
  • ఎ)సిజిహెచ్‌ఎస్‌, ఇఎస్‌ఐఎస్‌, రైల్వేలు, ఆర్‌టిసి, పోలీసు శాఖకు చెందిన ఆరోగ్య భద్రత, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సయిజ్‌ శాఖకు చెందిన ఆరోగ్య సహాయతల వంటి ఇతర బీమా పథకాలు వర్తించే వారు
  • బి) లా ఆఫీసర్స్‌ (అడ్వొకేట్‌ జనరల్‌, స్టేట్‌ ప్రాసిక్యూటర్స్‌, స్టేట్‌ కౌన్సెల్స్‌, ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్‌ ప్రొసిక్యూటర్లు
  • సి) క్యాజువల్‌, దినసరి వేతనంపై పనిచేసే కార్మికులు
  • డి) దత్తత తీసుకొన్న తల్లిదండ్రులు జీవించివుండగా, జన్మనిచ్చిన తల్లిదండ్రులు
  • ఇ) AIS officers and AIS pensioners and
  • జి) జ్యుడిషియల్‌ అధికారులు

కుటుంబ సభ్యులు అంటే ఎవరు?

  • ఎ) భార్య లేదా భర్త
  • బి) పూర్తిగా ఆధారపడిన పిల్లలు (దత్తత తీసుకొన్న పిల్లలతో సహా)
  • సి) పూర్తిగా ఆధారపడిన తల్లిదండ్రులు (దత్తత తీసుకొన్న లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రులు; కాని ఇద్దరికీ కాదు)
  • డి) సర్వీసు పింఛనుదారుల తరహాలోనే కుటుంబ పింఛనుదారులపై ఆధారపడిన వారు కూడ అర్హులు
ఆధారపడటం అంటే?

  • ఎ) తమ జీవనోపాధి కోసం పూర్తిగా ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు
  • బి) నిరుద్యోగులైన కుమార్తెల విషయంలో వారు అవివాహితులు లేదా వైధవ్యం పొందిన వారు లేదా విడాకులు తీసుకొన్న వారు లేదా వదిలిపెట్టబడిన వారు (వయస్సు పరిమితి ఆంక్షలు లేవు) అయి వుండాలి.
  • సి) నిరుద్యోగులైన కుమారులు 25 సంవత్సరాల లోపు వయస్సు వారై వుండాలి.
  • అంకం సతీష్ కుమార్
  • డి) వికలాంగులైన పిల్లల విషయంలో ఆ వైకల్యం వారి ఉపాధికి అవరోధంగా వుండాలి.
న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్లీడర్లు, స్టాండింగ్‌ కౌన్సెల్స్‌ అర్హులా?

కాదు, లా ఆఫీసర్లు, జ్యుడిషియల్‌ ఆఫీసర్లకు ఈ పథకం వర్తించదు.

ఉద్యోగి తల్లిదండ్రులకు ఆరోగ్యశ్రీ కార్డు వుంటే, వారు ఈ పథక ప్రయోజనాలకు అర్హులా?

  • ఆరోగ్య శ్రీ కార్డు (తెల్ల కార్డు)ను కేవలం బిపిఎల్‌ కుటుంబాలకు మాత్రమే ఇస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు తమ జీవిక కోసం పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడివుంటే, వారి తెల్ల రేషన్‌ కార్డును రద్దు చేసి, పేదలకు ఉద్దేశించిన ప్రయోజనాలను పొందుతున్నందుకు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలను తీసుకొంటారు. తల్లిదండ్రులు స్వతంత్రంగా జీవిస్తూ, ఆరోగ్య శ్రీ కార్డు కలిగివుంటే వారికి అర్హత వుండదు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో వారిని ఉద్యోగి చేర్చకూడదు.
  • తెల్ల రేషన్‌ కార్డు కలిగిన ఉద్యోగి తల్లిదండ్రులను లబ్దిదారులుగా చేర్చివుండి, ఉద్యోగి వారి పేర్లను దరఖాస్తు నుంచి తొలగించాలంటే ఏం చేయాలి?
  • తెల్ల రేషన్‌ కార్డు కలిగిన తల్లిదండ్రులను లబ్దిదారులుగా చేర్చివున్నట్లయితే, ఆ ఉద్యోగి వారి పేర్లను తొలగించేందుకు ఇహెచ్‌ఎఫ్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. లేదా దరఖాస్తు నుంచి వారి పేర్లను తొలగించేందుకు సంబంధిత డిడిఓను సంప్రదించాలి.

ఉద్యోగి / పింఛనుదారుల అత్తమామలు అర్హులా?

  • కాదు. ఉద్యోగి / పింఛనుదారుల అత్తమామలు అర్హులు కాదు.
  • సవతి పిల్లలు ( స్టెప్‌ చిల్డ్రన్‌ ) ఇహెచ్‌ఎస్‌ సదుపాయానికి అర్హులా?
  • అవును. జి.ఓ. ఎంఎస్‌. నెం. 174, హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (ఎం2) డిపార్ట్‌మెంట్‌, తేదీ 01.11.2013 ప్రకారం స్టెప్‌ చిల్డ్రన్‌ ఇహెచ్‌ఎస్‌ ప్రయోజనాలకు అర్హులు.
  • దత్తత తీసుకున్న పిల్లలు లేదా దత్తత తీసుకొన్న తల్లిదండ్రులకు పథకం వర్తిస్తుందా?
  • అవును. దత్తత తీసుకొన్న తల్లిదండ్రులు లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రులలో ఎవరో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది కానీ అందరికీ కాదు. అదే విధంగా దత్తత తీసుకొన్న పిల్లలకు కూడ వర్తిస్తుంది.
నిరుద్యోగిగా వున్న కుమారుడు 25 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కూడ ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తుంటే, అతడు పథక ప్రయోజనాలకు అర్హుడా?

  • కాదు. కుమారుడికి 25 సంవత్సరాలు దాటిన పథక ప్రయోజనాలు పొందేందుకు అనర్హుడు అవుతాడు. ఉద్యోగి / పింఛనుదారుడిపై ఆధారపడిన కుమారుడు వికలాంగుడై, ఆ వైకల్యం అతడి ఉపాధికి అవరోధంగా వుంటే, పథక ప్రయోజనాలు అతడికి వర్తిస్తాయి. అయితే వైకల్య ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి.

భార్యాభర్తల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా వుండి, వేరొకరు ప్రైవేటు లేదా ఇతర వైద్య బీమా పథకం క్రింద వుంటే, వారు అర్హులా?

  • అవును. కుటుంబ సభ్యులైన ఆమె / అతడిని పథక లబ్ధిదారుగా చేర్చవచ్చు. అయితే వారికి సిజిహెచ్‌ఎస్‌, ఇఎస్‌ఐఎస్‌, రైల్వే, ఆర్‌టిసి, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత వర్తిస్తుంటే, ఇహెచ్‌ఎస్‌ ప్రయోజనాలను పొందటానికి వీలులేదు.
  • ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత పథకం వర్తించే ఉద్యోగులు ఇహెచ్‌ఎస్‌ క్రింద నమోదుకు అర్హులా?
  • కాదు. ఉద్యోగిగా అతడు / ఆమె కి ఇహెచ్‌ఎస్‌ వర్తించదు. అయితే పదవీ విరమణ తర్వాత సర్వీస్‌ పెన్షనర్లు, కుటుంబ పింఛనుదారులకు పథక ప్రయోజనాలు వర్తిస్తాయి.
రాష్ట్రం వెలుపల నివసిస్తున్న పింఛనుదారులకు పథక ప్రయోజనాలు వర్తిస్తాయా?

  • ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు.
  • నమోదు
  • ఇహెచ్‌ఎస్‌లో ఉద్యోగిగా ఎలా నమోదు కావాలి?
  • ఉద్యోగి నమోదు అయ్యేందుకు ప్రత్యేక నమోదు ప్రక్రియ ఏమీ లేదు. డిడిఓలు సిఎఫ్‌ఎంఎస్‌ క్రింద ఆర్థిక శాఖకు సమర్పించిన ఉద్యోగుల డేటా (ఆధార్‌ డేటా సహా)ను ఆరోగ్యశ్రీ ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్‌కు అందజేయటం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఇహెచ్‌ఎస్‌ పోర్టల్‌లో వుంచిన కార్డులను డౌన్‌లోడ్‌ చేసి, ప్రింట్‌ చేసుకొని ఉద్యోగి, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉపయోగించుకోవచ్చు.
ఇహెచ్‌ఎస్‌లో పింఛనుదారుగా ఎలా నమోదు కావాలి?
  • ఎ) www.ehf.gov.in. వెబ్‌పోర్టల్‌లోకి లాగిన్‌ కావాలి.
  • బి) మీ యూజర్‌ నేమ్‌ p + STO ID + PPO ID ఉదా : మీ ఎస్‌టిఓ ఐడి 230, పిపిఓ ఐడి 012 అయితే మీ యూజర్‌ నేమ్‌ = p230012 అవుతుంది. మీ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లను ఎస్‌టిఓ / ఎపిపిఓల నుంచి లేదా '104'కు ఫోన్‌ చేయటం ద్వారా 104 - సేవాకేంద్రం నుంచి పొందవచ్చు.
  • సి) యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లతో సైన్‌ ఇన్‌ అయిన తర్వాత దరఖాస్తును సమర్పించవచ్చు.
  • ట్రస్ట్‌ ఆమోదించిన తర్వాత మీకు ఆరోగ్య కార్డు లభిస్తుంది. ఇహెచ్‌ఎస్‌ జాబితాలో పేర్కొన్న ఎంపానెల్డ్‌ ఆసుపత్రులు, స్పెషాలిటీస్‌ ప్రకారం కార్డుదారులు పథక ప్రయోజనాలను పొందవచ్చు.
ఇహెచ్‌ఎస్‌లో నమోదు అయ్యేందుకు ఆధార్‌ కార్డు లేదా ఎన్‌రోల్‌మెంట్‌ స్లిప్‌ తప్పనిసరిగా కావాలా?
  • అవును. ఆధార్‌ కార్డు ఎన్‌రోల్‌మెంట్‌ నెంబరు వున్నా, ఇహెచ్‌ఎస్‌లో ఎన్‌రోల్‌ కావచ్చు. దరఖాస్తు ఫారంలో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నెంబరును ఏ విధంగా వ్రాయాలో సూచించటం జరిగింది.
పింఛనుదారు పథకం క్రింద నమోదు కాకపోతే, వారు పథకం కోసం కంట్రిబ్యూట్‌ చేయాలా?
  • అవును. జిఓ ఎంఎస్‌ నెంబరు 134, హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (1.1) డిపార్ట్‌మెంట్‌, తేదీ 29.10.2014 ప్రకారం పథకం క్రింద ఉద్యోగి నమోదు అయ్యారా లేదా అనే దానితో సంబంధం లేకుండా 01.12.2014న చెల్లించే నవంబర్‌ పింఛను, ఆ తర్వాత పింఛన్ల నుంచి ఆటోమాటిక్‌గా ఎస్‌టిఓ /ఎపిపిఓలు కంట్రిబ్యూషన్‌ను మినహాయిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి / పింఛనుదారు ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి / పింఛనుదారు అయిన తన భర్త / భార్యను ఆధారపడిన కుటుంబ సభ్యులుగా నమోదు చేసినప్పుడు, ఆ రెండవ వ్యక్తి జీతం / పింఛను నుంచి కంట్రిబ్యూషన్‌ను డిడక్ట్‌ చేయటం జరుగుతుందా?

జిఓ ఎంఎస్‌ నెం.174 హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (ఎం2) డిపార్ట్‌మెంట్‌, డేట్‌ 01.11.2013 లోని పేరా 6.3 ప్రకారం భార్యాభర్తలిద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా సర్వీస్‌ పెన్షనర్లు అయితే, ఎవరో ఒకరు కంట్రిబ్యూట్‌ చేస్తే సరిపోతుంది. అటువంటి సందర్భంలో తమ భార్య / భర్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యగి / సర్వీస్‌ పెన్షనర్‌ అని డిక్లరేషన్‌ ఇస్తూ, వారి ఎంప్లాయీ కోడ్‌ / పెన్షనర్‌ కోడ్‌ను తెలియజేయాలి.
పథకం క్రింద మొత్తం కుటుంబానికి రేషన్‌ కార్డు వంటి ఒకే కార్డును ఇస్తారా?
లేదు. ఉద్యోగికి, పింఛనుదారుకి, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వ్యక్తిగత కార్డులను ఇస్తారు.
పథకం క్రింద ఉద్యోగి / పింఛనుదారు చందా ఎంత వుంటుంది?
నెలసరి చందా రూ.90 (I నుంచి IV వరకు పే గ్రేడ్స్‌ వున్న స్లాబ్‌ ఎ ఉద్యోగులు, V నుంచి XVII వరకు పే గ్రేడ్స్‌ వున్న స్లాబ్‌ బి ఉద్యోగులు) . నెలసరి చందా రూ.120 (XVIII నుంచి XXXII వరకు పే గ్రేడ్స్‌ వున్న స్లాబ్‌ సి ఉద్యోగులు) . పింఛనుదారు సర్వీస్‌ నుంచి పదవీ విరమణ చేసిన పోస్ట్‌ ప్రస్తుత పే గ్రేడ్‌ను బట్టి సర్వీస్‌ పింఛనుదారులు లేదా కుటుంబ పింఛనుదారుల చందా ఆధారపడివుంటుంది.

పింఛనుదారుకు ఆరోగ్య కార్డు ఎక్కడ నుంచి జారీ అవుతుంది?
  • ఆరోగ్య కార్డును ట్రస్ట్‌ జనరేట్‌ చేసి, పింఛనుదారు లాగిన్‌లో వుంచుతుంది. యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తూ పింఛనుదారు పోర్టల్‌లోకి లాగిన్‌ అయి, ఆరోగ్య కార్డును డౌన్‌లోడ్‌ చేసి, ప్రింట్‌ తీసుకోవాలి. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం క్రింద నెట్‌వర్క్‌ ఆసుపత్రులలో చికిత్స తీసుకొనేందుకు దీనిని ఉపయోగించవచ్చు.
  • భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు / పింఛనుదారులు అయితే, ఎవరు కంట్రిబ్యూషన్‌ చెల్లించాలి?
  • ఉద్యోగి / సర్వీస్‌ పింఛనుదారులలో ఎవరో ఒకరు చెల్లిస్తే సరిపోతుంది.
నిరుద్యోగి అయిన కుమార్తె, అవివాహిత అయితే, ఆమెకు పథకం వర్తిస్తుందా?
  • అవును. అవివాహితలు, భర్త మరణించిన వారు లేదా విడాకులు తీసుకున్న వారు లేదా భర్త వదిలిపెట్టిన కుమార్తెలు నిరుద్యోగిగా వుంటే, వారు అర్హులవుతారు. తర్వాత వారికి వివాహం జరిగితే, వారు అనర్హులవుతారు.
25 సంవత్సరాల వయస్సు దాటిన కుమారుడి పేరును తొలగించే అధికారం ఎవరికి వుంటుంది?
  • ఉద్యోగి / పింఛనుదారు పేర్కొన్న కుమారుడి జన్మదినం వివరాలు సిస్టమ్‌లో వుంటాయి. 25 సంవత్సరాల వయస్సు దాటిన కుమారుడిని సిస్టమ్‌ ఆటోమాటిక్‌గా అనర్హుడిగా చేయటంతో పాటు అతడి ఆరోగ్య కార్డును ఇన్‌వాలిడేట్‌ చేస్తుంది.
నా పాస్‌వర్డ్‌ మర్చిపోయాను. కొత్త పాస్‌వర్డ్‌ను రీసెట్‌ చేయటం ఎలా?
  • హోమ్‌ పేజీలో సైన్‌ ఇన్‌ బటన్‌ను క్లిక్‌ చేసిన తర్వాత 'ఫర్‌గాట్‌ పాస్‌వర్డ్‌' పై క్లిక్‌ చేయాలి. సిస్టమ్‌ జెనరేట్‌ చేసిన పాస్‌వర్డ్‌ దరఖాస్తుదారు మొబైల్‌ నెంబరుకు, ఇ మెయిల్‌ ఐడికి అందుతుంది.
కొన్ని వివరాలను తప్పుగా వ్రాసి దరఖాస్తును ట్రస్ట్‌కు సమర్పించటం జరిగింది. వీటిని సరి చేయటం ఎలా?
  • పింఛనుదారుల విషయంలో ఒకసారి సమర్పించిన తర్వాత, వ్యక్తిగతంగా దానిని సరిచేయటానికి కుదరదు. ట్రస్ట్‌ / ఎస్‌టిఓ / ఎపిపిఓ దరఖాస్తును తిరస్కరించినప్పుడు దరఖాస్తుదారు వివరాలను సరిచేసి, అంగీకారం కోసం తిరిగి సమర్పించాలి. లేదా ఫిర్యాదును బట్టి ట్రస్ట్‌ జెఇఓ (ఇహెచ్‌ఎస్‌) సరిచేయవచ్చు. ఉద్యోగుల విషయంలో, డిడిఓలు ఆర్థిక శాఖకు అందజేసిన హెచ్‌ఆర్‌ఎంఎస్‌ డేటాను ఉపయోగిస్తూ ఆరోగ్య కార్డులను జారీ చేయటం జరుగుతుంది. అందజేసిన సమాచారంలో తప్పులను సరిచేసే అవకాశం ఉద్యోగులకు వుంది. ఉద్యోగులు ఆధార్‌ వివరాలను ఎడిట్‌ చేయవచ్చు. ఇతర వివరాలను ఎడిట్‌ చేయటానికి కుదరదు.
పాస్‌వర్డ్‌ను మారుస్తున్నప్పుడు నా మొబైల్‌ నెంబరును తప్పుగా పేర్కొనటం జరిగింది. ఇపుడు నేను ఏం చేయాలి?
  • అటువంటి సందర్భాలలో, తగు చర్య తీసుకొనే నిమిత్తం www.ehf.gov.in పోర్టల్‌లో యూజర్‌ ఐడి, పేరు, అసలు మొబైల్‌ నెంబరు వివరాలను తెలియజేస్తూ ఫిర్యాదు చేయాలి.
  • ఇచ్చిన యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌లతో నేను లాగిన్‌ కావాలనుకొన్నప్పుడు, 'ఇన్‌వాలిడ్‌ యూజర్‌ ఐడి లేదా పాస్‌వర్డ్‌' అనే హచ్చరిక సందేశం వస్తోంది. నేను ఏమి చేయాలి?
  • ఇన్‌వాలిడ్‌ యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌ ఏదీ వుండదు. రిజిస్టర్‌ చేసుకొన్న మొబైల్‌కు 8 డిజిట్‌ల పాస్‌వర్డ్‌ను ఎస్‌ఎంఎస్‌ చేయటం జరుగుతుంది. ఇమెయిల్‌కు కూడ పంపటం జరుగుతుంది. ఈ 8 డిజిట్‌ల పాస్‌వర్డ్‌ "nAI0xQk7"  (కేస్‌ సెన్సిటివ్‌) లా వుంటుంది. దీనిని సరిగా ఎంటర్‌ చేయాలి.
పింఛనుదారు దరఖాస్తును ట్రస్ట్‌ / ఎస్‌టిఓ / ఎపిపిఓ కొన్ని రిమార్కులతో తిరస్కరించారు. తిరిగి సమర్పించేందుకు అనుసరించవలసిన ప్రక్రియ ఏమిటి?
  • రిమార్కుల ప్రకారం సరిచేసి, దానిని వెరిఫికేషన్‌ మరియు అంగీకారం నిమిత్తం తిరిగి సమర్పించాలి.
  • ధార్‌ కార్డులో వున్న ఉద్యోగి / పింఛనుదారు పేరుకూ సర్వీస్‌ రిజిస్టర్‌ / పిపిఓ కాపీలో వున్న పేరుకూ కొంత వ్యత్యాసం వుంది. నేను ఏ పేరు ఎంటర్‌ చేయాలి?
  • సర్వీస్‌ రిజిస్టర్‌ / పిపిఓ కాపీలో వున్న పేరు వ్రాయండి.
పింఛనుదారులు నమోదయ్యేందుకు చివరి తేదీ ఏది?
  • పింఛనుదారులు నమోదు అయ్యేందుకు చివరి తేదీ అంటూ ఏదీ లేదు.
లబ్ధిదారులకు ఎస్‌ఎంఎస్‌ను ఎప్పుడు పంపుతారు?
  • దరఖాస్తుదారు రిజిస్టర్‌ చేసుకొన్న మొబైల్‌ నెంబరుకు క్రింద సూచించిన సందర్భాలలో ఎస్‌ఎంఎస్‌ పంపటం జరుగుతుంది.
  • ఎ). దరఖాస్తుదారు పాస్‌వర్డ్‌ మారుస్తున్నప్పుడు
  • బి). దరఖాస్తుదారు ''ఫర్‌గాట్‌ పాస్‌వర్డ్‌'' ఆప్షన్‌ను ఎంచుకొన్నప్పుడు
  • సి). పింఛనుదారు దరఖాస్తు సమర్పించినప్పుడు
  •  
  • డి). ట్రస్ట్‌ / ఎస్‌టిఓ / ఎపిపిఓ దరఖాస్తును అంగీకరించినప్పుడు / తిరస్కరించినప్పుడు / నిలిపివేసినప్పుడు
మీ సేవ కేంద్రాలలో నమోదు చేయవచ్చా? అవును అయితే, ఎంత రుసుము చెల్లించాలి?
  • అవును. ఆరోగ్య కార్డుల జారీ నిమిత్తం మీ సేవ కేంద్రాలు నిర్ధారిత రుసుమును స్వీకరిస్తూ, పింఛనుదారుల పేర్లను నమోదు చేయవచ్చునంటూ ప్రభుత్వం / ది డైరెక్టర్‌, ఇఎస్‌డి (మీ సేవ) ఉత్తర్వులను జారీ చేసింది.
  • ఎ. పింఛనుదారులకు రూ.35
  • బి. ఆధారపడిన కుటుంబ సభ్యులకు, ఒక్కొక్కరికి, రూ.15
  • సి. ప్రింట్‌చేసిన దరఖాస్తు ఒక్కొక్క దానికి రూ.2
  • మీ సేవ కేంద్రాలలో సేవలను పైన సూచించిన రేట్ల ప్రకారం పొందవచ్చు.
  • ఎస్‌టిఓలు / ఎపిపిఓలు దరఖాస్తుల పరిష్కరణలో ఆలస్యం చేస్తున్నారు.
 ''పెండింగ్‌ విత్‌ డిడిఓ/ఎస్‌టిఓ'' అని చూపుతున్నప్పుడు ఆరోగ్య కార్డుల స్టేటస్‌ ఏమిటి?
  • ఎస్‌టిఓ/ ఎపిపిఓలను దరఖాస్తులను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఆలస్యం జరిగినప్పుడు తగు చర్య నిమిత్తం డిటిఎ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళాలి. స్టేటస్‌ ''పెండింగ్‌ విత్‌ డిడిఓ/ఎస్‌టిఓ'' అని చూపుతుంటే సమస్య ఏమీ వుండదు. పింఛనుదారులు/ ఉద్యోగులు ఆరోగ్య కార్డును డౌన్‌లోడ్‌ చేసుకొని చికిత్స నిమిత్తం ఉపయోగించుకోవచ్చు. స్పష్టమైన ఆదేశాల తర్వాత సంబంధిత డిడిఓ / ఎస్‌టిఓ పెండింగ్‌ స్టేటస్‌ను క్లియర్‌ చేస్తారు.
ఆరోగ్య కార్డు స్టేటస్‌ను తెలుసుకోవటం ఎలా?
  • ఉద్యోగి / పింఛనుదారు హోమ్‌ పేజీలో ఎడమవైపు క్రింద వున్న హెల్త్‌ కార్డ్‌ స్టేటస్‌ టాబ్‌ ద్వారా ఆరోగ్య కార్డు స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్‌ : www.ehf.gov.in
  • వైధవ్యం పొందిన / విడాకులు తీసుకున్న మరియు కుటుంబ పింఛనుదారు ఇహెచ్‌ఎస్‌ క్రింద నమోదు అవుతున్నప్పుడు మరణ ధృవీకరణ పత్రం / కోర్టు ఉత్తర్వులను జత చేయాలా?
  • మరణ ధృవీకరణ పత్రం / కోర్టు ఉత్తర్వులను జత చేయనవసరం లేదు.

సమస్యల పరిష్కారానికి కాల వ్యవధిని ఎందుకు సూచించలేదు?
  • లబ్ధిదారుల సమస్యలు వేర్వేరుగా వుంటాయి. సాధ్యమైనంత తక్కువ సమయంలో సమస్యను పరిష్కరించటానికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతం సమస్య పరిష్కారమైన వెంటనే దరఖాస్తుదారుకు జవాబు ఇవ్వటం జరుగుతోంది. అయితే, అందిన మెయిల్‌ను ముందుగా అక్నాలెడ్జ్‌ చేయమనీ, సమస్య పరిష్కారమైన తర్వాత మరొక మెయిల్‌ పంపమనీ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది.
 పరిధి
పథకంలో వర్తించే ప్రయోజనాలు ఏమిటి?

1. ఇన్‌ పేషెంట్‌ చికిత్స:
అన్ని ఎంపానెల్డ్‌ ఆసుపత్రులలో అన్ని స్పెషాలిటీల క్రింద పేర్కొన్న చికిత్సలు అందుతాయి. జాబితాను www.ehf.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు
శస్త్రచికిత్స లేదా వైద్య చికిత్సల ఫాలో అప్‌
వ్యాధి నిర్థారణ పరీక్షలు, ఔషధాలు, ఇంప్లాంట్‌లు, కన్స్యూమబుల్స్‌, ఆహారం, ఆపరేషన్‌ / చికిత్స తర్వాత పరిణామాలు, ఫాలో అప్‌ కేర్‌ వంటి వన్నీ ప్యాకేజీలో భాగంగా వుంటాయి.
చివరకు ఐపి ట్రీట్‌మెంట్‌కు దారి తీయని కన్సల్టేషన్‌లు, ఇన్వెస్టిగేషన్‌లతో సహా రోగుల ప్రీ ఇవాల్యుయేషన్‌ కూడ ప్యాకేజీలో భాగంగా వుంటుంది.

2) దీర్ఘకాలిక వ్యాధులకు ఔట్‌ పేషంట్‌ చికిత్స:
 నోటిఫై చేసిన ప్రభుత్వ ఆసుపత్రులలో దీర్ఘకాలిక వ్యాధులకు కన్సల్టేషన్‌, ఇన్వెస్టిగేషన్‌, డ్రగ్స్‌తో సహా చికిత్స వుంటుంది. పూర్తి మార్గదర్శకాలను వెబ్‌సైట్‌లో వుంచటం జరుగుతుంది.

3) వార్షిక ఆరోగ్య పరీక్షలు:

40 సంవత్సరాల వయస్సు దాటిన ఉద్యోగులకు
ఆర్థిక వర్తింపు ఎంత వుంటుంది?

ఇహెచ్‌ఎస్‌లో ఎపిసోడ్‌ల సంఖ్యకు పరిమితి ఏదీ లేకుండా, అనారోగ్యపు ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2 లక్షల ఆర్థిక పరిమితి వుంటుంది. చికిత్స వ్యయం ఈ పరిధిని మించినప్పుడు నెట్‌వర్క్‌ ఆసుపత్రులు నగదు రహిత చికిత్సను కొనసాగిస్తాయి. ముందుగా నిర్థారించిన ప్యాకేజీ రేట్లు రూ.2 లక్షలకు మించివున్నప్పుడు ఈ పరిమితి వర్తించదు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం వెలుపల తీసుకొనే చికిత్సలకు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుందా?

  • 01.12.2014 నుంచి ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణా రాష్ట్రాల వెలుపల తీసుకొనే చికిత్సలకు రీయింబర్స్‌మెంట్‌ను అనుమతించటం జరగదు.
  • ఆరోగ్యశ్రీ పథకానికి, ఉద్యోగుల ఆరోగ్య పథకానికీ సదుపాయాలు, ఆర్థిక పరిమితుల విషయంలో వ్యత్యాసం ఏమిటి?
  • గతంలో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకం పేరును 'డాక్టర్‌ నందమూరి తారక రామారావు ఆరోగ్య సేవ'గా మార్చటం జరిగింది. దారిద్య్ర రేఖకు దిగువన వున్న (బిపిఎల్‌) కుటుంబాలకు కుటుంబం మొత్తానికి సంవత్సరానికి రూ.2.5 లక్షల పరిమితితో, 1038 ప్రొసీజర్స్‌తో ఫ్లోటర్‌ బేసిస్‌లో ఈ పథకం వర్తిస్తుంది. రోగికి ఇన్‌పేషంట్‌ చికిత్సలు జనరల్‌ వార్డులో మాత్రమే లభ్యమవుతాయి. ప్రభుత్వ నెట్‌వర్క్‌ ఆసుపత్రులలో మాత్రమే చికిత్స అందించేలా 133 ప్రొసీజర్స్‌ను పేర్కొనటం జరిగింది.
  • అందరు రెగ్యులర్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు, వారిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబ సభ్యులకు ఎంపానెల్డ్‌ ఆసుపత్రుల నెట్‌వర్క్‌ (ప్రభుత్వ మరియు ప్రైవేటు)లలో ఎపిసోడ్‌ల సంఖ్యతో సంబంధం లేకుండా, ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2.00 లక్షల పరిమితితో నగదు చెల్లింపు లేకుండా చికిత్స అందించేందుకు ఉద్ధేశించినది ఉద్యోగి ఆరోగ్య పథకం. చికిత్స వ్యయం ఒకవేళ రూ.2 లక్షలకు మించినప్పటికీ, నెట్‌వర్క్‌ ఆసుపత్రి సేవలను నిరాకరించకుండా నగదు రహిత చికిత్సను కొనసాగిస్తుంది. ప్రస్తుతం 1885 ప్రొసీజర్స్‌ / థెరపీలకు సంబంధించి, సెమీ ప్రైవేట్‌, ప్రైవేట్‌ వార్డులలో అర్హతకు అనుగుణంగా చికిత్స అందించటం జరుగుతుంది. నోటిఫైడ్‌ ప్రభుత్వ ఆసుపత్రులలో దీర్ఘకాలిక ఓపి వ్యాధులచికిత్స, 40 సంవత్సరాల వయస్సు దాటిన ఉద్యోగులకు వార్షిక ఆరోగ్య పరీక్షలకు కూడ ఈ పథకం వర్తిస్తుంది.

ఉద్యోగుల ఆరోగ్య పథకం ఔట్‌ పేషంట్‌ చికిత్సకు వర్తిస్తుందా?
  • దీర్ఘకాలిక వ్యాధులకు మాత్రమే ఔట్‌ పేషంట్‌ చికిత్స నోటిఫైడ్‌ ప్రభుత్వ ఆసుపత్రులలో లభిస్తుంది. వారం రోజుల పాటు మధ్యాహ్నం 2 - 4 గంటల మధ్య, స్పెషల్‌ క్లినిక్‌లలో కన్సల్టెంట్‌ డాక్టర్‌ రోగులను పరీక్షిస్తారు. శాంపుల్‌ కలెక్షన్‌తో క్లినికల్‌ లాబొరేటరీ సేవలు, ఫార్మసిస్ట్‌, రేడియోలజీ, అందుబాటులో వుంటాయి. కన్సల్టెంట్‌ డాక్టర్‌ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్‌ ప్రకారం స్పెషల్‌ క్లినిక్‌లలో ఔషధాలను రోగికి పంపిణీ చేయటం జరుగుతుంది.
నేను ఆసుపత్రికి చెల్లింపు చేయవలసి వస్తే, దానిని తిరిగి పొందవచ్చా?
  • జిఓ ఎంఎస్‌ నెంబర్‌ 134 హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (1.1) డిపార్ట్‌మెంట్‌, డేట్‌ 29.10.2014 ప్రకారం ఉద్యోగులు / పింఛనుదారుల జీతం / పింఛను నుంచి పథకం నిమిత్తం చందా మొత్తాలను 01.12.2014వ తేదీన చెల్లింపు చేసే నవంబర్‌ 2014 జీతాలు / పింఛను మొదలు మినహాయించటం మొదలవుతుంది. ఎపిఐఎంఎ నియమాలు, 1972 ప్రకారం మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ను 01.12.2014 తర్వాత తీసుకొనే చికిత్సలకు అనుమతించటం జరగదు.

EHS Hospitals ఆసుపత్రులు;-

ఎంపానెల్డ్‌ ఆసుపత్రులు అంటే ఏమిటి?
  • నగదు రహిత చికిత్సలను లబ్ధిదారులకు అందించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో సర్వీస్‌ ప్రొవైడర్లగా నమోదు అయిన ఆసుపత్రులను ఎంపానెల్డ్‌ ఆసుపత్రులుగా వ్యవహరిస్తారు. ఎంపానెల్డ్‌ ఆసుపత్రుల జాబితా ఇహెచ్‌ఎస్‌ వెబ్‌సైట్‌లో వుంది.
  • ప్రైవేట్‌ ఆసుపత్రులలో వుండే ఆరోగ్యశ్రీ వార్డులలానే ఇవి కూడా వుంటాయా? లేక ఉద్యోగులు / పింఛనుదారులకు విడిగా వార్డులు వుంటాయా?
  • లేదు. ఇహెచ్‌ఎస్‌ క్రింద సెమీ ప్రైవేట్‌, ప్రైవేట్‌ వార్డులను అర్హత ప్రకారం ఇవ్వటం జరుగుతుంది.
  • డబ్బు చెల్లించి చికిత్స పొందే ప్రజానీకంతో సమానంగా ఉద్యోగులకు కూడ చికిత్స అందించటం జరుగుతుందా?
  • అవును. డబ్బు చెల్లించి చికిత్స తీసుకొనే రోగులతో సమానంగా చికిత్స అందించటం జరుగుతుంది.
  • ఒక్కో ఆసుపత్రిలో రోగుల సంఖ్యపై పరిమితి వుందా?
  • లేదు. ఆసుపత్రిలో చేర్చుకొనే రోగుల సంఖ్యకు సంబంధించి ఏ విధమైన పరిమితి లేదు. అయితే ఇది ఆసుపత్రిలో అందుబాటులో వున్న బెడ్‌లపై ఆధారపడివుంటుంది.
ఇహెచ్‌ఎస్‌లో నగదు రహిత చికిత్సలను పొందేందుకు, ఆసుపత్రులకు వెళ్లే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి?
  • పథకం క్రింద నగదు రహిత చికిత్సలను పొందేందుకు ఆసుపత్రి, అవసరమైన మెడికల్‌ స్పెషాలిటీ ట్రస్ట్‌ క్రింద ఎంపానెల్‌ అయ్యాయో లేదో తెలుసుకోవాలి. సమాచారాన్ని నిర్థారించుకొనేందుకు 104 - సేవా కేంద్రాన్ని సంప్రదించవచ్చు. లేదా వెబ్‌సైట్‌ చూడవచ్చు. ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత ఆసుపత్రి కియోస్క్‌ వద్ద వున్న వైద్య మిత్రకు ఆరోగ్య కార్డు ఇచ్చి రోగి పేరు నమోదు చేయించాలి.
  • ఇహెచ్‌ఎస్‌ క్రింద ఎంపానెల్‌ అయిన ఆసుపత్రులు ఏవి?
  • ఇహెచ్‌ఎఫ్‌ పోర్టల్‌ (www.ehf.gov.in) లో ఎంపానెల్డ్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల జాబితా అందుబాటులో వుంది. హాస్పిటల్స్‌ టాబ్‌ చూడండి.
  •  ''ఇహెచ్‌ఎస్‌ ఎంపానెల్డ్‌ హాస్పటల్స్‌ లిస్ట్‌'' పై క్లిక్‌ చేయండి.
  • ల్యాండింగ్‌ పేజీలో రాష్ట్రం, జిల్లా, స్పెషాలిటీ ఎంచుకోండి.
  • ''సెర్చ్‌''పై క్లిక్‌ చేయండి.
  • జిల్లాల వారీగా నెట్‌వర్క్‌ హాస్పటల్స్‌ జాబితా మీకు కనపడుతుంది.
  • నేను ఏయే ఆసుపత్రులలో చికిత్స పొందవచ్చు?
  • ఎహెచ్‌సిటితో ఎంపానెల్‌ అయిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స తీసుకోవచ్చు. ఆసుపత్రుల జాబితా (www.ehf.gov.in) వెబ్‌సైట్‌లో వుంది.
ఎంపానెల్డ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు ఎవరిని సంప్రదించాలి?
  • ఆరోగ్యశ్రీ ఆరోగ్య రక్షణ ట్రస్ట్‌కు సంబంధించిన కియోస్క్‌ ప్రతి ఎంపానెల్డ్‌ ఆసుపత్రిలో వుంటుంది. పథకం క్రింద చికిత్స పొందేందుకు ఆసుపత్రికి వచ్చే ఇహెచ్‌ఎస్‌ రోగికి సహాయం అందించేందుకు అక్కడ 'వైద్య మిత్ర' వుంటారు. ఆరోగ్య కార్డు చూపించిన తర్వాత రోగి పేరు నమోదు చేసుకొని, రోగి చికిత్సకు అవసరమైన చర్యలను వైద్య మిత్ర తీసుకొంటారు.
  • ఎంపానెల్డ్‌ ఆసుపత్రి చికిత్సకు అంగీకరించకపోతే లేదా పక్షపాత ధోరణితో చికిత్స చేస్తే నేనేం చేయాలి?
  • పోర్టల్‌లో క్రింద సూచించిన ప్రకారం ఫిర్యాదు చేయవచ్చు :
  •  ఇహెచ్‌ఎస్‌ పోర్టల్‌ (www.ehf.gov.in) లో లాగిన్‌ కావాలి. .
  •  ''సైన్‌ ఇన్‌'' పై క్లిక్‌ చేయాలి.
  • ''ఎంప్లాయీ / పెన్షనర్‌''ను ఎంపిక చేసుకోవాలి.
  • ల్యాండింగ్‌ పేజీలో ''ఎనీ ఇష్యూ / కంప్లయంట్‌''పై క్లిక్‌ చేయాలి.
  • ఫిర్యాదు వివరాలను పూర్తి చేసి, ''సబ్మిట్‌'' పై క్లిక్‌ చేయాలి.
  • లేదా
  • 104 - సేవా కేంద్రంకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి. ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌లోని గ్రీవియన్స్‌ డిపార్ట్‌మెంట్‌కు ఈ ఫిర్యాదును పంపించటం జరుగుతుంది.EHS

What is EHS ఇహెచ్‌ఎస్‌ అంటే ఏమిటి?

  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు 'ది ఆంధ్ర ప్రదేశ్‌ ఇంటిగ్రేటెడ్‌ మెడికల్‌ అటెండెన్స్‌ రూల్స్‌, 1972' క్రింద ప్రస్తుతం వున్న మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ సిస్టమ్‌లో భాగంగా ఆరోగ్య శ్రీ ఆరోగ్య రక్షణ ట్రస్ట్‌ క్రింద నమోదయిన ఆసుపత్రుల నెట్‌వర్క్‌ ద్వారా నగదు రహిత చికిత్సలను అందించేందుకు ఉద్దేశించినది ఉద్యోగుల ఆరోగ్య పథకం. (ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ - ఇహెచ్‌ఎస్‌).
  • 5 డిసెంబర్‌ 2013వ తేదీన ప్రారంభించిన ఈ పథకాన్ని జి.ఓ. ఎంఎస్‌. నెంబర్‌ 134 హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (1.1) డిపార్ట్‌మెంట్‌, డేటెడ్‌ 29.10.2014 ప్రకారం మార్పులతో ఈ పథకం ప్రస్తుతం అమలు అవుతోంది.
  • జాబితాలో పేర్కొన్న అన్ని రకాల చికిత్సలకు ఎంపానెల్డ్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల నుంచి నగదు లేని చికిత్సలను లబ్ధిదారులు పొందవచ్చు. మరింత సమాచారం కోసం *www.ehf.gov.in* వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

EHS ఎవరు అర్హులు?

  • ఎ)ఎఫ్‌ఆర్‌లో నిర్వచించిన అందరు రెగ్యులర్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రొవిన్షియలైజ్డ్‌ వర్క్‌ ఛార్జ్‌డ్‌ ఉద్యోగులతో సహా
  • బి) స్థానిక సంస్థల ప్రొవిన్షియలైజ్డ్‌ ఉద్యోగులు
  • సి) అందరు సర్వీస్‌ పింఛనుదారులు
  • డి)కుటుంబ పింఛనుదారులు
  • ఇ) తిరిగి ఉద్యోగం పొందిన సర్వీసు పింఛనుదారులు
EHS ఎవరు అర్హులు కాదు?

  • ఎ)సిజిహెచ్‌ఎస్‌, ఇఎస్‌ఐఎస్‌, రైల్వేలు, ఆర్‌టిసి, పోలీసు శాఖకు చెందిన ఆరోగ్య భద్రత, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సయిజ్‌ శాఖకు చెందిన ఆరోగ్య సహాయతల వంటి ఇతర బీమా పథకాలు వర్తించే వారు
  • బి) లా ఆఫీసర్స్‌ (అడ్వొకేట్‌ జనరల్‌, స్టేట్‌ ప్రాసిక్యూటర్స్‌, స్టేట్‌ కౌన్సెల్స్‌, ప్రభుత్వ ప్లీడర్లు, పబ్లిక్‌ ప్రొసిక్యూటర్లు
  • సి) క్యాజువల్‌, దినసరి వేతనంపై పనిచేసే కార్మికులు
  • డి) దత్తత తీసుకొన్న తల్లిదండ్రులు జీవించివుండగా, జన్మనిచ్చిన తల్లిదండ్రులు
  • ఇ) AIS officers and AIS pensioners and
  • జి) జ్యుడిషియల్‌ అధికారులు
కుటుంబ సభ్యులు అంటే ఎవరు?
  • ఎ) భార్య లేదా భర్త
  • బి) పూర్తిగా ఆధారపడిన పిల్లలు (దత్తత తీసుకొన్న పిల్లలతో సహా)
  • సి) పూర్తిగా ఆధారపడిన తల్లిదండ్రులు (దత్తత తీసుకొన్న లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రులు; కాని ఇద్దరికీ కాదు)
డి) సర్వీసు పింఛనుదారుల తరహాలోనే కుటుంబ పింఛనుదారులపై ఆధారపడిన వారు కూడ అర్హులుఆధారపడటం అంటే?
  • ఎ) తమ జీవనోపాధి కోసం పూర్తిగా ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు
  • బి) నిరుద్యోగులైన కుమార్తెల విషయంలో వారు అవివాహితులు లేదా వైధవ్యం పొందిన వారు లేదా విడాకులు తీసుకొన్న వారు లేదా వదిలిపెట్టబడిన వారు (వయస్సు పరిమితి ఆంక్షలు లేవు) అయి వుండాలి.
  • సి) నిరుద్యోగులైన కుమారులు 25 సంవత్సరాల లోపు వయస్సు వారై వుండాలి.అంకం సతీష్ కుమార్
  • డి) వికలాంగులైన పిల్లల విషయంలో ఆ వైకల్యం వారి ఉపాధికి అవరోధంగా వుండాలి.న్యాయమూర్తులు, ప్రభుత్వ ప్లీడర్లు, స్టాండింగ్‌ కౌన్సెల్స్‌ అర్హులా?కాదు, లా ఆఫీసర్లు, జ్యుడిషియల్‌ ఆఫీసర్లకు ఈ పథకం వర్తించదు.

ఉద్యోగి తల్లిదండ్రులకు ఆరోగ్యశ్రీ కార్డు వుంటే, వారు ఈ పథక ప్రయోజనాలకు అర్హులా?
  • ఆరోగ్య శ్రీ కార్డు (తెల్ల కార్డు)ను కేవలం బిపిఎల్‌ కుటుంబాలకు మాత్రమే ఇస్తారు. ఒకవేళ తల్లిదండ్రులు తమ జీవిక కోసం పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగిపై ఆధారపడివుంటే, వారి తెల్ల రేషన్‌ కార్డును రద్దు చేసి, పేదలకు ఉద్దేశించిన ప్రయోజనాలను పొందుతున్నందుకు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలను తీసుకొంటారు. తల్లిదండ్రులు స్వతంత్రంగా జీవిస్తూ, ఆరోగ్య శ్రీ కార్డు కలిగివుంటే వారికి అర్హత వుండదు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలో వారిని ఉద్యోగి చేర్చకూడదు.
తెల్ల రేషన్‌ కార్డు కలిగిన ఉద్యోగి తల్లిదండ్రులను లబ్దిదారులుగా చేర్చివుండి, ఉద్యోగి వారి పేర్లను దరఖాస్తు నుంచి తొలగించాలంటే ఏం చేయాలి?
  • తెల్ల రేషన్‌ కార్డు కలిగిన తల్లిదండ్రులను లబ్దిదారులుగా చేర్చివున్నట్లయితే, ఆ ఉద్యోగి వారి పేర్లను తొలగించేందుకు ఇహెచ్‌ఎఫ్‌ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. లేదా దరఖాస్తు నుంచి వారి పేర్లను తొలగించేందుకు సంబంధిత డిడిఓను సంప్రదించాలి.
ఉద్యోగి / పింఛనుదారుల అత్తమామలు అర్హులా?
  • కాదు. ఉద్యోగి / పింఛనుదారుల అత్తమామలు అర్హులు కాదు.
సవతి పిల్లలు ( స్టెప్‌ చిల్డ్రన్‌ ) ఇహెచ్‌ఎస్‌ సదుపాయానికి అర్హులా?
  • అవును. జి.ఓ. ఎంఎస్‌. నెం. 174, హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (ఎం2) డిపార్ట్‌మెంట్‌, తేదీ 01.11.2013 ప్రకారం స్టెప్‌ చిల్డ్రన్‌ ఇహెచ్‌ఎస్‌ ప్రయోజనాలకు అర్హులు.
దత్తత తీసుకున్న పిల్లలు లేదా దత్తత తీసుకొన్న తల్లిదండ్రులకు పథకం వర్తిస్తుందా?
  • అవును. దత్తత తీసుకొన్న తల్లిదండ్రులు లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రులలో ఎవరో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది కానీ అందరికీ కాదు. అదే విధంగా దత్తత తీసుకొన్న పిల్లలకు కూడ వర్తిస్తుంది.
నిరుద్యోగిగా వున్న కుమారుడు 25 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత కూడ ఉద్యోగిపై ఆధారపడి జీవిస్తుంటే, అతడు పథక ప్రయోజనాలకు అర్హుడా?
  • కాదు. కుమారుడికి 25 సంవత్సరాలు దాటిన పథక ప్రయోజనాలు పొందేందుకు అనర్హుడు అవుతాడు. ఉద్యోగి / పింఛనుదారుడిపై ఆధారపడిన కుమారుడు వికలాంగుడై, ఆ వైకల్యం అతడి ఉపాధికి అవరోధంగా వుంటే, పథక ప్రయోజనాలు అతడికి వర్తిస్తాయి. అయితే వైకల్య ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి.
భార్యాభర్తల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగిగా వుండి, వేరొకరు ప్రైవేటు లేదా ఇతర వైద్య బీమా పథకం క్రింద వుంటే, వారు అర్హులా?
  • అవును. కుటుంబ సభ్యులైన ఆమె / అతడిని పథక లబ్ధిదారుగా చేర్చవచ్చు. అయితే వారికి సిజిహెచ్‌ఎస్‌, ఇఎస్‌ఐఎస్‌, రైల్వే, ఆర్‌టిసి, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత వర్తిస్తుంటే, ఇహెచ్‌ఎస్‌ ప్రయోజనాలను పొందటానికి వీలులేదు.
ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత పథకం వర్తించే ఉద్యోగులు ఇహెచ్‌ఎస్‌ క్రింద నమోదుకు అర్హులా?
  • కాదు. ఉద్యోగిగా అతడు / ఆమె కి ఇహెచ్‌ఎస్‌ వర్తించదు. అయితే పదవీ విరమణ తర్వాత సర్వీస్‌ పెన్షనర్లు, కుటుంబ పింఛనుదారులకు పథక ప్రయోజనాలు వర్తిస్తాయి.
రాష్ట్రం వెలుపల నివసిస్తున్న పింఛనుదారులకు పథక ప్రయోజనాలు వర్తిస్తాయా?
  • ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు.

నమోదు:-   ఇహెచ్‌ఎస్‌లో ఉద్యోగిగా ఎలా నమోదు కావాలి?

  • ఉద్యోగి నమోదు అయ్యేందుకు ప్రత్యేక నమోదు ప్రక్రియ ఏమీ లేదు. డిడిఓలు సిఎఫ్‌ఎంఎస్‌ క్రింద ఆర్థిక శాఖకు సమర్పించిన ఉద్యోగుల డేటా (ఆధార్‌ డేటా సహా)ను ఆరోగ్యశ్రీ ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్‌కు అందజేయటం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఇహెచ్‌ఎస్‌ పోర్టల్‌లో వుంచిన కార్డులను డౌన్‌లోడ్‌ చేసి, ప్రింట్‌ చేసుకొని ఉద్యోగి, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉపయోగించుకోవచ్చు.

ఇహెచ్‌ఎస్‌లో పింఛనుదారుగా ఎలా నమోదు కావాలి?
  • ఎ) www.ehf.gov.in. వెబ్‌పోర్టల్‌లోకి లాగిన్‌ కావాలి.
  • బి) మీ యూజర్‌ నేమ్‌ p + STO ID + PPO ID ఉదా : మీ ఎస్‌టిఓ ఐడి 230, పిపిఓ ఐడి 012 అయితే మీ యూజర్‌ నేమ్‌ = p230012 అవుతుంది. మీ యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌లను ఎస్‌టిఓ / ఎపిపిఓల నుంచి లేదా '104'కు ఫోన్‌ చేయటం ద్వారా 104 - సేవాకేంద్రం నుంచి పొందవచ్చు.
  • సి) యూజర్‌నేమ్‌, పాస్‌వర్డ్‌లతో సైన్‌ ఇన్‌ అయిన తర్వాత దరఖాస్తును సమర్పించవచ్చు.
  • ట్రస్ట్‌ ఆమోదించిన తర్వాత మీకు ఆరోగ్య కార్డు లభిస్తుంది. ఇహెచ్‌ఎస్‌ జాబితాలో పేర్కొన్న ఎంపానెల్డ్‌ ఆసుపత్రులు, స్పెషాలిటీస్‌ ప్రకారం కార్డుదారులు పథక ప్రయోజనాలను పొందవచ్చు.
  • ఇహెచ్‌ఎస్‌లో నమోదు అయ్యేందుకు ఆధార్‌ కార్డు లేదా ఎన్‌రోల్‌మెంట్‌ స్లిప్‌ తప్పనిసరిగా కావాలా?
  • అవును. ఆధార్‌ కార్డు ఎన్‌రోల్‌మెంట్‌ నెంబరు వున్నా, ఇహెచ్‌ఎస్‌లో ఎన్‌రోల్‌ కావచ్చు. దరఖాస్తు ఫారంలో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నెంబరును ఏ విధంగా వ్రాయాలో సూచించటం జరిగింది.
పింఛనుదారు పథకం క్రింద నమోదు కాకపోతే, వారు పథకం కోసం కంట్రిబ్యూట్‌ చేయాలా?
  • అవును. జిఓ ఎంఎస్‌ నెంబరు 134, హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (1.1) డిపార్ట్‌మెంట్‌, తేదీ 29.10.2014 ప్రకారం పథకం క్రింద ఉద్యోగి నమోదు అయ్యారా లేదా అనే దానితో సంబంధం లేకుండా 01.12.2014న చెల్లించే నవంబర్‌ పింఛను, ఆ తర్వాత పింఛన్ల నుంచి ఆటోమాటిక్‌గా ఎస్‌టిఓ /ఎపిపిఓలు కంట్రిబ్యూషన్‌ను మినహాయిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి / పింఛనుదారు ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి / పింఛనుదారు అయిన తన భర్త / భార్యను ఆధారపడిన కుటుంబ సభ్యులుగా నమోదు చేసినప్పుడు, ఆ రెండవ వ్యక్తి జీతం / పింఛను నుంచి కంట్రిబ్యూషన్‌ను డిడక్ట్‌ చేయటం జరుగుతుందా?
  • జిఓ ఎంఎస్‌ నెం.174 హెచ్‌ఎం అండ్‌ ఎఫ్‌డబ్ల్యు (ఎం2) డిపార్ట్‌మెంట్‌, డేట్‌ 01.11.2013 లోని పేరా 6.3 ప్రకారం భార్యాభర్తలిద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా సర్వీస్‌ పెన్షనర్లు అయితే, ఎవరో ఒకరు కంట్రిబ్యూట్‌ చేస్తే సరిపోతుంది. అటువంటి సందర్భంలో తమ భార్య / భర్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యగి / సర్వీస్‌ పెన్షనర్‌ అని డిక్లరేషన్‌ ఇస్తూ, వారి ఎంప్లాయీ కోడ్‌ / పెన్షనర్‌ కోడ్‌ను తెలియజేయాలి.
పథకం క్రింద మొత్తం కుటుంబానికి రేషన్‌ కార్డు వంటి ఒకే కార్డును ఇస్తారా?
లేదు. ఉద్యోగికి, పింఛనుదారుకి, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వ్యక్తిగత కార్డులను ఇస్తారు.
పథకం క్రింద ఉద్యోగి / పింఛనుదారు చందా ఎంత వుంటుంది?
నెలసరి చందా రూ.90 (I నుంచి IV వరకు పే గ్రేడ్స్‌ వున్న స్లాబ్‌ ఎ ఉద్యోగులు, V నుంచి XVII వరకు పే గ్రేడ్స్‌ వున్న స్లాబ్‌ బి ఉద్యోగులు) . నెలసరి చందా రూ.120 (XVIII నుంచి XXXII వరకు పే గ్రేడ్స్‌ వున్న స్లాబ్‌ సి ఉద్యోగులు) . పింఛనుదారు సర్వీస్‌ నుంచి పదవీ విరమణ చేసిన పోస్ట్‌ ప్రస్తుత పే గ్రేడ్‌ను బట్టి సర్వీస్‌ పింఛనుదారులు లేదా కుటుంబ పింఛనుదారుల చందా ఆధారపడివుంటుంది.
 
పింఛనుదారుకు ఆరోగ్య కార్డు ఎక్కడ నుంచి జారీ అవుతుంది?
  • ఆరోగ్య కార్డును ట్రస్ట్‌ జనరేట్‌ చేసి, పింఛనుదారు లాగిన్‌లో వుంచుతుంది. యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తూ పింఛనుదారు పోర్టల్‌లోకి లాగిన్‌ అయి, ఆరోగ్య కార్డును డౌన్‌లోడ్‌ చేసి, ప్రింట్‌ తీసుకోవాలి. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం క్రింద నెట్‌వర్క్‌ ఆసుపత్రులలో చికిత్స తీసుకొనేందుకు దీనిని ఉపయోగించవచ్చు.
భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు / పింఛనుదారులు అయితే, ఎవరు కంట్రిబ్యూషన్‌ చెల్లించాలి?

ఉద్యోగి / సర్వీస్‌ పింఛనుదారులలో ఎవరో ఒకరు చెల్లిస్తే సరిపోతుంది.

నిరుద్యోగి అయిన కుమార్తె, అవివాహిత అయితే, ఆమెకు పథకం వర్తిస్తుందా?

అవును. అవివాహితలు, భర్త మరణించిన వారు లేదా విడాకులు తీసుకున్న వారు లేదా భర్త వదిలిపెట్టిన కుమార్తెలు నిరుద్యోగిగా వుంటే, వారు అర్హులవుతారు. తర్వాత వారికి వివాహం జరిగితే, వారు అనర్హులవుతారు.

25 సంవత్సరాల వయస్సు దాటిన కుమారుడి పేరును తొలగించే అధికారం ఎవరికి వుంటుంది?

ఉద్యోగి / పింఛనుదారు పేర్కొన్న కుమారుడి జన్మదినం వివరాలు సిస్టమ్‌లో వుంటాయి. 25 సంవత్సరాల వయస్సు దాటిన కుమారుడిని సిస్టమ్‌ ఆటోమాటిక్‌గా అనర్హుడిగా చేయటంతో పాటు అతడి ఆరోగ్య కార్డును ఇన్‌వాలిడేట్‌ చేస్తుంది.

నా పాస్‌వర్డ్‌ మర్చిపోయాను. కొత్త పాస్‌వర్డ్‌ను రీసెట్‌ చేయటం ఎలా?

హోమ్‌ పేజీలో సైన్‌ ఇన్‌ బటన్‌ను క్లిక్‌ చేసిన తర్వాత 'ఫర్‌గాట్‌ పాస్‌వర్డ్‌' పై క్లిక్‌ చేయాలి. సిస్టమ్‌ జెనరేట్‌ చేసిన పాస్‌వర్డ్‌ దరఖాస్తుదారు మొబైల్‌ నెంబరుకు, ఇ మెయిల్‌ ఐడికి అందుతుంది.

కొన్ని వివరాలను తప్పుగా వ్రాసి దరఖాస్తును ట్రస్ట్‌కు సమర్పించటం జరిగింది. వీటిని సరి చేయటం ఎలా?

పింఛనుదారుల విషయంలో ఒకసారి సమర్పించిన తర్వాత, వ్యక్తిగతంగా దానిని సరిచేయటానికి కుదరదు. ట్రస్ట్‌ / ఎస్‌టిఓ / ఎపిపిఓ దరఖాస్తును తిరస్కరించినప్పుడు దరఖాస్తుదారు వివరాలను సరిచేసి, అంగీకారం కోసం తిరిగి సమర్పించాలి. లేదా ఫిర్యాదును బట్టి ట్రస్ట్‌ జెఇఓ (ఇహెచ్‌ఎస్‌) సరిచేయవచ్చు. ఉద్యోగుల విషయంలో, డిడిఓలు ఆర్థిక శాఖకు అందజేసిన హెచ్‌ఆర్‌ఎంఎస్‌ డేటాను ఉపయోగిస్తూ ఆరోగ్య కార్డులను జారీ చేయటం జరుగుతుంది. అందజేసిన సమాచారంలో తప్పులను సరిచేసే అవకాశం ఉద్యోగులకు వుంది. ఉద్యోగులు ఆధార్‌ వివరాలను ఎడిట్‌ చేయవచ్చు. ఇతర వివరాలను ఎడిట్‌ చేయటానికి కుదరదు.

పాస్‌వర్డ్‌ను మారుస్తున్నప్పుడు నా మొబైల్‌ నెంబరును తప్పుగా పేర్కొనటం జరిగింది. ఇపుడు నేను ఏం చేయాలి?
  • అటువంటి సందర్భాలలో, తగు చర్య తీసుకొనే నిమిత్తం www.ehf.gov.in పోర్టల్‌లో యూజర్‌ ఐడి, పేరు, అసలు మొబైల్‌ నెంబరు వివరాలను తెలియజేస్తూ ఫిర్యాదు చేయాలి.
  • ఇచ్చిన యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌లతో నేను లాగిన్‌ కావాలనుకొన్నప్పుడు, 'ఇన్‌వాలిడ్‌ యూజర్‌ ఐడి లేదా పాస్‌వర్డ్‌' అనే హచ్చరిక సందేశం వస్తోంది. నేను ఏమి చేయాలి?
  • ఇన్‌వాలిడ్‌ యూజర్‌ ఐడి, పాస్‌వర్డ్‌ ఏదీ వుండదు. రిజిస్టర్‌ చేసుకొన్న మొబైల్‌కు 8 డిజిట్‌ల పాస్‌వర్డ్‌ను ఎస్‌ఎంఎస్‌ చేయటం జరుగుతుంది. ఇమెయిల్‌కు కూడ పంపటం జరుగుతుంది. ఈ 8 డిజిట్‌ల పాస్‌వర్డ్‌ "nAI0xQk7"  (కేస్‌ సెన్సిటివ్‌) లా వుంటుంది. దీనిని సరిగా ఎంటర్‌ చేయాలి.
పింఛనుదారు దరఖాస్తును ట్రస్ట్‌ / ఎస్‌టిఓ / ఎపిపిఓ కొన్ని రిమార్కులతో తిరస్కరించారు. తిరిగి సమర్పించేందుకు అనుసరించవలసిన ప్రక్రియ ఏమిటి?

రిమార్కుల ప్రకారం సరిచేసి, దానిని వెరిఫికేషన్‌ మరియు అంగీకారం నిమిత్తం తిరిగి సమర్పించాలి.
ధార్‌ కార్డులో వున్న ఉద్యోగి / పింఛనుదారు పేరుకూ సర్వీస్‌ రిజిస్టర్‌ / పిపిఓ కాపీలో వున్న పేరుకూ కొంత వ్యత్యాసం వుంది. నేను ఏ పేరు ఎంటర్‌ చేయాలి?
సర్వీస్‌ రిజిస్టర్‌ / పిపిఓ కాపీలో వున్న పేరు వ్రాయండి.

పింఛనుదారులు నమోదయ్యేందుకు చివరి తేదీ ఏది?
పింఛనుదారులు నమోదు అయ్యేందుకు చివరి తేదీ అంటూ ఏదీ లేదు.
లబ్ధిదారులకు ఎస్‌ఎంఎస్‌ను ఎప్పుడు పంపుతారు?
దరఖాస్తుదారు రిజిస్టర్‌ చేసుకొన్న మొబైల్‌ నెంబరుకు క్రింద సూచించిన సందర్భాలలో ఎస్‌ఎంఎస్‌ పంపటం జరుగుతుంది.
ఎ). దరఖాస్తుదారు పాస్‌వర్డ్‌ మారుస్తున్నప్పుడు
బి). దరఖాస్తుదారు ''ఫర్‌గాట్‌ పాస్‌వర్డ్‌'' ఆప్షన్‌ను ఎంచుకొన్నప్పుడు
సి). పింఛనుదారు దరఖాస్తు సమర్పించినప్పుడు
 డి). ట్రస్ట్‌ / ఎస్‌టిఓ / ఎపిపిఓ దరఖాస్తును అంగీకరించినప్పుడు / తిరస్కరించినప్పుడు / నిలిపివేసినప్పుడు
మీ సేవ కేంద్రాలలో నమోదు చేయవచ్చా? అవును అయితే, ఎంత రుసుము చెల్లించాలి?
అవును. ఆరోగ్య కార్డుల జారీ నిమిత్తం మీ సేవ కేంద్రాలు నిర్ధారిత రుసుమును స్వీకరిస్తూ, పింఛనుదారుల పేర్లను నమోదు చేయవచ్చునంటూ ప్రభుత్వం / ది డైరెక్టర్‌, ఇఎస్‌డి (మీ సేవ) ఉత్తర్వులను జారీ చేసింది.
ఎ. పింఛనుదారులకు రూ.35
బి. ఆధారపడిన కుటుంబ సభ్యులకు, ఒక్కొక్కరికి, రూ.15
సి. ప్రింట్‌చేసిన దరఖాస్తు ఒక్కొక్క దానికి రూ.2
మీ సేవ కేంద్రాలలో సేవలను పైన సూచించిన రేట్ల ప్రకారం పొందవచ్చు.
ఎస్‌టిఓలు / ఎపిపిఓలు దరఖాస్తుల పరిష్కరణలో ఆలస్యం చేస్తున్నారు.

 ''పెండింగ్‌ విత్‌ డిడిఓ/ఎస్‌టిఓ'' అని చూపుతున్నప్పుడు ఆరోగ్య కార్డుల స్టేటస్‌ ఏమిటి?
ఎస్‌టిఓ/ ఎపిపిఓలను దరఖాస్తులను పరిష్కరించవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఆలస్యం జరిగినప్పుడు తగు చర్య నిమిత్తం డిటిఎ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళాలి. స్టేటస్‌ ''పెండింగ్‌ విత్‌ డిడిఓ/ఎస్‌టిఓ'' అని చూపుతుంటే సమస్య ఏమీ వుండదు. పింఛనుదారులు/ ఉద్యోగులు ఆరోగ్య కార్డును డౌన్‌లోడ్‌ చేసుకొని చికిత్స నిమిత్తం ఉపయోగించుకోవచ్చు. స్పష్టమైన ఆదేశాల తర్వాత సంబంధిత డిడిఓ / ఎస్‌టిఓ పెండింగ్‌ స్టేటస్‌ను క్లియర్‌ చేస్తారు.

ఆరోగ్య కార్డు స్టేటస్‌ను తెలుసుకోవటం ఎలా?

ఉద్యోగి / పింఛనుదారు హోమ్‌ పేజీలో ఎడమవైపు క్రింద వున్న హెల్త్‌ కార్డ్‌ స్టేటస్‌ టాబ్‌ ద్వారా ఆరోగ్య కార్డు స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్‌ : www.ehf.gov.in
వైధవ్యం పొందిన / విడాకులు తీసుకున్న మరియు కుటుంబ పింఛనుదారు ఇహెచ్‌ఎస్‌ క్రింద నమోదు అవుతున్నప్పుడు మరణ ధృవీకరణ పత్రం / కోర్టు ఉత్తర్వులను జత చేయాలా?
మరణ ధృవీకరణ పత్రం / కోర్టు ఉత్తర్వులను జత చేయనవసరం లేదు.

సమస్యల పరిష్కారానికి కాల వ్యవధిని ఎందుకు సూచించలేదు?

లబ్ధిదారుల సమస్యలు వేర్వేరుగా వుంటాయి. సాధ్యమైనంత తక్కువ సమయంలో సమస్యను పరిష్కరించటానికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. ప్రస్తుతం సమస్య పరిష్కారమైన వెంటనే దరఖాస్తుదారుకు జవాబు ఇవ్వటం జరుగుతోంది. అయితే, అందిన మెయిల్‌ను ముందుగా అక్నాలెడ్జ్‌ చేయమనీ, సమస్య పరిష్కారమైన తర్వాత మరొక మెయిల్‌ పంపమనీ సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది.    Share this to your Friends Details;-
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions

No comments:

Post a Comment