Labels

Thursday 27 April 2017

శాఖపరమైన పరీక్షలు (Departmental Tests) ఎవరు రాయాలనే సందేహం

శాఖపరమైన పరీక్షలు (Departmental Tests)

ఎవరు రాయాలనే సందేహం చాలామంది ఉపాధ్యాయుల్లో ఉంటుంది.


దానిపై కొంత వివరణ మీ కోసం అందించే ప్రయత్నం చేస్తున్నాము.

G.O.Ms.No.29&30 Edn తేది: 23-06-2010 ప్రకారం

అప్రయత్న పదోన్నతి పథకం:(AAS)

అప్రయత్న పదోన్నతి పథకం(AAS) లో భాగంగా SGT క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సం ॥ స్కేలు పొందుటకు  GOT&EOT పరీక్షలు ఉత్తీర్ణులు కానవసరం లేదు.

 కాని 24 సం॥ స్కేలు పొందుటకు ఖచ్చితంగా GOT&EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.ఎటువంటి మినహాయింపు లేదు.

స్కూల్ అసిస్టెంట్ తత్సమాన క్యాటగిరి ఉపాధ్యాయులు 12 సం॥ పొందుటకు GOT&EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.

పదోన్నతులు(PROMOTIONS):

స్కూల్ అసిస్టెంట్ లు  గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ప్రమోషన్ పొందుటకు GOT,EOT పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి.

 సర్వీసలో ఒక్క ప్రమోషన్ కూడా తీసుకొనివారు 45 సం॥ వయస్సు దాటితే ప్రస్తుతము పనిచేయుచున్న క్యాటగిరి నుండి పై క్యాటగిరి కి  ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.

 50 సం॥ పైబడినవారు ప్రమోషన్ కొరకు ఎటువంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.

 Spl.Language Test Higher&Lower Standard paper Code.37 ఎవరు వ్రాయాలి:

 ఇంటర్మీడియట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Higher Standard) వ్రాయాలి.

పదవ తరగతి ఆ పై స్థాయిలో హిందీ/ఉర్దూ ఒక భాషగా చదవని ఉపాధ్యాయులు (Lower Standard) వ్రాయాలి.

డిపార్టుమెంటల్ పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులకు OD సౌకర్యం ఉంటుందా?

 ఫండమెంటల్ రూల్ 9(6)(b)(iii) ప్రకారం నిర్బంధ శాఖీయ పరీక్షకు(Compulsory) హాజరగుటకు ఎన్నిసార్లైనా OD సౌకర్యం కల్పించవచ్చును.

 అయితే ఐచ్చిక పరీక్షకు(OPTIONAL) హాజరగుటకు రెండుకంటే ఎక్కువసార్లు OD  రాయితీని ఇవ్వరాదు

Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Click:-
Share this to your Friends

No comments:

Post a Comment